Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11940 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 30, 2019 - 2:37 pm: | |
నిన్న పండగపూట మిగిలిన సేమియా పాయసం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, పొద్దున్నే దాన్నే బ్రేక్ పాస్ట్ గా తిని, మిగిలిన దాన్ని మధ్యాన్నం లంచ్ కి ఆఫీసుకి తీసుకెళ్ళి, సాయంత్రం ఇంటికి బయలుదేరుతుండగా, పొట్టలో మొదలైన మెలోడీ సంగీతం బస్టాండుకి చేరే లోపు పాస్ట్ బీటుగా మారినా....అదనంగా ఆటోవాడికి చదివించుకోవటమెందుకని, అదృష్టం కొద్దీ ఆపద్బాంధవుడిలా వచ్చిన సిటీ బస్సులో అతికష్టం మీద సీటు సంపాయించి, ఐదు నిముషాల ప్రయాణం తర్వాత సీనియర్ సిటిజన్ కి సీటు దానం చేసి, చివరి సీటు దగ్గర గట్టిగా బిగబట్టుకుని నిలబడి, స్పీడు బ్రేకర్ల దగ్గర గాల్లోకి పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చుకుంటూ.... అరగంట ప్రయాణం తర్వాత తన స్టాపులో దిగబోతుండగా.... ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో మొదలైన అత్యంత తీవ్రమైన గాలివాన కళ్ళు తెరవటానికి కూడా అవకాశం ఇవ్వకపోయినా... భారం దేవుడి మీదేసి, ఊపిరి పొట్ట మీదేసి అతికష్టం మీద ఇంటికి చేరి, ఎక్కడివక్కడ పడేసి అదాటున బాత్రూంలోకి దూరి అరవై సెకండ్ల తరువాత, తలకాయ బయటబెట్టి వెర్రి మొఖమేసుకుని భార్యని అడిగాడు వెంగళ్రావ్... ఏమేవ్...!! #నీళ్లేందుకు_నింపలేదు అనీ.. |