Kodibochu
Yavvanam Kaatesina Bewarse Username: Kodibochu
Post Number: 6416 Registered: 04-2019
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 24, 2021 - 8:58 am: | |
నాకు నచ్చని విషయాలు (1)నీటిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. (2)అలాగే పచ్చని చెట్లని నరికే వాళ్లంటే నాకు చాలా కోపం. ఎప్పుడైనా చెట్టుకొమ్మ విరవాల్సి వస్తే చాలా బాధ పడతాను. ఎండిపోయిన చెట్లు కొట్టడం వేరు. పచ్చగా ఉండే చెట్లను కళ్లెదుట నరుకుతుంటే నేను సహించలేను. (3)అలాగే ఎటువంటి పనీపాటా లేకుండా గంటల తరబడి సెల్ఫోన్ మాట్లాడేవాళ్లంటే నాకు కోపం. అది కాస్త తగ్గించుకోమని చెబుతుంటాను. (4)అలాగే మరో విషయం. బతకడానికి తినాలి. అంతేకానీ తినడం కోసం బతకకూడదు. చాలా మందిని చూస్తుంటాను. వాళ్లు తినడం కోసమే బతుకుతుంటారనిపిస్తుంటుంది. దొంగతనం చేయడం కంటే పెద్ద నేరం ఏమిటంటే నలుగురు తినాల్సిన అన్నాన్ని ఒక్కడే తినడం. (5)పరుషంగా మాట్లాడటం, అయినదానికి కాని దానికి పక్కవాడిని నిందించడం మంచి లక్షణం కాదు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నోటిని అదుపులో ఉంచుకోవాలి. (6)కోపాన్ని చంపేసుకోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. |