Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 71754
Registered: 05-2004

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 16, 2021 - 9:34 am:   

పద్మశ్రీ డా. కాకర్ల సుబ్బారావు ~

గొప్ప మ్యాథమెటీషియన్‌ కావానుకుని రేడియాలజిస్ట్‌ అయిన ఒక వైద్యుడి ఫెయిల్యూర్‌ స్టోరీ ఇది....

నిత్యం రోగుతో కిటకిటలాడుతున్న నిమ్స్‌ వైద్య నిలయంలో తెల్లని బట్టల్లో, ఆరోగ్యంగా తిరుగుతూ కనిపించే ఆజానుబాహువు కాకర్ల సుబ్బారావు. ఆయన మెడలో స్టెతస్కోప్‌ లేదు గానీ నిమ్స్‌ ఉచ్ఛ్వాస నిశ్వాసలను పై ఫ్లోర్‌లోంచి ఆయన ఏకాగ్రతతో వింటున్నట్టే ఉన్నారు.
మీ జీవితంలోని అపజయాలను పంచుకునేందుకు వచ్చానని చెప్పినప్పుడు ఆయన చెంపకు రెండు చేతులు ఆనించుకుని కొంతసేపు ఆలోచనా ముద్రలో ఉండిపోయారు.

అనుమానం వేసింది. అంతర్జాతీయంగా పేరొందిన ఈ రేడియాలజిస్ట్‌ జీవితంలో చెప్పుకోదగిన వైఫల్యాలు లేవేమో అనిపించింది. ఇంతలో గొంతు సర్దుకుని ‘‘నా జీవనయానంలో అనేక వైఫల్యాన్నాయి. యు.నో. నేను అరడజను సార్లు సూయిసైడ్‌ అటెంఫ్ట్‌ చేశాను’’ అన్నారాయన అకస్మాత్తుగా. అదిరిపడ్డాను.

‘‘మేడిపండు చూడు మేలిమై వుండు. పొట్టవిప్పి చూడు పురుగుండు’ అన్న వేమన పద్యం గుర్తుందా? వైఫల్యాలకు సంబంధించి ఈ పోలిక నా జీవితానికీ వర్తిస్తుంది’’ అన్నారాయన.

‘‘నన్ను నేను విజేతగా భావించను. ఐ డోంట్‌ ఫీల్‌ ఐయామ్‌ ఎ సక్సెస్‌ఫుల్‌ మాన్‌. అనేకానేక వైఫల్యాల తాకిడికి నేను నిబ్బరంగా వుండవచ్చుగాక, అలా అని నేను విజేతను మాత్రం కాను’’ అంటూ తన ఫెయిల్యూర్‌ స్టోరీని ఎంతో వినమ్రంగా విప్పి చెప్పారాయన.

+++

‘‘పుట్టిన దగ్గర్నుంచే నాది ఫెయ్యిూర్‌ స్టోరి. నేను పుట్టినప్పుడు చూడటానికి మా నాన్నగారు రాలేదు. ఆయనకు అమ్మాయి పుట్టాలని ఉండేదట. దాంతో పుట్టినప్పటి నుంచే నా బ్రతుకు భారంగా మారింది. భారంగానే పెరిగాను. ఎదిగే వయసులో నేను చాలా హర్ట్‌ అవాల్సి వచ్చేది. అది నన్ను మానసికంగా బాగా క్రుంగ దీసేది. ఎన్నో విషయాలు. అందులో ఒకటి, మా ఇండ్లలో కౌరవు పాండవులకుమల్లే పాలోళ్ల తగాదాుండేవి. ఇద్దరికీ మంచిగా వుండాలని ప్రయత్నించి విఫమయ్యేవాడిని.

మా ఇంట్లో బండినిండా మగ్గిన మామిడిపళ్లుండేవి. బయటి పిల్లలు దొంగతనం చేస్తుంటే మా నాన్నకు చెప్పేవాడిని. ‘పిల్లలు... వారలాగే చేస్తారు. అయితే ఏంటి?’ అని తిరిగి నన్నే ప్రశ్నించేవారు. నాకు అయోమయంగా వుండేది.

