Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11388 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 17, 2019 - 8:33 pm: | |
https://www.eenadu.net/ap/mainnews/2019/04/18/97815/ ఈనాడు, అమరావతి: కెనడాలోని అల్బెర్టా రాష్ట్ర అసెంబ్లీకి మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఏపీ మూలాలున్న పాండా ప్రసాద్, లీలా అహీర్ రెండోసారి విజయం సాధించారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడికి చెందిన ప్రసాద్ గతంలో ఒక చమురు సంస్థలో పనిచేశారు. లీల పూర్వీకులది విజయనగరం జిల్లాగా చెబుతున్నారు. ఇద్దరూ 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లీలా అహిర్ గత జనవరిలో విజయనగరం సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపట్ల ప్రత్యేక అభిమానం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో: అల్బెర్టా రాష్ట్ర ఎన్నికలు బ్యాలెట్ పేపరుతో జరిగాయి. 2 గంటల్లోనే ఫలితాలు వెలువడినట్లు యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ కాల్గెరి నార్త్ ఈస్ట్ ప్రాంత బోర్డు డైరెక్టరు నవీన్ చౌదరి కొడాలి తెలిపారు. ఇక్కడ నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. |