Kodibochu
Kurra Bewarse Username: Kodibochu
Post Number: 1027 Registered: 04-2019 Posted From: 99.10.95.165
Rating: N/A Votes: 0 | Posted on Friday, October 04, 2019 - 8:07 pm: | |
ఓవరాల్ గా చేతులెత్తేసిన సైరా విడుదలకు ముందు భారీ అంచనాలు బాహుబలి-2ను కూడా కొట్టేస్తుందన్నారు అభిమానులు ఓవైపు యూనిట్, అంచనాల్ని తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ, సైరా-బాహుబలి మధ్య పోలికలు మాత్రం ఆగలేదు. ఎందుకంటే ఇది చిరంజీవి సినిమా. అలా భారీ అంచనాలతో వచ్చిన సైరా రెండో రోజుకే చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో మినహా ఈ సినిమాకు ఎక్కడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. మరీ ముఖ్యంగా మొదటి రోజు వసూళ్లతో పోల్చి చూస్తే రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 37 కోట్ల 93 లక్షల రూపాయల షేర్ వస్తే, రెండో రోజు ఈ వసూళ్లు కేవలం 10 కోట్ల 10 లక్షల రూపాయలకు మాత్రమే పరిమితమయ్యాయి. అలా 2 రోజుల్లో 48 కోట్ల రూపాయల షేర్ తో తెలుగు రాష్ట్రాల్లో బెటర్ అనిపించుకున్న సైరా.. మిగతా అన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యల్ప వసూళ్లు రాబట్టింది. కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు వసూళ్లు చెప్పుకునే స్థాయిలో కూడా లేవంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. తెలుగు తర్వాత చిరంజీవికి అత్యథిక మార్కెట్ ఉన్న ప్రాంతంగా చెప్పుకునే కర్ణాటకలో రెండో రోజు సైరా సినిమాకు కేవలం కోటి 14 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. అటు తమిళనాడులో 35 లక్షలు, కేరళలో 14 లక్షల రూపాయల వసూళ్లకే పరిమితమైంది చిరు సినిమా. ఇక ఉత్తరాదిన కూడా సైరా సినిమాకు రెండో రోజుకే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే, మిగతా అన్ని ప్రాంతాల్లో సైరా సినిమా ఫ్లాప్ అయింది. అయితే వసూళ్లలో ఈ తగ్గుదల ఇవాళ్టి నుంచి ఇలానే కొనసాగుతుందా లేక మళ్లీ పుంజుకుంటుందా అనే విషయం తేలాల్సి ఉంది. ఎందుకంటే.. బుధవారం శెలవు దినం అయినప్పటికీ, గురువారం వర్కింగ్ డే. సినిమాకు సంబంధించి ఫస్ట్ వీకెండ్ ఇంకా రాలేదు. సో.. శని, ఆదివారాల్లో రాబోయే వసూళ్లపై సైరా అసలు రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. రెండో రోజు సైరా వసూళ్లు ఇలా ఉన్నాయి కర్ణాటక - రూ. 1.14 కోట్లు తమిళనాడు - రూ. రూ. 0.35 కోట్లు కేరళ - రూ. 0.14 కోట్లు రెస్టాఫ్ ఇండియా - రూ. 1.20 కోట్లు ఓవర్సీస్ - రూ. 0.40 కోట్లు రెస్టాఫ్ ది వరల్డ్ - రూ. 0.55 కోట్లు మొత్తం - రూ. 3.76 కోట్లు |