ఎదిగే వయసులో మరొక విచిత్రం`పనిమనుషులు. వారిని మా ఇంట్లో చీప్‌గా చూసేవారు. కూలి డబ్బుకోసం ఇంటిముందు గంటలకొద్దీ వేచి వుండేవారు. నేను వెళ్లి చెబితే ‘ఇవన్నీ నీకెందుకోయ్‌’ అంటూ కసురుకునేవారు. ఇలాంటి ఘటనలతో నేను బాగా హర్ట్‌ అయ్యేవాడిని.

బడికి వెళ్లే రోజు. అదొక సెన్సిటివ్‌ ఏరియా. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. సెకండ్‌ క్లాసులో ప్యాసయ్యాను. గణితంలో మంచి మార్కు వచ్చాయి గానీ ఇంగ్లీషులో అంత స్కోర్‌ చేయలేదు. మచిలీపట్నంలోని హిందు కాలేజీలో చేరాలని వెళ్లాను. నా ఇంగ్లీషు మార్కులు చూసి ‘ఇంత పూరా’ అన్నారు. అర్థం కాలేదు. నిజానికి ఆ పూర్‌ మార్కులే మా సూల్లో ఫస్టు మార్కులు. ఆ సంగతి వారికి ఎలా చెప్పాలో బోధపడలేదు.మొత్తానికి ఎలాగోలా అడ్మిషన్‌ సంపాదించాను.

కాలేజీ చదువు పూర్తయేసరికి గణితంలో ఆసక్తి పెరిగింది. గొప్ప మ్యాథమేటిషియన్‌ కావానేది అప్పటి నా ఆశయం. కానీ పేరెంట్స్‌, రిలెటివ్స్‌ బ్రెయిన్‌ వాష్‌ చేశారు. ‘ఫస్ట్‌ క్లాసులో ప్యాసయ్యావు, ఇంజనీరింగ్‌ చదవాల్సిందే’ అని పట్టుబట్టారు. కానీ అందులో సీటు రాలేదు. షెడ్యూు కులాలు, తరగతుల వారికి రిజర్వేషన్లు ఇవ్వడం అప్పటినుంచే ప్రారంభించారు. దాంతో మెరిట్‌ వున్నా నాకు సీటు రాలేదు. దాంతో విధిలేక బి.ఎ.లో చేరాను.

అంతకుముందే ఒక స్నేహితుడు నాలుగొందలు ఖర్చుపెట్టి తనకూ, నాకూ మెడిసిన్‌ అప్లికేషన్‌ ఫామ్స్‌ తెచ్చి దరఖాస్తు చేశాడు. అనుకోకుండా అందులో సీటు వచ్చింది. ఆ రోజుల్లో మెడిసిన్‌ ప్యాసయ్యేవారి సంఖ్య బహు తక్కువ. అదీగాక కనీసం ఆరేడేళ్లు కష్టపడితేనే చదువు పూర్తవుతుంది. ఆ తర్వాతే ఉద్యోగం. వీటికి తోడు మెడిసిన్‌ ఖరీదైన చదువు. ఇవన్నీ తెలుసు కాబట్టి మా కుటుంబం నన్ను మెడిసిన్‌ చదివిస్తుందనే నమ్మకం ఏ కోశానా లేదు. అందుకే మొదటగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి మెడిసిన్‌లో జాయినై వచ్చాను. ఇలా.. నాకేమాత్రం ఆసక్తి లేకుండానే మెడిసిన్‌ లైన్‌లోకి అడుగుపెట్టాను.

మెడిసిన్‌ పూర్తయ్యాక సర్జరీలో పై చదువు చదవాని భావించాను. విదేశాల్లో పరిశోధన చేయాలని ప్రయత్నించాను. కానీ నాకెంతో ఇష్టమైన సర్జరీలో కాకుండా రేడియాలజీలో అవకాశం దొరికింది.
చదువులోనూ ఆశాభంగాలేనా అని నిరాశకు లోనయ్యాను. కాంప్రమైజ్‌ అయి అమెరికన్‌ యూనివర్సిటిలో చేరాను. తీరా అక్కడికి వెళ్లాక తెలిసింది` కేవలం మూడొందల పడకలున్న బ్రాన్స్‌ హాస్పిటల్‌లో నేను పరిశోధను చేయాలని, లెక్చరర్స్‌ లేరు. క్లాసెస్‌ లేవు. వర్క్‌ లేదు. దాంతో నాకున్న కుతూహం, ఆసక్తి నీరుగారిపోయాయి. మరింత నిరాశకు లోనైనాను.

