Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11363
Registered: 03-2004
Posted From: 32.212.213.187

Rating: N/A
Votes: 0

Posted on Saturday, April 13, 2019 - 2:23 pm:   

naaku telsi oorike bhayapadutunnattu anipistondhi. Anta tamepring cheyyagaligithe monna MP, RS, Chattisgarh lo kooda chese vallu kada.. Kinda article chadivi challabadandi...

ఎంతో మంది మిత్రులు ఏమి జరిగింది, ఎవరు గెలుస్తారు? మనకి ఎన్ని సీట్లు వస్తై అని నన్నుఆడుగుతున్నారు. మరి కొంత మంది ఓటింగ్ శాతం తగ్గిచ్చారు, EVM లలో పోలైన ఓట్లు తీసేసారు అనీ, ఇంకా 40రోజులు ఉంది కనుక ఈలోపు EVM లలో వోట్లు మార్చేస్తారేమో ( tampering) అని భయ పడుతున్నారు వాళ్ళందరికోసం ఈ పోష్టు రాస్తున్నాను ... కొంచం పెద్దది ఐనా చదవండి .. నిజం అనిపిస్తే నమ్మండి ... లేదంటే మీ ఇష్టం

మొదటి విషయం, ఒకవేళ జగన్ గెలిసినా నేను తెలుగుదేశం జండా వదలను ... జగన్ ని పుట్టిచ్చినాడి పాలనలోనే వదల్లా ... ఈడి పాలనలో వదిలితే వాడు ఫీలవుతాడు 🤪 మీకు భయంగా ఉంటే, పోరాడే దమ్ము లేకపోతే తెలుగుదేశం కార్యకర్త గా పనికిరారు తప్పుకోండి 🙏

నిన్న పోలింగ్ సందర్భం గా వాళ్ళ అరాచకం కి వ్యతిరేకంగా పోరాడిన మన కార్యకర్తల తెగువ అందరికీ స్పూర్తి కావాలి 💪

విషయానికి వస్తే రెండు విషయాలు, ఒకటి చంద్రబాబు ని ఓడిచ్చటానికి జరిగిన కుట్రలు, రెండు జనాలు తెగించి ఓట్లు వెయ్యటం ముఖ్యంగా మహిళలు

మొదటిది, కుట్రలు -
తెలంగాణా ఎన్నికల తరవాత మన కార్యకర్తలకి ఒక విధమైన భయం ఆవహించింది, పోటీ ఇస్తాం, గెలుస్తాం అనుకున్నాం కానీ ఇలా ఓడిపోయాం అని,అది గమనించిన KCR మన వాళ్ళ ఆత్మ స్తైర్యం దెబ్బతియ్యటానికి వాడిన మాటలని బుర్రకి ఎక్కిచ్చుకొని ఇంకొంచం భయపడటం మొదలుపెట్టారు. కానీ వాస్తవానికి జరిగింది వేరు. తెలంగాణా ఎన్నికల్లో KCR ki వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలవ్వటం, అది సోషల్ మీడియా నుండే మొదలవటం, జనాల్లోకి వెళ్ళటం నిజం. ఒకానొక స్తితి లో KCR కూడా ఆలోచించింది నిజం. కానీ జాగర్తపడి కాం(గెస్ చేతగాని తనాన్ని అనుకూలంగా మార్చుకోగలిగాడు ...

KCR గెలిచింది మూడు అంశాలు, దొంగ ఓట్లు చేర్చుకోవటం, వ్యతిరేక ఓట్లు తీసేపిచ్చటం, కాంగ్రెస్ ఏజంట్లని ఏమార్చి సమయం ఐపోయాక రిగ్గింగ్ చెయ్యటం. ఇరవై లక్షల ఓట్లు తొలగించ పడ్డా, పోలింగ్ శాతం రెండు రోజుల దాకా వెల్లడించలేక పోయినా అదే కారణం.

ఇంక ఎన్ని మతలబులు చేసినా EVM ని క్లోస్ చేసి, బేటిరీ తీసెయ్యనంత వరకే, దాని తరవాత EVM ఒక extarnal drive తో సమానం. External drive లో డేటా చెరపొచ్చు, కొత్త డేటా రాయొచ్చు కానీ అది కంప్యూటర్ కి పెట్టి ఉన్నంతవరకే. తీసేసినకా. దానిలో డేటా మార్చగల సాంకేతికత ఈ ప్రపంచంలో నాకు తెలిసి లేదు, ఇంకా రాలేదు. ఉంటే ఎవరన్నా చెప్పండి తెలుసుకుంటా 🙏.

EVM strong room లోకి బేటిరీ తో వెళ్ళవు. కనుక ఓట్లు మార్చటం జరగని పని. ఇది కాక వాళ్ళు చెయ్యాలి అనుకున్న అన్ని అడ్డదారులూ మన పార్టీ విజయవంతంగా అడ్డగించాం.

ఓట్లు తొలగించే ప్రయత్నం, దొంగ ఓట్లు అడ్డుకోవడం..PK దొంగ సోషల్ మీడియా అకౌంట్లని బయటకు తీశాం ఇలా ఎన్నో. దీనిలో పార్టీ కన్నా ఒక అడుగు సోషల్ మీడియా ముందు ఉండటం, కొన్ని సందర్బాలలో పార్టీ కి దిశా నిర్దేశం చెయ్యటం వాస్తవం. 💪

వాళ్ళ చిట్టచివరి ప్రయత్నం EVM లు పనిచెయ్యకుండా చేసి ఓటు శాతం తగ్గించటం, గొడవలు చేసి భయపెట్టి ఓటు వెయ్యకుండా మహిళలని ఆపటం. కానీ దాన్ని మన తెలుగు మహిళలు సమర్ధవంతం గా ఎదుర్కొని తెలుగోడి సత్తా చూపిచ్చారు🙏

అలా వాళ్ళ కుట్రలు అన్నీ విఫలం అయ్యి 80% రికార్డు స్తాయిలో ఓట్లు పోలు చేసుకోని ఆంద్రుడు మొదటి విజయం సాదించాడు 👍 ఇంక మీదట వాళ్ళు చెయ్యగల కుట్ర ఏమీ లేదు ఒక్క కౌంటింగ్ ఏజంట్లని కొనటం తప్ప. అది జరగని పని.

రెండో విషయం- ఎన్నికల సరళి, ఫలితాలు

నంద్యాల ఉప ఎన్నిక కి నేను నా ఎనాలసిస్ రాశాను, 20 నుండి 25 వేల మెజారిటీ తక్కువలో తక్కువ. నా లెక్క ఇంకో 5 వేలు ఎక్కువే అని రాశా. 27500 వచ్చింది.

తెలంగాణా ఎన్నికలకి ప్రచారం లో గెలుస్తుంది అని చెప్పాను కానీ, ఎన్నికల తరవాత ఎనాలసిస్ రాయలేదు. పైగా కొంతమంది మిత్రులు గెలుస్తున్నాం అని పోష్ట్లు పెడుతుంటే నేను వారించాను.ఎందుకంటే చివరి మూడు రోజులూ కాంగ్రెస్ విఫలం అయ్యింది అని ఓటింగ్ సరళి చూస్తే అర్ధం ఔతుంది. అందుకే నేను రాయలేదు.

ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను.

28/05/2019 ఒక దివ్యమైన రోజు. అన్నగారి జన్మదినం. తెలుగుదేశం చెరిత్రలో ఆరోజు తెలుగుదేశం (ఆంద్రా) ముఖ్యమంత్రిగా ప్రమాణం చెయ్యగలిగే అదృష్టం పెద్దాయన చంద్రబాబు గారికి ఇచ్చారని నా అభిప్రాయం. ఆరోజు చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం ఖాయం, ఎందుకంటే ఇది అన్న గారి ఆశీర్వాదం 🙏.

నాలుగు ముక్కల్లో చంద్రబాబు గెలవటానికి, జగన్ ఓడిపోటానికీ కారణాలు-
పోలవరం, అమరావతీ, వివిద ప్రాజెక్ట్లూ ఆగిపోతై అన్న భయం,
సంక్షేమ పదకాలు, ప్రతి గడపనీ, ప్రతి వర్ఘాన్నీ చేరటం..
చంద్రబాబు కన్నా బాగా చెయ్యగలరు అని నమ్మకం కలిగించే నాయకుడు లేకపోవటం..
జగన్ చుట్టూ ఉండే వ్యక్తుల నేర చెరిత్ర.
జగన్ గెలిస్తే ప్రశాంతంగా బతకలేమేమో, వ్యాపారాలు చేసుకోలేమేమో అన్న భయం...
జగన్ బాబాయి హత్య కేసులో జగన్ కుటుంభాన్నే జనాలు అనుమానించటం...
ఆంద్రాకి మోసం చేసిన మోడీ తో అంట కాగటం...
నరనరాల్లో ఆంద్రా మీద ద్వేషం తో ఆంద్రా నాశనం కోరుకునే KCR కి దాసోహం అనటం ...

ఇలా ఇంకా 10 కారణాలు చెప్పగలను. దేశం లో గత 25 ఏళ్ళగా ప్రభుత్వాల మీద విపరీతమైన కోపం, ద్వేషం ఉంటే తప్ప ప్రజలు ప్రభుత్వాలని మార్చటం లేదు ..

మన ప్రభుత్వం మీద ప్రజలకి దింపెయ్యాలని కోపంలేదు, కానీ విచిత్రం గా ఈసారి ప్రతిపక్షం మీద అనేక అంశాలలో వ్యతిరేకత ఉంది. దాని మూలంగా జగన్ దాదాపు 2% ఓట్లు కోల్పోతిన్నాడు పోయిన సారి కన్నా.

తెలుగుదేశం 43 - 46% ఓట్లతో 107 నుండి 115 సీట్లు గెలవ బోతింది👍 (నా అంచనా ఇంకో 5 నుండి పది ఎక్కువే )
YCP 39 - 41% ఓట్లతో 55 నుండి 65 సీట్లు గెలుచుకోబోతుంది
జనసేన 8 నుండి 11% ఓట్లతో 1 నుండు 4 సీట్లు గెలుచుకో బోతుంది.

నెంబర్లు కొంత మారినా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు గారే ...

నాకు ఆంద్రా ప్రజల ఆలోచనా విధానం మీద మంచి నమ్మకం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకపోతే నేను ఇంక జీవితంలో రాజకీయాల గురించి మాట్లడను✊

కనుక పిరికితనం వదిలి ఈ నలభై రోజులూ ప్రధాన శత్రువుతో పోరాడండి 💪💪
జై ఆంద్రా. జై తెలుగుదేశం

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration