Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 7839
Registered: 04-2009
Posted From: 12.43.184.178

Rating: N/A
Votes: 0

Posted on Thursday, October 10, 2019 - 3:20 pm:   

వైసీపీ సోషల్ మీడియా కుట్ర (పార్ట్ 3) - రంగా ఫ్యాక్టర్ - జర్నలిస్టుల టీమ్
******************************************************
ఒక్క రంగా ఫ్యాక్టర్‌నే కాదు, తరచూ, అసలు నిజంగా జరిగాయో జరగలేదో తెలియని అనేక పాతవిషయాలను ప్రస్తావిస్తూ, కులఘర్షణలని సజీవంగా ఉంచడానికి జర్నలిస్టుల ముసుగులో కొందరు వైసిపికి గత ఐదేళ్ళూ, అంతకు ముందు కూడా పనిచేశారు. వీరిలో రెండురకాలున్నాయి. ఒక రకం జర్నలిస్టులు పూర్తిగా పెయిడ్ ప్యాకేజ్ జర్నలిస్టులు. ఎప్పుడో గతంలో ఏదో పత్రికలో చేసిన అనుభవం తప్ప వాళ్ళు ప్రస్తుతం ఏ పత్రికలో పనిచేస్తున్నారంటే సమాధానం ఉండదు. కొంతమంది సితార, జ్యోతిచిత్ర, శివరంజనివంటి సినిమాపత్రికల్లో పనిచేస్తూ, సినిమా కబుర్లు రాసినవాళ్ళు. ఈ మాజీజర్నలిస్టు అనే బ్రాండ్‌తో డెయిలీ పాతవిషయాలను పరిచయం చేస్తున్నట్లు, అన్యాపదేశంగా తెదేపాని, కమ్మవారిని అవహేళనగా, దుర్మార్గమైన రీతిలో చిత్రీకరిస్తూ రాయడమే వీరి పని.
ఇక రెండోరకం జర్నలిస్టులు వ్యక్తిగత కక్ష ఉన్నవాళ్ళు. వీళ్ళు ఇదివరకు ఈనాడులోనో, జ్యోతిలోనో పని చేసినవాళ్ళు. అక్కడ యాజమాన్యంతోనో, పైన ఉండే (కమ్మ) సబ్ ఎడిటర్‌తోనో వృత్తిపరంగా పొసగక బయటికి వచ్చి ఏ ఉదయం పత్రికలోనో, వార్తలోనో లేదా తర్వాత కాలంలో టీవీ ఛానెల్స్‌లోనో చేరినవాళ్ళు. ఆ వృత్తిపరమైన కక్షని తీర్చుకోవడానికి రామోజిని, రాధాకృష్ణని టార్గెట్ చేయడంలో భాగంగా కమ్మకులాన్ని, టీడీపీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తుంటారు. ప్రస్తుతం ఏ సాక్షిలోనో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో లేదా ఒక సొంతకుంపట్లోనో పనిచేస్తుంటారు. వీళ్ళు నాన్-పెయిడ్ ఆర్టిస్టులు ప్లస్ వీళ్ళు బాహాటంగా వైసిపి ముద్ర వేసుకోరు కనుక వీళ్ళ మాటలకి న్యూట్రల్స్‌లో కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది. కౌంట్ చేస్తే మొత్తమ్మీద ఇలాంటివాళ్ళు ఒక యాభయిమంది లెక్క తేలారు.
