   
Medical_miracle
Kurra Bewarse Username: Medical_miracle
Post Number: 2949 Registered: 08-2020
Rating: N/A Votes: 0 | Posted on Saturday, September 18, 2021 - 11:00 am: | |
రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు: ఐటీ శాఖ మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో గుర్తించినట్లు వెల్లడి ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి, రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. కాగా, మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు. ------------------------------ 21 Cr money Charity Accounts lone Undi kadara. Danni sonthaniki emaina vaadukuntada. He is helping every one who asks for help daily. Slow ga spend sesthadu charity lo aa 21 Cr. daani meeda Tax Kattadamentr Modi ga. |