ఎలాగోలా ఆ చదువు పూర్తిచేసి న్యూయార్క్‌ యూనివర్సిటీలో టీచర్గా ఆఫర్‌ వస్తే జాయినయ్యాను. ఆ తర్వాత సిటీ హాస్పిటల్లో రేడియాలజిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. ఇలా జాయినయ్యానో లేదో ఒక ఉత్తరం అందింది. అమెరికన్‌ సిటిజన్‌ను కాదు గనుక ఈ ఉద్యోగం చేసే అర్హత నాకు లేదనేది అందులోని సారాంశం. చేసేదిలేక ఆ జాబ్‌ ఒదిలేశాను.

కొంతమంది స్నేహితుల సహకారంతో అమెరికన్‌ బోర్డ్‌ ఆఫ్‌ రేడియాలజిస్ట్స్‌ సర్టిఫికెట్‌ కోర్సులో చేరాను.

మళ్లీ ఉద్యోగం సంపాదించాను. కానీ అమెరికన్‌ సిటిజన్‌కు పదివే డాలర్లు ఇస్తే నాకు ఐదువేల డాలర్లే ఇచ్చేవారు. ఈ వివక్ష భరించలేకపోయాను. తిరిగి బయటకు వద్దామని అనుకుంటున్న దశలో ఇండియానుంచి ఒక ఆఫర్‌ వచ్చింది. ఆ రోజుల్లో మద్రాస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ లక్ష్మణస్వామి మొదలియార్‌, మాజీ మినిస్టర్‌ రాజ్‌ కుమారి అమృత్‌కౌర్‌, మరికొందరు ‘ఆల్‌ ఇండియా ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ను ఢల్లీలో స్థాపిస్తున్నారు. వీరంతా సెక్షన్‌ కమిటీ సభ్యులు. ‘నువ్వు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయాలి. వెంటనే రమ్మ’ని కబురు చేశారు. తీరా నేను వచ్చేసరికి మినిస్ట్రీ మారిపోయింది. ఈ కమిటీ అప్రూవ్‌ చేసిన జాబితా క్యాన్సల్‌ అయింది. రోడ్డుమీద పడ్డాను.

ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు ఏదైనా ఉద్యోగం చూడండని స్టేట్‌ గవర్నమెంట్‌ను అప్రోచ్‌ అయ్యాను. దాదాపు దేశంలోని 25 విశ్వవిద్యాయాకు, అనేక హాస్పిటల్స్‌కూ దరఖాస్తు చేసుకున్నాను. అప్పుడు తెలిసింది. నేను చేసిన ఎం.ఎస్సీగానీ, ఆమెరికన్‌ బోర్డ్‌ ఆఫ్‌ రేడియాలజీ సర్టిఫికెట్‌ గానీ క్వాలిఫైడ్‌ కాదని, వాటికి ఏ విలువా లేదని, షాక్‌ తిన్నాను.

అష్టకష్టాలుపడి ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో హానరరి రేడియాలజిస్ట్‌గా ఉద్యోగం సంపాదించుకున్నాను. నెలకు రూపాయి జీతంపైన. ఇది 1956లోని సంగతి. అదే టైంలో నా ప్రాపర్టీస్‌ అమ్మేసి సికింద్రాబాద్‌లో ఒక ప్రేవైట్‌ క్లినిక్‌ను ప్రారంభించాను. రోజులు గడుస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్‌లో రేడియాలజి ప్రొఫెసర్‌ నయ్యాను. తర్వాత ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను మానివేశాను. ఆ రోజుల్లో ఇద్దరు కొలీగ్స్‌తో కలిసి కామన్‌వెల్త్‌ స్కాలర్‌గా ఇంగ్లాండ్‌ వెళ్లాను. అక్కడ ఉన్నప్పుడు తెలంగాణ అజిటేషన్‌ గురించి విన్నాం’’ అని చెప్పి కాసేపు విశ్రాంతికోసం ఆగారు.

+++

‘‘ఆంధ్రప్రదేశ్‌ తిరిగి వచ్చేసరికి పోలీస్‌ ఎస్కార్ట్‌ కనిపించింది. కొన్ని రోజు గడిచాయో లేదో ఒక రాత్రి నా స్నేహితుడి ద్రాక్షతోటను నాశనం చేశారు. మరికొన్ని రోజుల తర్వాత టోలిచౌక్‌లో వున్న మా ఇంటిని దహనం చేశారు.

