Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Mudiripoyina Bewarse
Username: Fanno1

Post Number: 11156
Registered: 03-2004
Posted From: 32.212.213.187

Rating: N/A
Votes: 0

Posted on Monday, January 07, 2019 - 5:58 pm:   

Final ga oka manchi pani chesaru sir. Hats off to you..


కేంద్రం ఇచ్చింది అంతంతే.. జేపీ నేతృత్వంలోని కమిటీ నివేదిక
విభజన హామీల అమలులో జాప్యం
పాత పథకాలను కేంద్రం కొత్తగా చూపింది
పెన్షన్‌లో తన వాటానూ ఆపేసింది
పన్నుల వాటా వర్గీకరణలో అన్యాయం
రాష్ట్ర కంపెనీల పన్నులూ తెలంగాణకేనా?
కేంద్రానికి నిపుణుల సిఫారసు
పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌తో వివరణ
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు అంతంత మాత్రంగానే జరిగిందని, ఇంకా చాలా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రావలసి ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది. హామీలు యథాతథంగా అమలు జరిగితే పోలవరం ప్రాజెక్టు నిధులు మినహా ఇంకా రాష్ర్టానికి రూ.75 వేల కోట్లు రావలసి ఉంటుందని స్పష్టంచేసింది. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ నేతృత్వంలోని ఈ కమిటీ.. ఇప్పటివరకూ హామీలు అమలు జరిగిన తీరు, కేంద్రం నుంచి నిధుల విడుదల, వాటి వినియోగం తదితర అంశాలపై నివేదిక విడుదల చేసింది. జేపీ, కమిటీ సభ్యులు జస్టిస్‌ పర్వతరావు, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ సీఎస్‌ అజేయ కల్లం, ప్రొఫెసర్‌ గలాబ్‌, ప్రొఫెసర్‌ రాధాకృష్ణ సోమవారం విజయవాడలో 10 అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నివేదికలోని కీలకాంశాలివీ..

లోటు అంచనా లోపభూయిష్టం..
2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటుకు సంబంధించిన అంచనాలో కేంద్రం గందరగోళం చేసింది. 10 నెలల్లో లోటు రూ.15,451 కోట్లు ఉందని తొలుత అంచనా వేశామంటూ మరో కమిటీని అంచనాకు నియమించింది. లోటు రూ.16,078 కోట్లని కాగ్‌ ధ్రువీకరించింది. అయుతే గతం నుంచి కొనసాగుతున్న పథకాలను కొత్తగా చూపి కొన్నిటిని కేంద్రం తిరస్కరించింది. విద్యుత్‌ వినియోగం రూ.1,500 కోట్లు, పీఆర్‌సీ బకాయిలు రూ.3,920 కోట్లు, పెన్షన్లు రూ.3,578 కోట్లు, రుణమాఫీకి రూ.7,069 కోట్లు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ క్రమంలో అప్పటివరకూ పాత పెన్షన్‌ రూ.200లో ఇచ్చే వాటాను కూడా నిలిపివేసింది. పీఆర్‌సీ నిర్ణయం కూడా అంతకుముందు ప్రభుత్వమే తీసుకుంది. కొత్తగా చేసిన నిర్ణయం కాదు. వనరుల లోటు రూ.4,117 కోట్లు మాత్రమేనని నిర్ధారించడం సరికాదు. మా అధ్యయనంలో 2014-15 వనరుల లోటు కింద రాష్ర్టానికి మొత్తం రూ.19,015 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కొన్ని సాధ్యం కావని భావించినప్పటికీ ఇంకా రూ.10,335 కోట్లు రావాలి.’

ఇదేం పన్నుల పంపకం?
కంపెనీల ద్వారా ఆంధ్రకు దక్కే వాటా విషయంలో అసె్‌సమెంట్‌ (కేంద్ర కార్యాలయంలో వేసే అంచనా)ను కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. కేంద్ర కార్యాలయాల రిజిస్ర్టేషన్లు అన్నీ హైదరాబాద్‌లో ఉండడంతో రాష్ట్రంలోని కంపెనీల పన్నులూ తెలంగాణకు వెళ్లాయి. రాష్ట్రం రిఫండ్‌ చేయాల్సిన పన్నులకు మాత్రం జనాభా ప్రాతిపదిక నిబంధన విధించింది. దీంతో మనపై 58 శాతం భారం పడింది. ఈ క్రమంలో రాస్త్రానికి రూ.6,841 కోట్లకు గాను రూ.3,021 కోట్లే వచ్చాయి. తెలంగాణకు రూ.4,888 కోట్లు వెళ్లాల్సి ఉండగా రూ.6,709 కోట్లు దక్కాయి. ఆంధ్రకు రూ.3,820కోట్లు నష్టం ఏర్పడింది.’

అప్పులు రద్దు చేయండి
‘కేంద్రం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేని పక్షంలో కేంద్రం, నాబార్డు, ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90 శాతం భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తద్వారా రూ.16,447 కోట్లు రావాలి. కానీ అన్నీ కలిపి రూ.42 కోట్లే ఇచ్చారు.

పోలవరానికి 3,342 కోట్లు ఇవ్వాలి
‘పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం రూ.10,069 కోట్లు ఖర్చుచేస్తే, అందులో కేంద్రం రూ.6,727 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.3,342 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.’

తలసరి ఆదాయం చాలా తక్కువ
‘వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.24,350 కోట్లు రావలసి ఉండగా.. కేంద్రం ఇప్పటివరకూ రూ.1051 కోట్లు మాత్రమే ఇచ్చింది. విభజన తర్వాత రాష్ట్ర తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. అది పెరగాలంటే వృద్ధి రేటు ఐదేళ్లపాటు 12.5 శాతంగా కొనసాగాలి. అందుకోసం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు అవసరం.’ ఇంకా... దుగరాజపట్నంలో ఇస్తామన్న పోర్టు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. అందువల్ల రామాయపట్నంలోనైనా దానిని నిర్మించాలి. ఈ పోర్టు వస్తే రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. రాష్ర్టానికి మౌలిక సదుపాయాలైన రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమల విషయంలో హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. హైదరాబాద్‌- అమరావతి ఆరు లైన్ల రహదారి ఇంకా ప్రారంభం కాలేదు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే పరిస్థితీ ఇదే. విభజన చట్టంలో పదేళ్ల వరకు పన్నులు ఉండవని, పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు. కానీ అమలు కావడం లేదు.

పార్టీలూ.. ఆ కోణంలో చూడొద్దు..: జేపీ
‘రాజకీయ పార్టీలు రాష్ట్ర భవిష్యత్‌ను రాజకీయ కోణంలో చూడరాదు. రాష్ట్రం తలసరి ఆదాయంలో చాలా వెనుకబడి ఉంది. ఇది మెరుగుపడాలంటే వచ్చే ఐదేళ్లలో రాష్ర్టానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు రావలసిన అవసరం ఉంది. ఇందులో రూ.లక్ష కోట్లు ప్రభుత్వ రంగం నుంచి, రూ.లక్ష కోట్లు ప్రైవేటు నుంచి రావాలి. రెండు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఒక ప్రాతిపదిక పాటించలేదు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన రూ.93 కోట్లు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఒకవేళ అదే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కేంద్రానికి ఏవైనా చెల్లించాల్సి వస్తే ఆ భారాన్ని ఆంధ్రపైనే వేస్తారు.’

రాజధానికి రూ.1500 కోట్లేనా..?
‘రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తే కేంద్రం రూ.1500 కోట్లే విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాల డ్రైనేజ్‌ పనులకు మరో రూ.1,000 కోట్లు ఇచ్చింది. మొత్తంకాకున్నా రోడ్లు, వరదనీటి లైన్లు, పారిశుద్ధ్య లైన్లు, తాగునీటి అవసరాల కోసమైనా కేంద్రం నిధులివ్వాల్సిన అవసరం ఉంది. గుంటూరు, విజయవాడ డ్రైనేజ్‌ పనుల్లో రూ.229 కోట్లకు, రాజధాని విషయంలో రూ.1,631 కోట్లకు ప్రభుత్వం యూసీ లు సమర్పించింది.’

జాతీయ సంస్థలకు 6శాతమే
‘విభజన అనంతరం రాష్ర్టానికి మంజూరుచేసిన 11 జాతీయ సంస్థలకు ఇప్పటివరకూ 6శాతం నిధులే వచ్చాయి. రూ.12,746 కోట్లు రావలసి ఉండగా కేంద్రం రూ.845 కోట్లే విడుదల చేసింది. ఇంకా 93 శాతానికి పైగా నిధులు రావాలి. రాష్ట్రప్రభుత్వం తన బాధ్యతగా భూములిచ్చింది. మౌలిక సదుపాయాలూ కల్పిస్తోంది.’

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration