Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11264
Registered: 03-2004
Posted From: 172.58.229.143

Rating: N/A
Votes: 0

Posted on Monday, March 04, 2019 - 1:18 pm:   

కోర్ట్ ల చేతిలో 4 ఏళ్లలో ఏకంగా 40 సార్లు గూబగుయ్యి అనిపించుకున్న కే సిఆర్…ఆ లిస్ట్ కింద..

పోతే ఇప్పుడే మళ్లీ ఫ్రెష్ గా కోర్ట్ లో దబ్బులు తిన్న కేసీయార్ ప్రభుత్వం. నిన్న రాత్రి నుండి కెటిఆర్ పర్య వెక్షణ లో పని చేసినందుకు టీ.పి. కి దక్కిన్న ది డేటా కాదు..కోర్ట్ నుంచి దబ్బులు.

తెలంగాణ పోలీసులకు చివాట్లు పెట్టిన హై కోర్టు...

"కంపెనీ పై ఫిర్యాదు వస్తే నలుగురు ఉద్యోగస్తులను ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్టు

వారు నిందితులు కానప్పుడు ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్

వారు నిందితులు కాదు విట్నెస్ మాత్రమే అని చెప్పిన తెలంగాణ పోలీసులు

విట్నెస్ అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్

మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఇవ్వండి అని అడిగిన హై కోర్ట్

ఎటువంటి సమాచారం లేకుండా తెల్ల కాగితాల పై విఆర్ఓ సంతకాలు ఉన్న పేపర్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ పోలీసులు

ఒక వ్యక్తి,లేదా సంస్థ పై సోదాలు నిర్వహించి, పంచనామా పూర్తి అయిన తరువాత ఆయా విషయాలు పొందుపర్చి...అక్కడే స్థానిక విఆరోఓ సంతకం తీసుకుంటారు.మీరు తెల్ల కాగితాల పై సంతకాలు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన హై కోర్టు

ఇది చూస్తేనే మీ దురుద్దేశం అర్థం అవుతుంది వెంటనే అరెస్ట్ చేసిన నలుగురు ఐటీ ఉద్యోగులను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని తెలంగాణ పోలీసులను ఆదేశించిన హై కోర్టు"

1. 1956 నాటి స్థానికత ఆధారంగా ‘ఫాస్ట్ పధకం’ చెల్లదు, తెలంగాణా భారత్ లో అంతర్భాగం అని హై కోర్ట్ చెప్పింది.

2. GHMC ఎన్నికల వాయిదా చెల్లదు, డిసెంబర్ 31 లోగా జరిపించాలి అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

3. సమగ్ర సర్వేలో ప్రాంతాల వివరాలు, స్థానికతను తొలగించాలి అని తెలంగాణాకు వ్యతిరేకంగా హైకోర్ట్ తీర్పు..

4. ఫోన్ టాపింగ్ కేసులో కాల్ డేటా, కాల్ రికార్డు లను హైకోర్ట్ కు సమర్పించాలి అని హైకోర్ట్ చెప్పింది, మొదట టాపింగ్ చేయలేదని, తరువాత కోర్ట్ లో చేశామని ఒప్పుకున్నారు.

5. తెలంగాణాలో నెంబర్ ప్లేట్స్ ను TS కు మార్చాలని జీ ఓ వేస్తె, మళ్ళీ రిజిస్ట్రేషన్ అనే జీ ఓ చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

6. ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభన కేసులో తెలంగాణా ప్రభుత్వానికి తలంటు. యధాతధ స్తితి తీర్పు ఇచ్చిన హైకోర్ట్.

7. రేవంత్ రెడ్డి బెయిల్ కేసులో హైకోర్ట్ లోను, సుప్రీం కోర్ట్ లోనూ కెసిఆర్ కు చుక్కెదురు.

8. ఆరుగురు పార్లిమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

9. ఆంధ్ర స్థానికత వున్న విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేయడం చెల్లదు, వారిని ఉద్యోగాలలోకి తీసుకోవాలి అన్న హైకోర్ట్..

10. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ విషయంలో తెలంగాణా వాదన తప్పు అని హైకోర్ట్ చెప్పింది. ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది. ఎ పి లో స్టడీ సెంటర్స్ ను ఈ యూనివర్సిటీ కర్పస్ ఫండ్స్ తో నడపమని తీర్పు.

11. ఆంధ్రకు ప్రత్యేక హైకోర్ట్ విషయంలో, కొత్త హైకోర్ట్ పెడితే ఆంధ్రలోనే పెట్టాలి, అప్పటిదాకా వుమ్మడి కోర్టే అని స్పష్టం చేసింది, అప్పటిదాకా హైకోర్ట్ విభజన కుదరదు అని చెప్పింది.

12. ముత్తయ్య బెయిల్ కేసులో జడ్జ్ ను మార్చమని కెసిఆర్ స్టీఫెన్ సన్ తో కేసు వేయించాడు. దానిని హైకోర్ట్ కొట్టి వేసింది.

13. తప్పుగా డిజైన్ చేసిన తెలంగాణా రాజముద్రను వెంటనే మార్చమని హైకోర్ట్ ఆదేశించినది..

14. గురుకుల్ ట్రస్ట్ కు వేరే చోట భూమి కేటాయించాలి అని పాత తీర్పును సవరించడానికి హైకోర్ట్ ఒప్పుకోలేదు.

15. హైదరాబాద్ లో ఎ పి ఎన్ జి ఓ లకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిచిన కెసిఆర్ ప్రభుత్వ చర్యను హైకోర్ట్ నిలిపివేసింది.

16. వేరే పార్టీలో గెలిచి తెరాసలో చేరిన ఎం ఎల్ ఎ ల అనర్హత పై హైకోర్ట్ స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది, అయినా తీసుకోలేదు.

