Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11872
Registered: 03-2004
Posted From: 24.249.211.66

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, October 15, 2019 - 3:10 pm:   

హరికాలం-3

మొన్నటి ఎన్నికల్లో మోదీ మీకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం అసలు ఏమాత్రం ప్రభావం చూపించలేదు కాబట్టి దాని పట్టించుకోనక్కర లేదు.కానీ జగన్ గెలుపులో 90 శాతం కేసీయార్ ఎత్తుగడలే పని చేసాయి.అతను "బాబు వోడిపోతాడు!" అన్నది జోస్యం కాదు,"నేను బాబుని ఓడిస్తాను!" అని చేసిన హెచ్చరిక - ఎఫెన్సివ్ స్ట్రాటజీ పాటించేవాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది.జగన్ "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అన్నప్పుడు ..అప్పుడు బాబు స్థానంలో మోదీ గానీ కేసీయార్ గానీ ఉండి ఉంటే తెల్లారేసరికి జగన్ చచ్చి శవమై ఉండేవాడు. CBN పిరికివాడిలా కనిపించాడు - అరెస్ట్ చెయ్యలేదు, కనీసం తత్తరపడి క్షమాపణ చెప్పేలా మోరల్ బ్లాక్ మెయిల్ చేసి కార్నర్ చెయ్యలేదు,అతన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలేసింది బాబు సర్కారే!

ప్రజలు వోటు వెయ్యడం అనేది మినహాయిస్తే ఇప్పటి రాజకీయాలు కూడా చాణక్యుడి రాజనీతినే పాటిస్తున్నాయి.అప్పటి యుద్ధాల స్థానంలో ఎన్నికలు వచ్చాయి - అంతే తేడా! యుద్ధమయినా ఎన్నికైనా గెలుపుని తెచ్చిపెట్టేది వ్యూహాలే.ఎఫెన్సివ్ వాడాల్సిన చోట డిఫెన్సివ్ వాడటం ఎంత ప్రమాదకరమో డిఫెన్సివ్ వాడాల్సిన చోట ఎఫెన్సివ్ వాడటం కూడా అంతే ప్రమాదకరం.ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కేసీయార్ చేసిన అలాంటి పొరపాటే,కేసీయార్ ఇచ్చిన వార్నింగుని ఉద్యోగులు ఖాతరు చెయ్యకపోవటం అంటే సమ్మె మొదలైందే బీజేపీ ఎఫెన్సివ్ ఎటాక్ అని తెలుస్తున్నది.అన్ని లెక్కలూ వేసుకోకుండా ఎఫెన్సివ్ ఆడటానికి భాజపా తెలివితక్కువది కాదు.ఇప్పటికే కేసీయార్ పొజిషన్ వీక్ అని అందరికీ తెలుసు - దీనితో అతన్ని ఇంకొంచెం వీక్ చేసి వెన్వెంటనే ఫిరాయింపుల కౌంటర్ తెరిస్తే కేసీయార్ పని జాటర్ ఢమాలే!

మొన్నటి ఎన్నికల తర్వాత నాకో వూగిసలాట వచ్చింది - బీజేపీ మొదట జగన్ పనిపట్టి తర్వాత కేసీయార్ వైపుకి వెళ్తుందా, మొదట కేసీయార్ పనిపట్టి తర్వాత జగన్ వైపుకి వస్తుందా అని.ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది - కేసీయార్ని లేపేసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తర్వాత మంచి ముహూర్తం చూసుకుని జగన్ని లేపేసి ఆంధ్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.మరి, మీ సంగతి యేంటి?మీలో కొందరికి ఏదో ఒక రోజున భాజపా మీకు అనుకూలమై మళ్ళీ మీరు ఆంధ్రలో అధికారం చేపట్టటానికి సహాయపడుతుందనే భ్రమలో వున్నారు.అది కేవలం మూఢనమ్మకం మాత్రమే - అసలు వైకాపా ప్రచారం చేసి జ్ఞానికి ఎక్కించిన "తోడు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడల్లా ఓడిపోవటం!", "రెండుసార్లు వరస ఎన్నికల్లో గెలవకపోవటం" లాంటి మూఢనమ్మకాల్నీ తొలగించుకోకపోతే CBN తర్వాత పార్టీ బతికి బట్ట కట్టటమే చాలా కష్టం.

ఒక రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్త అయినంత మాత్రాన నాయకులు ఏది చెబితే ఏది చేస్తూ పోవడం కాదు, ఇలాంటి కఠిన వాస్తవాల్ని తెలుసుకోవాలి.క్షేత్రస్థాయిల ఏమి జరుగుతుందో పై స్థాయి వారికి చెప్పేటప్పుడు వాస్తవాలే చెప్పాలి.ఇప్పుడే CBN కూడా "బీజేపీకి దూరం కావడం వల్లనే నష్టపోయాం!" అనే ప్రకటన ఇవ్వడాన్ని బట్టి తెదెపా పై స్థాయి నాయకులు మళ్ళీ బీజేపీ సహాయం ఆశిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది.కానీ మొన్నటి రోజున దూరం కావడం మీవైపునుంచి మొదలు కాలేదు.హోదా ఇవ్వకపోవడం అంటే సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి,బాబు-జైట్లీ ప్లానులో ఎలాంటి ఇబ్బందీ లేదు.కానీ దాన్ని కూడా ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టిన తర్వాతే కదా CBN బీజేపీకి దూరం జరగాలన్న నిర్ణయం తీసుకున్నది!సరిగ్గా ఎన్నికల సమయానికి దేశంలోని నాన్ బీజేపీ పార్టీల నాయకులు ఆంధ్రలో మీరు గెలుస్తారనీ దానితో జాతీయ స్థాయిలో మోదీకి చెక్ చెప్పొచ్చుననేటంత హుషారుగా వున్నారు, అప్పుడే మర్చిపోయారా?

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration