Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 3525 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Monday, January 30, 2023 - 10:05 am: | |
మహాభారతంలో "హిడింబి" అనే రాక్షసి గురించి అందరికి తెలుసనుకుంటా. అయితే మాహాభారతం తర్వాత హిడింబి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆదిపర్వంలో 18వ ఆశ్వాసం కొన్ని కారణాలవల్ల భీముడు హిడింబిని పెళ్లాడతాడు అది వేరే కథ. భీమసేనుడు ఆమెను పెళ్ళాడిన తరువాత విడిచి వెళ్ళడానికి ఆమె అనుమతిస్తేనే అందుకు అంగీకరిస్తానంటాడు. హిడింబి అందుకు అంగీకరించి భీముని పెళ్ళాడుతుంది. ఘటోత్కచుడు వీరిరువురి కుమారుడు. అతని మంత్రతంత్ర విద్యలకు తను తప్ప ఇంకెవ్వరూ సాటి రారని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు. పెరిగి పెద్దైన తరువాత మంచి యోధుడయ్యి. యుద్ధంలో తన మంత్రతంత్రాలతో కౌరవ సైన్యాన్ని కకావికలు చేసిన దైర్యశాలి. కానీ కర్ణుడి చేతిలో ఓడిపోతాడు. తండ్రి, భర్త కొడుకు లేని హిడింబి అలా అడవిలో బాధ పడుతుంటే చూస్తూ ఉండలేక తన జాతి రాక్షసులు కొందరు తమ రాక్షస ప్రవృత్తితో మనుషుల్ని కొటిన్నూటొక్క విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలా వారి వంశీకులే కొందరు కలికాలంలో #HindenbergResearch అని కంపెనీ స్థాపించి భరతమాత ముద్దు బిడ్డ అయిన ఆదానీ వ్యాపారంపై పడి నష్టాల పాలు చేశారు అని ఐతిహాసిక నిపుణులు ఒక అంచనాకు వచ్చారు. |