ఈ రెండురకాల జర్నలిస్టుల్లో అధికశాతం బ్రాహ్మణ సామాజికవర్గం, కొందరు దళిత క్రిస్టియన్లు. ఒకరిద్దరు రెడ్లు, ఇతర కులాలు. వీళ్ళ సగటు వయసు యాభయేళ్ళు. అంటే ఎన్టీయార్ టీడీపీని స్థాపించినప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడూ, రంగా హత్య జరిగినప్పుడూ వీళ్ళ వయసు పదిహేనేళ్ళనుండి పాతికేళ్ళ లోపే. ఆ వయసులో ఉన్న కుర్ర విలేకర్లకి ఏ పత్రికా ముఖ్యమంత్రి కార్యాలయం కవరేజ్‌వంటి పెద్దబాధ్యతలు ఇవ్వదు. కానీ వీళ్ళు ఆ కాలంలో అన్నీ ఎన్టీయార్, చంద్రబాబు, వైయెస్, రంగాల పక్కనే ఉండి చూసినట్లు అలవోకగా కట్టుకథల్ని, విషవార్తల్ని అల్లి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్టులన్నిటిలో అన్యాపదేశంగా ఎన్టీయార్‌కి, తెలుగుదేశానికి కులపిచ్చి అంటగట్టడం, అసలు జరగని సంభాషణలు, వ్యూహాలు జరిగినట్లు, వాటికి వీళ్ళే ప్రత్యక్ష సాక్షులయినట్లు చిత్రీకరించడం అనేది వీళ్ళ అజెండా. జస్ట్ రంగా ఫ్యాక్టరే కాకుండా మిగతా అనేక అంశాల్లో కమ్మవ్యతిరేకతని, టీడీపీ మిద విషాన్ని ఎలా చిమ్మారో ఇంకో పోస్టులో వివరంగా చెబుతా. కమ్మ-కాపు వైరం పెంచడానికి, రంగా హత్య టాపిక్‌లో వీళ్ళ అబద్ధాల చిత్రీకరణ ఎలా ఉంటుందంటే...
"అసలు ఎన్టీయార్‌కి సినిమాల్లో ఉన్నప్పుడే కాపులంటే ద్వేషం. కమ్మనిర్మాతల సహాయంతో ఎస్వీ రంగారావుని ఎన్టీయార్ తొక్కేశాడు. ఒకరోజు కొండవీటిసింహం షూటింగ్ జరుగుతోంది. నేను అక్కడే లొకేషన్లో ఉండి కవర్ చేస్తున్నా. ఒక కాపు లైట్‌బోయ్ వచ్చి ఎన్టీయార్‌కి మంచినీళ్ళు అందించాడు. అతను పక్కకి వెళ్ళగానే అతనిది ఏ కులం అని వాకబు చేసిన ఎన్టీయార్, కాపు అని తెలియగానే మంచినీళ్ళు తాగకుండా గ్లాస్ పక్కన పెట్టేశాడు. సిఎం అయ్యాక కూడా ఒకరోజు సెక్రటేరియట్లో ఎన్టీయార్‌తో కలిసి లిఫ్టులో వెళ్తున్నాం అందరం. లిఫ్ట్ దిగి సిఎం పేషీలో అడుగుపెట్టగానే నాకు తెలిసిన టైపిస్ట్ ఎదురయ్యాడు. హలో నాయుడూ ఎలా ఉన్నావు అని పలకరించాను. అది విన్న ఎన్టీయార్ తీక్షణంగా చూసి మరసటిరోజు ఆ టైపిస్ట్‌ని మన్యం ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించాడు. తర్వాత అతని తమ్ముడి భార్య వేలు విడిచిన మేనమామని భీమవరం పక్కన పల్లెటూళ్ళో కమ్మవారు దాడిచేసి కొట్టారు. రంగా హత్యకి కూడా గండిపేటలోనే పెద్ద కసరత్తు జరిగింది. ముందురోజు అర్ధరాత్రి వ్యాస్‌ని, దేవినేని నెహ్రూని పిలిపించారు. కోడెల, చంద్రబాబు కూడా ఆ మీటింగులో ఉన్నారు. వ్యాస్ వద్దని వారించాడు. లేదు, ఊరుకుంటే రంగా సిఎం అవుతాడు, టీడీపీకి దెబ్బ అని కోడెల హెచ్చరించాడు........"