ఆ బాధలో ఉండగానే మా పిల్లలను బెదిరించారు. అందులో ఒక అబ్బాయి ఎంత షాక్‌కు గురయ్యాడంటే ఇప్పటికీ కోలుకోలేదు. మానసికంగా దెబ్బతిన్నాడు. వాడి మెడిసిన్‌ చదువు మధ్యలోనే ఆగిపోయింది.

బాగా డిస్ట్రర్బ్‌ అయ్యాను. ఇక ఇక్కడ ఉండాలనిపించలేదు. కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిపోయాను.

+++

లైసెన్స్‌ లేకుండా, ఫెలోషిప్‌ లేకుండా న్యూయార్క్‌ స్టేట్‌లో వుండటం కష్టం. అందుకని స్నేహితు సహకారంతో మళ్లీ లైసెన్స్‌ తీసుకున్నాను. ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో జాయినయ్యాను.
ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం అక్కడ పనికిరాలేదు. దాంతో తిరిగి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించి నాలుగేళ్లు పనిచేశాను. తర్వాత అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా రెండేళ్లు పనిచేశాను. ఆ తర్వాత ప్రొఫెసర్‌ అయ్యాను. అంటే ఆరేళ్ల తర్వాత తిరిగి ఇక్కడి స్థాయి సంపాదించాను.

అప్పుడే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (తానా) స్థాపించాను. అలాగే న్యూయార్క్‌లో తెలుగు లిటరరి అండ్‌ కల్చరల్‌ సొసైటి ప్రారంభించాను. సొసైటి ఆఫ్‌ ఇండియన్‌ రేడియాలజిస్ట్స్‌ అనే సంస్థను కూడా అప్పుడే నెలకొల్పాను. భారతీయ కమ్యూనిటి ఒకరికొకరు సహకరించుకోవాలని, అమెరికాలో తగిన గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో వీటిని స్థాపించడంలో చొరవ తీసుకున్నాను.

అప్పుడే ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ కోసం అమెరికాకు వచ్చారు. ‘వై డోంట్‌ యు కమ్‌బాక్‌’ అన్నారు. అఫ్‌కోర్స్‌, అప్పటికే నేను ఇండియాకు రావాలని మనసులో అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌ ఆహ్వానం ఉపకరించింది. సరే అన్నాను. ఆయన చాలా ప్రామిస్‌ చేశారు. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి ఏమీ జరగలేదు.

నిజానికి నేను సెబాటికల్‌ లీవ్‌ పెట్టి ఇండియా వచ్చాను. ఏడేళ్లు సర్వీస్‌ చేస్తే ఒక సంవత్సరం లీవ్‌ తీసుకోవచ్చు. జీతం ఇస్తారు. కానీ నేనిక్కడకు వచ్చేసరికి పనేమీ జరగలేదు. నిమ్స్‌ను అటానమస్‌గా చేస్తే తమ అథారిటీ పోతుందని అధికారులు , వైద్యులు నిరాసక్తంగా ఉన్నారు. ఎవరూ హెల్ప్‌ చేయలేదు.

1985డిసెంబర్‌ 2కు వస్తే 1986 మార్చి వరకూ నాకు హాస్పిటల్‌ అప్పగించలేదు. దాదాపు మూడు నెలులు ఊరికే ఉన్నాను. ఊరికే అంటే సెక్రటేరియేట్‌ చుట్టూ, నిజాం చారిటబుల్‌ ట్రస్టు చుట్టూ తిరిగాను. ఒకరకంగా ఇక్కడి బ్యూరోక్రసీలోని డిలే, అధికారుల అసత్వం ఇవన్నీ చూసి ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాను. ఒక దశలో నావల్ల కాదు వెల్లిపోతానన్నాను. దాంతో ఎన్టీఆర్‌ వాళ్లందరినీ పిలిచి వారం రోజుల్లో నాకు హ్యాండోవర్‌ చేయించారు.

ఇదంతా గడిచేసరికి మూన్నెళ్లు గడిచాయి. ఇంకా నాకు మిగిలిన సమయం తొమ్మిది నెలలే. సంస్థను చేతుల్లోకి తీసుకునేసరికే మూన్నెళ్లు గడిచిపోయాయి. దీన్ని ఒక స్థాయికి తేవాలంటే చాలా టైం పడుతుందని అర్థమైంది. వెనక్కువెళ్లి రిజైన్‌ చేసి వచ్చాను.’’

+++

‘‘ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాం. ఆయన మొదట్లో నాతో బాగానే ఉండేవారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కోసం అమెరికా వెళ్లివచ్చాక గుర్రుగా వుండేవారు. ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లినప్పుడు ‘తానా’ బాగా ట్రీట్‌ చేసిందని, తనను సరిగ్గా చూసుకోలేదని ఆయన నాపై కోపంగా వుండేవారు. తిరిగి రాగానే నాతో మాట్లాడాలన్నారు. వెళ్లాను. మూడు గంటలసేపు వెయిట్‌ చేశాను. కూర్చోబెట్టుకుని నానా తిట్లు తిట్టాడు.
నిమ్స్‌ను నేనేమీ డెవలప్‌ చేయడంలేదన్నారు. ఆ మరునాడే నిమ్స్‌కు రిజైన్‌ చేశాను.

రిజైన్‌ చేసిన తర్వాత చాలామంది చంకలెగరేశారు. వచ్చాడు. వెళ్లిపోయాడు అని నవ్వుకున్నారు. మళ్లీ అమెరికా వెళతానని అనుకున్నారు. కానీ నేను వెనక్కు వెళ్లి పోవాలని రాలేదు. వైద్య విద్యా ప్రమాణాు పెంచాలని వచ్చాను. పేద ప్రజలకు ఉన్నత సౌకర్యాలు కల్పించాలని వచ్చాను. ఆ దిశలో నేను సంతృప్తి కరంగానే పనిచేశాను. పశ్చాత్తాపం కూడా లేదు.

నిమ్స్‌ కోసం ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసన్‌లో ప్రొఫెసర్‌షిప్‌ను రిజైన్‌ చేస్తున్నప్పుడు నా కొలీగ్స్‌ వారించారు. నాగట్టి పట్టుదల చూసి ‘‘మీ దేశం కరువు కాటకాలతో ఉప్పెనలతో సఫర్‌ అయినప్పుడు నువ్వు తప్పకుండా అమెరికా వస్తావు’’ అన్నారు. కానీ నేను వెనక్కి వెళ్లలేదు. పరిస్థితులు ఎంత నిరాశగా వుంటే అంత బాధ్యతగా పనిచేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను.

+++

‘‘నిమ్స్‌ నుంచి వెళ్లిపోయాక ఏం చేయాలా అని ఆలోచించాను. చివరకు మెడ్విన్‌లో హానరరిగా కొంతకాలం పనిచేశాను. ఇంతలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పిలిచారు. తిరుపతిలో ఒక వైద్య సంస్థను నెలకొల్పుతున్నాము. చైర్మెన్‌గా పనిచేయమని కోరారు. వెళ్లి రెండున్నరేళ్లు పనిచేశాను.

మళ్లీ ఎన్టీఆర్‌ వచ్చారు. క్యాబినెట్‌ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాదారుడిగా చేయమన్నారు. ఒక ఏడాది చేశాను. చంద్రబాబు వచ్చి అడ్వయిజర్స్‌ను తీసివేశారు. రాష్ట్రంలో మెడికల్‌ రిఫామ్స్‌ కమిటికి ఛైర్మెన్‌గా ఉండమన్నారు. ఉన్నాను. తర్వాత నిమ్స్‌ పరిస్థితి, ఇక్కడి ప్రమాణాు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఎవరినన్నా డైరెక్టర్‌ని చూడమన్నారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో నన్నే వుండమన్నారు. 1997 మార్చిలో మళ్లీ నిమ్స్‌కు వచ్చాను. ఇప్పటికీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాను.

జీవితంలో చాలా అడ్డంకులను ఎదుర్కున్నాను. ఎన్నో వైఫల్యాను దిగమింగాను. నాలో నేను బర్న్‌ అయ్యాను తప్ప ఎవరినీ నిందించలేదు. ముందే చెప్పినట్లు నా జీవితం సక్సెస్‌ స్టోరీ అంటారా? కానే కాదు’’ అని బాధగా ముగించారు.

కందుకూరి రమేష్ బాబు
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం- 4 ఏప్రిల్‌ 2004 సంచిక.
No reviews yet

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration