Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nayak
Yavvanam Kaatesina Bewarse
Username: Nayak

Post Number: 7838
Registered: 04-2009
Posted From: 12.43.184.178

Rating: N/A
Votes: 0

Posted on Thursday, October 10, 2019 - 3:19 pm:   

వైసీపీ సోషల్ మీడియా కుట్ర (పార్ట్ 2) - వంగవీటి రంగా పునరుజ్జీవనం
**************************************************************
రంగా-నెహ్రూ వర్గాల మధ్య విజయవాడలో జరిగిన ఆధిపత్యపోరు, 30 ఏళ్ళ కిందట జరిగిన రంగా హత్య, దానికి ముందు దేవినేని మురళి హత్య...ఇవి కేవలం 1989 ఎన్నికల్ని మాత్రమే ప్రభావితం చేసిన అంశాలు. కోస్తాని ఊపేసిన రంగా హత్య ఐదేళ్ళు తిరిగేసరికి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 1994 లో, తిరిగి 1999లో మెజారిటీ కాపులు తెదేపాకే మద్దతు పలికారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, శనక్కాయల అరుణ, ఉమ్మారెడ్డి వంటి కాపునాయకులు తెదేపా ప్రభుత్వంలో మంత్రులయ్యారు. కీలమైన పాత్ర పోషించారు.
రంగాకి స్నేహితుడైన వైయెస్సార్ 2004లో గెలవడానికి కూడా రంగా అంశం ఉపయోగపడలేదు. వైయెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎంతగా పట్టించుకోలేదంటే దేవినేని నెహ్రూ వైయెస్‌కి అత్యంత సన్నిహుతుడిగా మారేంత. ఒకవేళ నెహ్రూ 2009 లో గెలిచి ఉంటే వైయెస్సార్ ఆయనకి మంత్రిపదవి ఇచ్చేంత. రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణని కాంగ్రెస్‌లోకి తీసుకొద్దామని మల్లాది విష్ణు వైయెస్సార్ని బలవంతపెడితే, ముందు నెహ్రూ అనుమతి తీసుకునిరా అని మల్లాదిని నెహ్రూ దగ్గరికి పంపేంత.
అలా దాదాపు పాతికేళ్ళపాటు మరుగునపడిపోయిన రంగా ఫ్యాక్టర్ 2014లో వైసీపీ ఓటమి తర్వాత ప్రశాంత్ కిశోర్, రిలయన్స్ జియో పుణ్యమా అని సోషల్ మీడియాలోకి జొరబడింది. రంగాకి అభిమానులు ఉన్నారు. కానీ రంగా అంశాన్ని బేస్ చేసుకుని తమ ఓటు నిర్ణయించుకునేది ఎంతమంది ? అదీ ముప్పయేళ్ళ తర్వాత 2019 ఎన్నికల్లో ? నిజానికి పరిటాల, రంగా...ఇలా ఒక ప్రాంతంలో వెలిగినవారి ప్రభావం (ఎన్నికల్లో) వారు చనిపోయిన తర్వాత నాలుగయిదు నియోజకవర్గాలను దాటి పోదు. వాళ్ళకి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉండొచ్చేమోగానీ, అవన్నీ ఓట్లుగా మారవు. మరి రంగా ఫ్యాక్టర్ దేనికి ఉపయోగపడుతుంది వైసీపీకి ?
ఉపయోగపడింది. రంగా హత్యోదంతాన్ని నిరంతరం గుర్తు చేస్తూ, అది తెదేపా, కమ్మనాయకులే చేశారని విషప్రచారం చేస్తూ కాపుల్ని ఎల్లకాలం రెచ్చగొట్టేలా చేయడానికి ఉపయోగపడుతుంది. చంద్రబాబు విధానాలవలన, తెదేపా తమవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యతవలన, 2014లో పవన్ కల్యాణ్ మద్దతునివ్వడంవల్ల తెదేపాకి అండగా నిలిచిన కాపులను తెదేపాకి దూరం చేయడానికి ఉపయోగపడింది. వైసీపీ ప్రణాళికాబద్ధంగా అమలుచేసిన ఈ కుట్ర ముందు తెదేపా అమలుజేసిన ఏ కాపుకార్పోరేషన్లూ, ఉపముఖ్యమంత్రి పదవులూ, రిజర్వేషన్లు, విదేశీచదువులూ నిలబడలేకపోయాయి.
కుట్రలో మొదటి అంకం సోషల్‌మీడియాలో కొన్ని వేల ఫేక్‌ప్రొఫైల్స్ కాపుల పేరుమీద సృష్టించడం. వాటి ప్రొఫైల్స్‌లో రంగా బొమ్మలుంటాయి. పేరులో నాయుడు అనో, రాయల్ అనో ఉంటుంది. ఆ ప్రొఫైల్స్‌లో కొన్ని చిరంజీవి అభిమానులుగా, కొన్ని వైయెస్సార్ అభిమానులుగా, కొన్ని పవన్ కల్యాణ్ అభిమానులుగా ఉంటాయి. ఈ ప్రొఫైల్స్ ఏవీ మనం రోజూ తిరిగే ఫేస్‌బుక్ ప్రపంచంలో ఆపరేట్ చేయవు. కెసి చేకూరి రాసే పోస్టులమీదనో, ఇంకో వైసీపీ వ్యక్తి రాసే పోస్టుల మీదనో ఈ ఫేక్‌ప్రొఫైల్స్ ప్రతిస్పందించవు.
ఆల్రెడీ ప్రశాంత్ కిశోర్ టీమ్ ప్రత్యేకంగా ఇంకొన్ని సినిమా పేజీలు, కాపుయూత్ పేరుమీద పేజీలు, గ్రూపుల్లో ఈ ఫేక్ ప్రొఫైల్స్ చిరంజీవి సినిమా గురించో, రంగా విగ్రహం ఫోటోనో పెట్టి జై చిరంజీవి అనో, జోహార్ రంగా అనో పోస్ట్ చేస్తాయి. ఇప్పుడు పార్ట్-1 లో నేను చెప్పిన చౌదరి తోకలున్న ఫేక్ ప్రొఫైల్స్ రంగంలోకి దిగుతాయి. వారి ప్రొఫైల్ పిక్చర్స్‌గా బాలకృష్ణ, ఎన్టీయార్, చంద్రబాబు బొమ్మలుంటాయి. ఈ జోహార్ రంగా పోస్టులో దూరి " ఈ కాపు నాకొడుకుని అందుకే చంపేశాం మేము, కుక్కచావు చచ్చాడు" అని హేళన చేస్తూ, రెచ్చగొడుతూ కామెంట్ పెడతాడు. దానికి ప్రతిగా వాళ్ళదే ఫేక్ కాపు ప్రొఫైల్ స్పందిస్తుంది. కమ్మనాకొడకల్లారా ఈ సారి మిమ్మల్ని బొందపెడతాం చూడండి అని. "ఏందిరా మీరు పీకేది, మీకు కాపు కార్పోరేషన్ బిక్షం వేశాం, మీ పవన్ కల్యాణ్ మా పెంపుడు కుక్క, మీ పవన్‌కి మా పరిటాల గుండు కొట్టించాడ్రా, మేము కాక మీకు ఇంక దిక్కెవ్వడు, జై బాలయ్య" అని ఫేక్ కమ్మ ప్రొఫైల్స్ ఇంకా రెచ్చగొడతాయి. ప్రతిగా, కాపు ప్రొఫైల్స్ కమ్మకులాన్ని, టీడీపీని ఇంకా దారుణంగా తిడతాయి. ఇప్పుడు ఈ విద్వేషపు కూతలను స్క్రీన్‌షాట్లు తీసి పీకే టీమ్ రెడీ చేస్తుంది.
ఈ స్క్రీన్‌షాట్లు ప్రూఫులు రెండు వైసీపీ వింగ్స్‌కి అందుతాయి. ఒకటి కమ్మ, కాపు కాని వైసీపీ రెగ్యులర్ ప్రొఫైల్స్. మీరూ, నేనూ రోజూ చూసే నిజమైన వ్యక్తులు. (They operate by their original names). ఛీ-ఛీ ఈ కులపిచ్చిగాళ్ళు ఎంత బరితెగించారో చూడండి, టీడీపీ పాలనలో రాష్ట్రం ఎటుపోతోంది అని ఈ గురివిందగింజలు మెథాడికల్‌గా డెయిలీ తమ వాల్స్‌మీద ఈ స్క్రీన్‌షాట్లని ప్రదర్శిస్తూ, కమ్మ లేదా కాపు కాని న్యూట్రల్స్‌కి కమ్మవారిమీద, టీడీపీ మీద ఏహ్యభావం కలిగేలా కృషి చేస్తుంటారు. కొంతమంది కమ్మవారికి, టీడీపీ అభిమానులకి ఈ ఫేక్ కాపు ప్రొఫైల్స్ తిట్లు చూసి కాపుల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. డబుల్ ఇంపాక్ట్ అన్నమాట.
ఇక రెండో వర్గం వైసీపీలో ఉండే కాపులు. రిలయన్స్ జియో వలన, స్మార్ట్‌ఫోన్ల వాడకం వలన వచ్చిన డేటా విప్లవాన్ని అందిపుచ్చుకున్న పీకే టీమ్, పారలల్‌గా చేసిన పని ఏంటంటే ప్రతి ఊళ్ళో, ఏరియాలో కాపు యూత్, కాపు అసోసియేషన్ పేరుతో "న్యూట్రల్‌గా" కనిపించే వాట్సప్ గ్రూపుల్ని ఏర్పాటు చేయించడం. ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన అడ్మిన్ వైసిపీవాడయినా సరే, ఆ ఏరియా కాపులందరినీ పార్టీతో సంబంధం లేకుండా అందులో చేరుస్తాడు. మొదటిరోజుల్లో ఆ గ్రూపులో తమ కులానికి సంబంధించిన అంశాలే పోస్టులుంటాయి. ఉండేకొద్దీ పీకే టీమ్ సప్లై చేసిన ఈ విద్వేషపు స్క్రీన్‌షాట్లు ప్రత్యక్షమవుతాయి.
ఇదేంటన్నా, మీ తెదేపావాళ్ళు, తెదేపా కమ్మలు కాపుల్ని ఇలా నీచంగా తిడుతున్నారు, మీరేం చేస్తున్నారు అని అదే గ్రూపులో ఉన్న టీడీపీ కాపులమీద ఎదురుదాడి మొదలవుద్ది. వాళ్ళలో కొందరు డిఫెన్స్‌లో పడిపోతే, ఇంకొందరు టీడీపీ వ్యతిరేకులుగా మారిపోతారు. ఇలా విజయవంతంగా రెండు అంకాల్లో కమ్మ-కాపు, కాపు-టీడీపీల మధ్య అగాధాన్ని సృష్టించి పెంచిన వైసీపీ/పీకే టీమ్ ఈ అగాధాన్ని, వ్యతిరేకతనీ జగన్‌మోహన రెడ్డికి అనుకూలంగా ఓట్ల కింద మార్చే కుట్ర ఇంకోటి పారలల్‌గా అమలు చేసింది. పెయిడ్ (మాజీ) జర్నలిస్టులు, వెబ్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూల రూపంలో ఆ రంగా ఫ్యాక్టర్ కుట్ర ఎలా సాగిందో పార్ట్-3 లో వివరిస్తా.

https://www.facebook.com/kc.chekuri.50/posts/135951607732225
Warrior

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration