Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 2417 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Saturday, June 06, 2020 - 2:02 pm: | |
తెలుగు మీద మక్కువ వున్న వారికి మెదడుకు మేత. సమాధానాలు అన్ని 'జ' గుణింతము లోనే వుంటాయి ప్రయత్నించండి. 1. శిక్షగా మారిన పారితోషికం. 2. కలువ ప్రియుడు వీడె అందరి వాడు. 3. ధరణిజకు మనసైన పసిడి వన్నె మెకము. 4. వంట ఇంటి దినుసురా కఱ్ఱ మొదటనుండురా. 5. తొలిచూలు గోక్షీరమధురం. 6. యుధిష్టరుని సైతం పరీక్షించిన క్రీడ. 7.' విజృంభణ' లో ద్వితీయ సంయుక్తము. 8. ఇదెనుండు దేశఘనతను గూడి గగన తలమున. 9. ఊరి వేలుపు మేలుకొలుపు లే ఇవి. 10. సాధించిన విజయానికి గుర్తుగా చేసే విజయ యాత్ర. 11. ప్రముఖ సినీ గేయ రచయిత. 12. ఇదె శిశువు పాలిట సంగీత శర్వాణి. 13. 'ద్వాదశం' పిదప 'జ' కారం. 14. శంఖం పట్టిన సంక్రాంతి అతిథి. పైని ప్రశ్నల పరికించి వాని నెల్ల పేర్చి గూర్చ జవాబులు నేర్పు గాను కాంచరో చదువరులార 'జ' గుణింతము ను కమ్మనౌపద్యమ్మున నింపుగాను. కనుక్కోండి చూద్దాం. |