Kodibochu
Pilla Bewarse Username: Kodibochu
Post Number: 135 Registered: 04-2019 Posted From: 171.161.160.10
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 29, 2019 - 1:13 pm: | |
మోడీ హార్స్ ట్రేడింగ్: చంద్రబాబు 'కామెడీ' కోపం.! April 29 , 2019 | UPDATED 03:30 IST మోడీ హార్స్ ట్రేడింగ్: చంద్రబాబు 'కామెడీ' కోపం.! ఏంటో, చంద్రబాబుకి ఇప్పుడన్నీ 'అన్యాయం, అక్రమం'గానే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళపాటు వ్యవస్థలన్నిటినీ సర్వనాశనం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఇప్పుడు నీతులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో వున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. నిజానికి మోడీ వ్యాఖ్యలు, దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. నరేంద్ర మోడీ 'హార్స్ ట్రేడింగ్'కి పాల్పడుతున్నారంటూ విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకి వుందా.? అంటే, నూటికి నూరు పాళ్ళూ లేదనే చెప్పాలి. ఎందుకంటే, గడచిన ఐదేళ్ళలో చంద్రబాబు చేసింది ఇదే హార్స్ ట్రేడింగ్. 'తాను చేస్తే శృంగారం, ఎవడన్నా చేస్తే వ్యభిచారం' అన్నాడట వెనకటికి ఎవడో. చంద్రబాబు తీరు ఇప్పుడలాగే వుంది మరి. లేకపోతే, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు, దానికి ఏ ట్రేడింగ్ అని పేరు పెట్టగలరు.? ఏ విషయంలో అయినా చంద్రబాబు తీరు ఇలాగే వుంటుంది. 2014లో ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లోనే గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు అవే ఈవీఎంలను ఇప్పుడు తీరిగ్గా తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరుని చంద్రబాబు పొగిడిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 'డెమోక్రసీని నాశనం చేస్తున్నారు', 'ఎన్నికల కమిషన్ వెంటనే కల్పించుకుని సుమోటోగా కేసు నమోదు చేయాలి', 'ప్రధాని నోట షేమ్ ఫుల్ రిమార్క్స్'.. ఇలా చంద్రబాబు ట్విట్టర్లో చంద్రబాబు మీద ఓ రేంజ్లో చెలరేగిపోయారు. అఫ్కోర్స్, చంద్రబాబునీ అదే స్థాయిలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, పోలింగ్ ముగిశాక చంద్రబాబు ఆగ్రహావేశాలతో చేస్తున్న వ్యాఖ్యలు బోల్డంత కామెడీని పండిస్తున్నాయన్నమాట. ఎలాంటి చంద్రబాబు ఎలా అయిపోయారు.? విశ్వసనీయత కోల్పోతే ఇలాగే వుంటుంది.? మంచి మాటే చెప్పాలనుకున్నా, నైతిక విలువల్లేని వ్యక్తి చెప్పే మాటలకు విలువ వుంటుందా.? ఛాన్సే లేదు. |