Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kodibochu
Kurra Bewarse
Username: Kodibochu

Post Number: 1856
Registered: 04-2019
Posted From: 171.159.64.10

Rating: N/A
Votes: 0

Posted on Thursday, February 27, 2020 - 12:54 pm:   

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ- 2020 ఆవిష్కరణలో రాజశేఖర్ ఎమోషన్ గురించి తెలిసిందే. పెద్దలు మాట్లాడేప్పుడు మధ్యలో అడ్డు తగులుతూ క్రమశిక్షణను ఉల్లంఘించారు. మెగాస్టార్ చిరంజీవి - మోహన్ బాబు వంటి పెద్దల సమక్షంలో రాజశేఖర్ అనుచిత ప్రవర్తన 900 మంది మా సభ్యుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఆ క్రమంలోనే చిరు సీరియస్ అయ్యి రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీని కోరారు.






అనంతరం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత రకరకాల ఎమోషనల్ ఘట్టాలు తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా రాజశేఖర్ నేరుగా చిరును టార్గెట్ చేశారా? అంటే అవుననే తాజా ప్రూఫ్ వెల్లడిస్తోంది. ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చిరుని టార్గెట్ చేశారని అర్థమవుతోంది. రాజశేఖర్ నటించిన `అర్జున` చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లో ప్రత్యేకించి చిరును టార్గెట్ చేసే డైలాగ్ వేడెక్కిస్తోంది.

``పార్టీ ఓపెన్ చేయగానే టిక్కెట్లు అమ్ముకుని పని అయిపోగానే పార్టీనే అమ్ముకోడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ`` అనే డైలాగ్ ను రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ గా చెబుతున్నారు. దీంతో ఆ డైలాగ్ చిరును ఉద్ధేశించి పెట్టినదేనన్న కామెంట్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ డైలాగ్ ఎవరిని ఉద్ధేశించో ప్రత్యేకంగా చెప్పాలా? ఇన్నాళ్లు వాయిదా పడిన అర్జున చిత్రం త్వరలోనే రిలీజ్ కి వస్తోంది. థియేటర్లలో ఆ డైలాగ్ విన్న తర్వాత మెగా అభిమానులే డిసైడ్ చేస్తారేమో చూడాలి!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration