Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11375 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 16, 2019 - 11:02 am: | |
maamoolu noti dula kaaduga sodara needi. We had high hopes on you. your attitude is the biggest enemy of yours. @RayuduAmbati Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋.. బీసీసీఐ సోమవారం ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కని సంగతి తెలిసిందే. రాయుడు విషయంలో అందరూ అయ్యో పాపం రాయుడూ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ, రాయుడు మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లజోళ్లు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాను’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. టీమిండియా తరఫున మంచి సగటు కలిగి ఉన్న ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌కు బదులుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇస్తూ.. విజయ్‌శంకర్ త్రీడైమెన్షన్‌లో సేవలు అందిస్తాడని అందుకే విజయ్ను ఎంపిక చేశామని అన్నాడు. దానికి బదులుగా స్పందించిన రాయుడు ఈసారి ప్రపంచకప్‌ను త్రీడీ కళ్లద్దాలతో చూస్తానంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రం విసిరాడు. అయితే, రాయుడు పోస్టుపై స్పందించిన అభిమానులు.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలం.. ఇది చాలా బాధాకరం అని పేర్కొంటున్నారు. ‘నేను లేని జట్టు ఎంత బాగా ఆడుతుందో అని త్రీడీ గ్లాసులు పెట్టుకొని మరీ చూస్తా’ అనే అర్థం వచ్చే మీ పోస్టుతో.. వెటకారం తెలుగువాళ్లకు సొంతమని మరోసారి నిరూపించారని మరికొంతమంది ఛలోక్తులు విసురుతున్నారు. మరికొంతమందేమో.. మే 23 వరకూ అవకాశం ఉంది. ఐపీఎల్లో వచ్చే మ్యాచుల్లో వరస శతకాలు బాదితే చోటు ఎలా దక్కదో చూద్దాం.. అంటూ రాయుడులో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా రాయుడు ఇలా సానుకూలంగా స్పందించడం భారత క్రికెట్‌కు మంచి పరిణామమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. |