Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11870 Registered: 03-2004 Posted From: 24.249.211.66
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 15, 2019 - 3:09 pm: | |
chadavandi... హరికాలం-1 తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యులకి రెండు నెలల క్రితమే వ్యక్తిగత సలహాని ఇవ్వాలనుకున్నాను.కానీ క్రియాశీల సభ్యులు ఎవరూ పరిచయం లేకపోవటంతో కుదరలేదు.ఎక్కడో దూరంగా చెన్నైలో ఉండి కేవలం పేపర్లలోని వార్తలు చదువుతున్న నాకే తెదెపాని కనుమరుగు చేసే ప్రమాదకరమైన దొంగాట కనిపిస్తుంటే పార్టీ వారు మాత్రం "ఇలాంటివి చాలా చూశాం,మా పార్టీని అంతం చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు!" అని బింకం ప్రదర్శించడం తప్ప వాస్తవాలని చూడడం లేదు.మీ పార్టీని భూస్థాపితం చెయ్యాలనే భాజపా ప్లాను తెలుసు కాబట్టే కేసీయార్ ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం అని కుండబద్దలు కొట్టి చెప్పగలిగాడు - మీరేమో ఎన్నికల తర్వాత కూడా "మరీ ఇరవై మూడేనా!మరీ ఇరవై మూడేనా!ఇదెలా జరిగింది?ఇదెలా జరిగింది?" అని ఆశ్చర్యపోయే అజ్ఞానంలో ఉన్నారు!వైకాపా వాళ్ళు "నువ్వు ఓడిపోవటం ఏంటయ్యా!" పేరుతో క్యామెడీలు చేస్తూ ఉన్నారు. జగన్ చంద్రబాబు పైన చేసిన ఆరోపణలకి సానుకూలంగా స్పందించకపోవటమూ కొన్నిసార్లు భాజపా స్థానిక నాయకులు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమూ చూసి భాజపా జగన్ ప్రభుత్వంతో విసిగి పోయిందనీ త్వరలోనే జగన్ ప్రభుత్వాన్ని ఏదో చేసేస్తుందనీ ఆ వెంటనే మిమ్మల్ని మళ్ళీ ఆదరించి మిత్రపక్షం చేసుకుని అధికారంలో కూర్చోబెడుతుందనీ మీలో కొందరు భ్రమలో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది.ఒకవేళ మీరు అంత అమాయకంగా లేకపోతే మంచిదే, కానీ ఆ విధమైన ఆశలతో ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ అధికారం చేపట్టలేరు. భాజపా ఎప్పటికీ తెదెపాని మిత్రపక్షం చేసుకునే అవకాశం లేదు. అప్పుడప్పుడూ విమర్శించడాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు.కానీ పోలవరం, అమరావతి పనుల్ని ఆపెయ్యడమూ ఇసుక కొరత సృష్టించడమూ, కరెంటు కోత, ప్రభుత్వ మద్యం విక్రయాలు అన్నీ ఒక క్యాలెండరు వేసుకున్నట్టు పక్కా ప్లానుతో జరుగుతున్నాయనే అనుమానం కూడా మీకు రావడం లేదు, అంత అమాయకత్వం దేనికి?అన్ని అభివృద్ధి పనుల్నీ ఆపేసింది ఆ పనుల వల్ల లబ్ధి పొందేది చంద్రబాబు/తెదెపా అనుకూల వర్గాలు కాబట్టి కాదా?వచ్చే ఎన్నికల నాటికి తెదెపాకి ఆర్ధిక సహాయం చేస్తారని అనుకున్న ప్రతి వాళ్ళనీ వ్యాపార పారిశ్రామిక ఉత్పాదక రంగాల నుంచి వెళ్ళగొట్టి ఆయా రంగాల్లో తమవాళ్ళని మర్రిచెట్లలా పాతడం కళ్ళముందు కనబడుతున్నా మీకు భయం వెయ్యడం లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడే "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద షూట్ చెయ్యాలి!" అంటే అతని వెంట్రుక కూడా పీకలేని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి, అదీ ముష్టి 23 సీట్లతో 150+ సీట్లతో అధికారంలో ఉన్నవాణ్ణి తోక కత్తిరిస్తానంటే జనాలకి నవ్వు రాదూ! ఇప్పుడు భాజపా వేస్తున్న వ్యూహం ఇంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చరిత్రలో ఏ పార్టీ కూడా వెయ్యనిది,మీరేమో లోగడ మీరు చేసిన సాహసాల్ని చూసుకుని మురిసి ముక్కలవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో కూడా మిమ్మల్ని మీరు అతిగా వూహించుకుని దెబ్బ తిన్నారు!"చంద్రబాబు వాళ్ళనీ వీళ్ళనీ కలుపుకోకుండా ఒంటరి పోరు చేసినప్పుడల్లా ఓడిపోయాడు, ఈసారి కూడా అలాగే ఓడిపోతాడు!" అనేది మూఢనమ్మకంలా ఉన్నా సరే నిజం అయిందా లేదా?దానంతటది నిజం అయిందా?లేదు వాళ్ళు ఎంత లాఘవంగా ప్రచారం చేసి దాన్ని జనంలోకి ఎక్కించి నిజం చేశారు! వాళ్ళేమో మీ పార్టీ గెలుపోటముల చరిత్రని మీకన్నా ఎక్కువ స్టడీ చేసి కనిపించిన ప్రతి లోపాన్నీ ఉపయోగించుకున్నారు, మీరేమో "జగన్ జైలు కెళ్తాడు!" పాటతోనే సరిపెట్టేశారు - ఎంత నిర్లక్ష్యం?ఎన్నికల తర్వాత ఆంధ్రలో జరుగుతున్న పరిపాలన మొత్తం ఆ రెండు పార్టీల ఉమ్మడి వ్యూహం అని మీకెందుకు తెలియడం లేదు?నేను జరుగుతాయనుకున్న రెండింటిలో ఒకటి నిజం కానున్నదని వార్తలు బయల్దేరాయి.అది పోలవరాన్ని కేంద్రం చేపట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.మీరు 90 శాతం చేసిన దాన్ని తను పూర్తి చేసి ఆ క్రెడిట్ పునాదితో ఆంధ్రని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్న పార్టీకి మిమ్మల్ని మిత్రపక్షం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భాజపా ఆంధ్రను పట్టుకోవటానికి వేసుకున్న నాలుగంచెల ప్లానులో ప్రత్యేక హోదా ఇవ్వకపోవటమూ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చెయ్యకుండా ఏడ్పించటమూ మొదటి అంచె - అది విజయవంతం అయ్యింది కదా, మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని దించేసింది రెండవ అంచె - మీరు మళ్ళీ గెలుస్తారనే భరోసాతో సీట్లిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేల హైలెవెల్ కరప్షన్+బ్యాడ్ పెర్ఫార్మెన్స్ వల్ల అది కూడా విజయవంతం అయ్యింది కదా,జగన్ని ఎందుకూ పనికిరానివాణ్ణి చెయ్యటం మూడో అంచె - కేసుల భయం వల్ల జగన్ సహకరించటంతో అది కూడా విజయవంతం అవుతున్నది కదా,ఈ దశ మీకు ఎన్నికల్లో నిలబెట్టటానికి దమ్మున్న క్యాండిడేట్లు మిగలకుండా పోయి ఎన్నికల ఖర్చులు భరించలేని స్థితికి మీ పార్టీ వెళ్ళేవరకూ ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా నడుస్తుంది.ఇప్పుడు మీరు రోజువారీ నిరసనలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు.మీరిప్పుడు రోజుకోసారి ప్రస్తావిస్తున్న పనులు లేక అల్లాడుతున్న కూలీల ఆక్రందనలు జగన్ని ఏమాత్రం భయపెట్టటం లేదు, ఎందుకని?ప్రతి ఎన్న్నికల బూత్ దగ్గిరా ఓటింగ్ అనేది జరిగినట్టు హడావిడి కనిపిస్తే చాలు మొత్తం రాష్ట్ర ప్రజలు మీకే వోటు వేసినా మీరు గెలవటం అసాధ్యం - మొన్న కేసీయార్,మోదీ, జగన్ అంత భారీ మెజార్టీతో గెలిచింది ఈవీయం ట్యాంపరింగ్ ద్వారానే!ఈవీయంలు పెట్టటం కుదరని ప్రతి చోటా కేసీయారుకి ఎదురు తన్నడం మీకు తెలియదా? |