Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11874 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 15, 2019 - 8:10 pm: | |
AP ki 69, TS ki 79 TMC naa? తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో 335.840 టీఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఎంఆర్‌బీ) స్పష్టం చేసింది. శ్రీశైలం జలాశయంలో 156.659 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 179.181 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 69.346 టీఎంసీలు, తెలంగాణకు 79 టీఎంసీలు కేటాయిస్తూ బోర్డు సభ్యకార్యదర్శి ఎ.పరమేశం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3.03 టీఎంసీలు, హంద్రీ-నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు 9.743, సాగర్ ఎడమ కాలువ నుంచి 5.579, కుడి ప్రధాన కాలువ ద్వారా 42.554, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు 8.49 టీఎంసీలు మొత్తం 69.346 టీఎంసీలను ఆంధ్రకు కేటాయించింది. |