Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 11139 Registered: 03-2004 Posted From: 32.212.213.187
Rating: N/A Votes: 0 | Posted on Friday, December 28, 2018 - 5:46 am: | |
హైకోర్టు విభజనపై కేంద్రం తీరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. సంప్రదింపులు జరపకుండానే విభజన చేసిందని విమర్శించారు. సమయం ఇవ్వకుండా జనవరి 1నే వెళ్లిపోవాలనడం సరికాదన్నారు. ఆరో శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడిన ఆయన.. జగన్ కేసులను దృష్టిలో పెట్టుకునే విభజన చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని తెలిపారు. జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని.. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారన్నారు. కాబట్టి ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. |