17. ఆంధ్ర స్థానికత పేరుతో తొలగించిన 250 మంది నీటి పారుదల శాఖ ఉద్యోగులను, హైకోర్ట్ లో కేసు ఓడిపోయే స్తితిలో రాజీకి వచ్చి మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకుంది, ఇది 371–డి కి విరుద్దం అని తీర్పు చెప్పింది.

18. జ్యుడిషియల్ ఆఫీసర్స్ నియామకాలను రాష్ట్రాల వారీగా భర్తీ చేయాలి అని తెలంగాణా కోర్ట్ కు వెళ్ళింది, కానీ ఈ కేసు వీగిపోయింది. నియామకాలు యధావిదిగానే రోస్టర్ పద్ధతిలో జరుగుతాయి అని చెప్పింది.

19. మల్లన్న సాగర్ భూసేకరణకు ఉపయోగిస్తున్న GO. 123 చట్ట విరుద్దం, రైతులు కోరితే భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలి అని హై కోర్ట్ తీర్పు. దీనివలన రైతులకు భూసేకరణ చట్టం కన్నా తక్కువ విలువ వస్తుంది అని చెప్పింది.

20. నిమ్జ్ – మెదక్ కేసులో కూడా జీ ఓ 123 చట్ట విరుద్దం, ఇది భూసేకరణ చట్టంలో అన్ని క్లాజులను సంతృప్త పరచడం లేదు అని GO 123 ని రద్దు చేసింది.

21. పోలీస్ ట్విన్ టవర్స్ నిర్మాణంపై హైకోర్ట్ అడ్డుకట్ట వేసింది.

22. పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్ ల అనుమతులపై కృష్ణా అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.

23. రేవంత్ రెడ్డి పై కుట్ర కేసులో.. ముత్తయ్య పై కేసు కొట్టివేత.

24. తెలంగాణా డిస్కం లు ఆంధ్రకు బదిలీ చేసిన 1200 మంది ఆంధ్ర ప్రాంత తెలంగాణా విద్యుత్ ఉద్యోగుల బదిలీ చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్దం అని హైకోర్ట్ తీర్పు చెప్పింది.

25. తెలంగాణా సాంస్కృతిక సమితిలో నామినేషన్ ద్వారా ఎంపిక చేసిన 500 కళాకారుల నియామకం చెల్లదు, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేయాలి అని హైకోర్ట్ చెప్పింది.

26. తెలంగాణా అసెంబ్లీలో స్పీకర్ – తెరాస – కెసిఆర్ కుమ్ముక్కు అయ్యి అనర్హత వేటు వేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎం ఎల్ ఎ లపై అనర్హతను హై కోర్ట్ కొట్టి వేసింది.

27. 21 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై హై కోర్ట్ స్టే విధించింది, ఇది నిరుద్యోగుల హక్కులను హరించడమే అని చెప్పింది.

28. బి సి జనగణన లేకుండా పంచాయితీ ఎన్నికలు జరపకూడదు అని హైకోర్ట్ చెప్పింది.

29. విద్యా సంస్థల ప్రవేసాలలో స్పోర్ట్స్ కోటాను హైకోర్ట్ రద్దు చేసింది.

30. ఎ పి ఉన్నత విద్యామండలి కేసులో తెలంగాణా ప్రభుత్వం చెబుతున్న ఎక్కడి ఆస్తులు అక్కడే అనే వాదనను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది, విద్యా మండలి & 10 షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో వున్నా ఆస్తులను రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంచుకోవాలి అని తీర్పు ఇచ్చింది.

31. GO 39 ద్వారా ఫార్మర్ కో ఆర్డినేషన్ కమిటీకి రూ. 500 కోట్లు ఇవ్వడానిని తప్పు పట్టి హైకోర్ట్ ఆ GO ను కొట్టివేసింది, ఇది స్థానిక సంస్థలను బలహీన పరచడం కోసమే అని చెప్పింది.

32. గెజిట్ నోటిఫికేషన్ లేని, జోనల్ విభజన జరగని 31 జిల్లాల ప్రాతిపదికన ఇచ్చిన DSC నోటిఫికేషన్ చెల్లదు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది, పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలి అని చెప్పింది.

33. ఎనిమిది మంది వైస్ ఛాన్సలర్ ల నియామకాన్ని హైకోర్ట్ కొట్టివేసింది.

34. మైనారిటీ మెడికల్ కాలేజీలో సీట్ల కోటా నిష్పత్తిని (A,B,C) మెడికల్ కాలేజీలకు అనుగుణం గా తెలంగాణా ప్రభుత్వం మార్చడాన్ని హైకోర్ట్ కొట్టివేసింది.

35. స్థానికత ఆధారంగా ఫీజు రీఇమ్బుర్స్మెంట్ ను హై కోర్ట్ నిలిపివేసింది..

36. సింగరేణి సంస్థలో వారసత్వ నియామకాలను హైకోర్ట్ నిలిపివేసింది.

37. గచ్చిబౌలి బయో డైవర్సిటి పార్క్ దగ్గర నిర్మితం అవుతున్న ఫ్లై ఓవర్ పై హై కోర్ట్ స్టే విధించింది..

38. ఏకీకృత సర్వీస్ లపై సవరించిన రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవు అని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది..

39. బైసన్ పోల్ గ్రౌండ్ లో కొత్త సచివాలయం నిర్మాణంపై హైకోర్ట్ యదాతధ స్థితి కొనసాగించమని తీర్పు.

40. ధర్నా చౌక్ పై తెలంగాణా ప్రభుత్వం సంవత్సరకాలంగా ఎందుకు మౌనంగా వుంది అని హై కోర్ట్ ప్రశ్నించింది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration