Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kodibochu
Pilla Bewarse
Username: Kodibochu

Post Number: 134
Registered: 04-2019
Posted From: 171.161.160.10

Rating: N/A
Votes: 0

Posted on Monday, April 29, 2019 - 1:12 pm:   

టీడీపీని ఓటమికి ప్రిపేర్ చేస్తున్న సొంత మీడియా!

April 27 , 2019 | UPDATED 18:01 IST




టీడీపీని ఓటమికి ప్రిపేర్ చేస్తున్న సొంత మీడియా!
'ఇరవై నియోజకవర్గాల్లో టీడీపీ డబ్బులు పంచడంలో విఫలం అయ్యింది..', 'ముప్పై నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ తెలుగుదేశంపార్టీకి గట్టిగా తగిలింది..' యాభై నియోజకవర్గాల విషయంలో అలాంటి రీజన్లను చెప్పేశారు. ఇక ఇప్పుడు మూడో రీజన్ 'పోలీసులు చాలాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారు..' అనేది.

ఇది ఎన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తుందో సంఖ్యాపరంగా చెప్పలేదు కానీ.. 'పోలీసులు తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు.. దీంతో ఆ పార్టీ వాళ్లు అవాక్కయ్యారు..' అని తోక మీడియా రాసుకొచ్చింది. ఇదెలా ఉందంటే.. తెలుగుదేశం పార్టీకి పోలీసులు కచ్చితంగా సహకరించాల్సింది, అయితే వారు మోసం చేశారు.. అని ఆ పత్రిక ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఉంది!

తెలుగుదేశం పార్టీకి సహకరించకుండా పోలీసులు మోసం చేశారని ఆ పత్రిక వాపోతూ ఉంది. 'తెలుగుదేశం పార్టీకి పోలీసులు కూడా సహకరించలేదు..' అంటూ సానుభూతిని పెంచాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ కథలన్నింటినీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఓటమికి సాకులను అనుకూల మీడియానే రెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే అది అనుకునే వాళ్ల తప్పుకాదు.

అవతల చంద్రబాబేమో 'ఈవీఎంలను ట్యాంపర్ చేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరచకాలకు పాల్పడింది.. డబ్బులు పంచింది..' అంటూ మాట్లాడుతున్నారు. ఇవతల ఆయన భజంత్రీ మీడియానేమో..'టీడీపీ డబ్బులు పంచలేకపోయింది, జనసేన, పోలీసులు..' అంటోంది. ఇందు మూలంగా అర్థం చేసుకోవాల్సిందేమిటో వారే సూటిగా, స్పష్టంగా చెబుతున్నట్టుగా ఉన్నారు!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration