Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11702
Registered: 03-2004
Posted From: 24.249.211.66

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, July 24, 2019 - 7:32 am:   

24 va pulakesi antunnaru.. meaning ento naaku teleedhu kaani.konni vupadravalu...


#AP_భవిత మీద దాష్టీకం - పద్ధతిగా, ఒక స్క్రిప్ట్ ప్రకారంగా...
#పార్ట్_2
.
ఉపద్రవం #1: మొదటిగా #పోలవరం, #రాజధాని పనులు #ఆపటం ద్వారా ఇక్కడ అభివృద్ధి నిలిచిపోనుంది అని సంకేతాలు పంపారు. సహజంగానే #తెలంగాణాలో మళ్లీ కొత్త #బూమ్ చిగురించింది. దాన్ని పూర్తిగా కన్సాలిడేెట్ చేసుకోటానికి గానూ, భౌగోళిక స్వరూపం రీత్యా వాటర్ తోడి పోసుకోటానికి అష్టకష్టాలు పడుతున్న ఆ రాష్ట్రానికి నీటి విషయంలో సంపూర్ణ సహకారం అందించటానికి నడుం కట్టారు మన నాయకులు. ఎక్కడో భద్రాచలం దగ్గర గోదావరి నుండి, వాళ్ళ భూభాగంలో వాళ్ళే కాలువలు తవ్వుకొని సాగర్/శ్రీశైలంలోకి లిఫ్ట్ చేసుకొనే అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వాళ్ళ సరికొత్త ఇరిగేషన్ ప్రణాళికలో మన రాష్ట్రాన్ని బలవంతపు భాగస్వామిని చెయ్యజూస్తున్నారు. "మన" పబ్లిక్ సొమ్ము #లక్ష_కోట్లు ఉదారంగా "వారి" ప్రాజెక్ట్ లో కుమ్మరిస్తున్నారు - ఏదీ, కేసిఆర్ ఆ నీటిలో మీకు వాటా ఇస్తాను అన్న మాటల #నీటి_మూటలు పట్టుకొని! పైగా "మన పోలవరం" నుంచి మరో ఆల్టర్నేట్ రూట్ లో (#రివర్స్_పంపింగ్) సాగర్, శ్రీశైలం ద్వారా తెలంగాణాకి మరింత వాటర్ అప్పజెప్పే ఒప్పందం మీద - హ..వ్వ!!!
.
చూడాల్సిన పరిష్కారం: ఎలాగూ ధవళేశ్వరం దిగువగా సాలుకి 3000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది. ఇప్పటికే 60% పైన పనులు పూర్తి చేసుకున్న పోలవరాన్ని ఓ 45,000 కోట్లతో (పునరావాస ప్యాకేజీతో కలిపి) పూర్తి చేసి ముందుగా #డెల్టాని #స్థిరీకరించుకోవచ్చు. దాని ఎడమ కాలువ నుండి #పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా ఉత్తరాంధ్ర పారిశ్రామిక, సాగు, తాగు నీటి అవసరాలు కూడా తీర్చుకోవచ్చు (చంద్రబాబు హయాంలో 1000 కోట్ల మొదటి ఫేజ్ అయ్యింది, మరో 700 కోట్లతో రెండో ఫేజ్ ఇపుడు పూర్తి చెయ్యొచ్చు). దానితో పాటు, ఇప్పటికే చంద్రబాబు & టీమ్ ప్రణాళికలు సిద్దం చేసి ఉంచిన #గోదావరి_పెన్నా అనుసంధానంలో మొదటి ఫేజ్, #నకిరికల్లు_లిఫ్ట్ (రూ. 6000 కోట్లు; సం. లోపే పూర్తి చెయ్యొచ్చు) ద్వారా గుంటూరు, ప్రకాశంలో సాగర్ కుడి కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టు నిలబెట్టుకోవచ్చు. వీటి ద్వారా కృష్ణా బేసిన్లో అదా చేసిన నీటితో రాయలసీమనీ కాపాడుకోవచ్చు. తతిమ్మా గోదావరి-పెన్నా ఇంటర్ లింకింగ్ (మరో 85,000 కోట్లు) పూర్తి చెయ్యటం ద్వారా దక్షిణ కోస్తా, రాయలసీమ అవసరాలు పూర్తిగా తీర్చుకోవచ్చు.
.
ఈ విధంగా ఓ #లక్ష_కోట్లతో మనమే #స్వయంసమృద్ధి సాధించగలిగి ఉండి ఆ సొమ్మునీ పోయిపోయి పక్క రాష్ట్ర ప్రణాళికలో ఇన్వాల్వ్ చేసి తిరిగి నీటి కోసం వాళ్ళనే దేబిరించటంలో ఆంతర్యము ఏమీ!? పైగా ఆ సొమ్ముని కేంద్రం ప్రత్యేక గ్రాంటుగా అందిస్తుంది అన్న గ్యారెంటీ కూడా లేదు. అది అప్పులు, AP ప్రజలు/కార్పొరేట్లు టాక్స్ రూపంలో కట్టే #ఘర్మజలం అని ఈ పెద్దలు మరిచిపోతే ఎలా!?
.
ఒక్క #పట్టిసీమ #పుణ్యానే చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు దాకా గత ప్రభుత్వం నీళ్ళు #పారించగలిగింది (ఏ రివర్స్ పంపింగులూ అవసరం రాలా). పైన చెప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు కట్టలేకున్నా కనీసం #పోలవరం అన్నా పూర్తి చేసి రాష్ట్ర భవిష్యత్ #కాపాడుకోపోతే శాశ్వతంగా #చరిత్ర_హీనులుగా మిగిలిపోతారు!!
.
మరిన్ని ఉపద్రవాల గురించి తరువాయి పోస్టుల్లో... Stay tuned!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration