Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 72555 Registered: 05-2004
Rating: Votes: 1 | Posted on Wednesday, December 01, 2021 - 9:17 am: | |
Fanno1:very difficult to express..
Yes it is.. tried something
quote: జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అన్నారు, కానీ మీరు వెళ్ళిపోతే ఆ కుటుంబం ఏకాకి అవుతుంది అని తెలిసి ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? తెలుగు పాట లో కొంత వేదాంతం కొంత ఆలోచన కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు అని తెలిపిన మీరు ఆ పాటని వదిలేసి ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? ఏ గాల్లో నిన్ను తరుముతుంటే ఆగాలో లేదో తెలియదంటే ఎలా అని చెప్పి అలాంటి గాలి మిమ్మల్ని తరిమితే ఆగకుండా ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? జవాబు దొరకకుండా ప్రశ్న లాగ మిగిలిపోతాను అని ఇంత తొందరగా వెళ్లి అందరికి ప్రశ్న లాగా ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? మీ పాటకి న్యాయం చెయ్యగలిగిన ఏకైక గాత్రం ఎక్కడికి వెళ్లిందో అని వెతుక్కుంటూ వెళ్లిపోయారా?? మీ ప్రశ్నలు మీవే అని బదులు ఇవ్వకుండా ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? సముద్రం అంత నిధి ఇచ్చి అందులో ఏమి వెతుక్కోవాలో తెలియకుండా ఉంటే మీరు చెంచాడు భవసాగరం ఈదటానికి చిన్న చిట్కా ఇస్తారు అనుకుంటే ఇవ్వకుండా ఎలా వెళ్ళ గలిగారు సిరివెన్నెల గారు ?? మిమ్మల్ని తీసుకెళ్లిన ఆ ఆది భిక్షువుని అడుగుదామంటే బూడిద ఇచ్ఛే వాడిని ఏమి అడుగుతాం చెప్పండి?? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా సిరివెన్నెల నిచ్ఛే జాబిలి ?? పదహారు కళలని పదిలంగా ఉంచకుండా అమావాస్యని మిగిల్చేశారా ??? తరలి వచ్చే వసంతాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు?? నిగ్గదీసి అడిగే ఆ గొంతుక ఇంక ఏది? ఐన వాడు గా అందరికి ఉంటూ అందని వాడు గా ఎక్కడికి వెళ్లిపోయారు??? మీరు లేకుండా తెలుగు పాట ఇక ఉండదు ఉండబోదు.. ఇది అక్షరాలా సత్యం.. మీ పాట ఒక పాఠం మనిషి జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉంటాడు మీ పాట ద్వారా , అలా ఉన్నంత కాలం మీరు ఉంటారు జీవించే ఒక పాఠం లాగ..
No reviews yet
|