Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 12436 Registered: 03-2004
Rating: Votes: 1 | Posted on Friday, July 23, 2021 - 8:35 am: | |
గ్రేట్ ఆంధ్ర..బ్రోకరీగిరి ముగిసింది.. జగన్‌రెడ్డి కోసం..జగన్‌రెడ్డి చేత నడపబడుతోన్న గ్రేట్ ఆంధ్ర న్యూస్ ముసుగులో వ్యూస్ బ్రోకర్‌గిరీ ముగిసింది. జగన్‌రెడ్డి ఆశీస్సులు, ప్రాజెక్టులు, నిధులు, సోషల్‌మీడియా బాధ్యతలన్నీ ఐడ్రీమ్ వాసుదేవరెడ్డికి గంపగుత్తగా కట్టబెట్టడంతో ఖంగుతిన్నాడు గ్రేటాంధ్ర వెంకటరెడ్డి. కనీసం నామినేటెడ్ పోస్టయినా దక్కుతుందని ఎదురుచూశాడు..అదీ పాయే.. టిటిడి పాలకమండలి సభ్యత్వం ఆశించాడు.. అదీ లేనట్టేనని తేలిపోయింది. ఇక అప్పటి నుంచి వైసీపీపై విషం చిమ్మడం ఆరంభించాడు. మొత్తం సాయిరెడ్డి, జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ విశ్లేషణలు పేరిట పోస్టు చేయిస్తున్నాడు. మధ్య మధ్యలో తాను న్యూట్రల్ అనిపించుకోవడానికి టిడిపిపైనా ఫేక్ కథనాలు వండి వారుస్తూ తన గబ్బు సైట్లో పెట్టేస్తున్నాడు. రోజురోజుకీ జగన్గ్రాఫ్ తగ్గడంతో వైసీపీలో చేరిన నేతలు వెనక్కి వెళ్లాలని చూస్తున్నారని, కొత్తగా చేరాలనుకుంటున్న వారూ ఆగిపోతున్నారని ఒక కథనం వేశాడు. ఉద్యోగవర్గాలలో తీవ్ర అసంతృప్తి జగన్‌రెడ్డిపై వుందని మరో రోజు విశ్లేషించి పారేశాడు. విజయసాయిరెడ్డి వల్ల జగన్‌రెడ్డికి బాగా డ్యామేజ్ అవుతోందని సిరీస్ కథనాలు గుప్పించాడు. నామినేటెడ్ పోస్టేమో కానీ... గ్రేటాంధ్ర బ్రోకరిగిరీ ముగిసిందని, ఇక ఆరికట్ల వెంకటరెడ్డికి బాబాయ్-బాత్రూమ్ స్కీమ్ తప్పదని తాడేపల్లి కాంపౌండ్ నుంచి హెచ్చరిక సంకేతాలు అందాయి. వార్నింగ్ వచ్చాక గన గబ్బుసైట్ లింకులు డిలీట్ చేసి ప్రయోజనం ఏముంటుంది? అందుకే నారా లోకేష్‌పై తప్పుడు రాతలకి దిగాడు. ఇప్పటికే సీపీఎస్ రద్దు కాకపోవడం, డీఏలు ఇవ్వకపోవడం, ఒకటో తారీఖుని జీతాలు రాక టీచర్లు మంచి కాక మీదున్నారు. తమ ఆక్రోశాన్నంతా వాట్సప్ గ్రూపులలోనూ, సోషల్‌మీడియాలోనూ పోస్టులుగా పెడుతున్నారు. మరో వైపు ఉపాధ్యాయసంఘాలన్నీ ఐకమత్యమై ధర్నాలు, నిరసనలకు దిగుతున్నాయి. టీచర్ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై ఫార్వార్డ్ చేసి ఈ పోస్టుల్నే నేరంగా ఓ టీచర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఉపాధ్యాయసంఘాలన్నీ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. సీపీఎస్ వారంలో రద్దు చేస్తామని 100 వారాలైనా రద్దు చేయలేదు, ఒకటో తేదీకి జీతాలివ్వరు, డీఏలు పెండింగ్..ఇలా సమస్యల సుడిగుండంలో పడేసి.. ప్రశ్నిస్తే సస్పెన్షన్లా? అంటూ ఆగ్రహోదగ్రులవుతున్నారు. మొత్తానికి పేటీఎం బ్యాచ్లమాదిరే ప్రీపెయిడ్ గబ్బుసైట్ ఓనర్ గ్రేట్ ఆంధ్ర వెంకట్‌రెడ్డి...తాను జగన్‌ని..ప్రభుత్వాన్ని తిడితే తాడేపల్లి బౌన్సర్లు తన్నేటట్టున్నారని గుర్తించి...ఇలా వివిధవర్గాలని ప్రభుత్వంపైకి ఎగదోసేలా రాతలు రాస్తూ ఆనందం పొందుతున్నాడు. మొత్తానికి ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి అన్నీతానై తాడేపల్లి క్యాంపస్‌కి సెట్ అవడంతో గ్రేట్ ఆంధ్ర వెంకటరెడ్డి బ్రోకరీగిరి ముగిసింది. #PAYTMDogs |