ఇలా ఎటువంటి ఆధారాలు లేకుండా, తాము స్వయంగా అక్కడే ఉండి చూసినట్లు, విషాన్ని జనరంజకంగా తమ ఫేస్‌బుక్ వాల్స్ మీద వీళ్ళు గత ఐదేళ్ళూ రాస్తూనే ఉన్నారు. అసలు వ్యాస్‌గారు హైదరాబాద్ వచ్చి ఎన్టీయార్ని కలిశారా, ఆ వారం చంద్రబాబు ఎక్కడున్నారు, కోడెల ఎక్కడున్నారు, అందరూ ఒకేచోట కలిశారా, కలిస్తే ఇవి చర్చించారా...ఇవేవీ ఎవడికీ తెలియదు. ఎక్కడా ఆధారాలుండవు. ఆ రోజు వీళ్ళంతా ఏ జిల్లా పర్యటనల్లో ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో ఆనాటి పత్రికల్లో చూసి వెరిఫై చేసుకునే ఆసక్తి, ఓపిక ఎవడికీ ఉండదు. అవి చూడాలంటే గూగుల్ చేస్తే దొరకవు. లైబ్రరీకి వెళ్ళి తిరగేయాలి. అదెవరూ చేయరులే అనే నమ్మకమే వీళ్ళ అబద్ధాలకి పునాది. అసలు దేవినేని నెహ్రూకి చంద్రబాబుతో కంటే దగ్గుబాటితో ఎక్కువ సాన్నిహిత్యం అనే నిజాన్ని కన్వీనియెంటుగా భూస్థాపితం చేసి, చంద్రబాబే ఈ హత్యకి పథకం పన్నాడూ అని రాస్తారు. లేదంటే పరమ దగుల్భాజీ పత్రిక "ఎన్‌కౌంటర్" లో అప్పట్లో అలా రాశారు అని కోట్ చేస్తారు. అందులో నిజంగా ఏం రాశారో ఎవడి దగ్గరా కాపీ ఉండాదు. ఇలా జర్నలిస్టు ముసుగులో వీళ్ళు ఒలకబోసిన పచ్చివిషమే నిజంగా చలామణీ అయింది, ఇప్పటికీ అవుతోంది.
ఇలా ఈ జర్నలిస్టులు పోస్టులు పెట్టగానే కింద ఫేక్ కాపు ప్రొఫైల్స్, ఒరిజినల్ వైసీపీ ప్రొఫైల్స్ పేరుతో కామెంట్ల వరద మొదలవుద్ది. గురూజీ, ఈ పచ్చజాతి ఇంత దుర్మార్గులా అని ఒక రెడ్డి మొదలెడ్తే, ఈ కమ్మనాకొడుకుల అంతు చూడాల్సిందే అని ఒక ఫేక్ కాపు ప్రొఫైల్ అంటుంది. ఇంకొకడు జోహార్ రంగా, ప్రతీకారం తీర్చుకుంటాం అని మొదలు పెడతాడు. ఆ జర్నలిస్టు పోస్టు కంటెంట్ వెంటనే కాపుల్ని రెచ్చగొట్టడానికి అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళుద్ది. రంగా లేడు, నెహ్రూ లేడు, వ్యాస్ లేడు, ఎన్టీయార్ లేడు...అందరూ స్వర్గస్తులయ్యారు. నిందితుల్లో, సాక్షుల్లో చాలామంది చనిపోయారు, నెహ్రూగారు, వంగవీటి రాధాకృష్ణ ఒకేసారి కాంగ్రెస్‌లో ఉన్నారు, వంగవీటి రత్నకుమారిగారు టీడీపీలో ఉన్నారు, వంగవీటి రాధాకృష్ణ, దేవినేని అవినాష్ ఒకేసారి టీడీపీలో ఉన్నారు....అయినా సరే రంగా హత్య అనే ఒక ఫ్యాక్టర్‌ని సజీవంగా ఉంచి కమ్మ-కాపు వైరాన్ని కొనసాగించి లబ్ధి పొందాలనే ఈ కుట్రకి జర్నలిస్టుల కృషి ఒకవేపు అయితే, ఇంకో వేపు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వెబ్ మీడియా ద్వారా జరిగిన మెథాడికల్ కృషి గురించి నెక్స్ట్ పోస్టులో.

https://www.facebook.com/kc.chekuri.50/posts/136808227646563
Warrior

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration