Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 12312 Registered: 03-2004
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 03, 2021 - 3:06 pm: | |
పదిహేనురూపాయలు పెట్టి విపులనో చతురనో కొననివాడు కూడా అవి ఆపేస్తున్నందుకు రామోజీరావుకు ఎప్పుడూ లాభాపేక్షే అని విమర్శిస్తున్నాడు.నాకు ఒక కార్టూన్ గుర్తొస్తుంది.అందులో భార్యాభర్తలు ఒక గాడిద ఉంటాయి.మొదటి ఫ్రేములో గాడిదమీద భార్యను ఎక్కించి అతను పక్కన నడుస్తుంటే,వీడేం మొగాడు అని సమాజం విమర్శిస్తుంది.రెండో ఫ్రేములో అతను గాడిదమీద కూర్చుని ఆమె పక్కన నడుస్తుంటే మళ్ళీ వీడేం మొగాడు భార్యని నడిపిస్తున్నాడని విమర్శిస్తారు.మూడోఫ్రేములో ఇద్దరూ గాడిదమీద కూర్చుంటే, పాపం గాడిదమీద ఇద్దరూ తమ బరువుని పడేశారని విమర్శిస్తారు.నాలుగో ఫ్రేములో ఇద్దరూ కిందకు దిగి గాడిదను నడిపించుకువెళ్తుంటే, గాడిదను పెట్టుకుని నడుచుకుని వెళ్తున్నారని విమర్శిస్తారు.కాబట్టి విమర్శించేవాడికి అన్నదాతలో/తెలుగువెలుగులో/బాల భారతంలో/చతుర/విపులల్లో కూడా రామోజీరావు కోట్లు సంపాదించినట్టే కలగంటాడు కానీ తన జేబులోనుంచి ఒక ఛాయ్ కో,కాఫీకో అయ్యేంత ఖర్చుతో ఆ పుస్తకాన్ని ఎప్పుడూ తాను కొనట్లేదనే విషయం గుర్తుకురాదు.పుస్తకప్రదర్శన ో పుస్తకాలు కొనేవాళ్ళు ఫోటోలు పెట్టుకున్నా విమర్శిస్తారు.కొనుక్కోకూడదో, కొనుక్కుని ఫోటోలు దిగకూడదో నాకర్థం కాదు.కానీ ఎప్పుడైనా మనం ఒక మంచి పుస్తకాన్ని బాగుందని రాసి పోస్టు పెడితే మాత్రం పిడిఎఫ్ ఉందా,నా నెంబర్ ఇన్బాక్స్ చేస్తాను పంపించండనో, మెయిల్ చేయండనో ఒత్తిడి చేస్తారు.భవిష్యత్తులో ఫేస్బుక్ పోస్టులనే సాహిత్యంగా భావించి బతకాలి.లేదంటే 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' కథలను కూడా సృష్టించాలి.ఏదో నవలలో చదివినట్టు మేషిన్ ముందుకెళ్ళి మనకు రొమాన్స్ ఎన్నిపాళ్ళు, క్రైం ఎన్నిపాళ్ళు కావాలో ఫీడ్ చేస్తే కథ రెడీచేసిస్తుందేమో.మనం డౌన్లోడ్ చేసుకుంటే చాలు. Source: FB |