Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 27874
Registered: 08-2004
Posted From: 85.76.77.193

Rating: N/A
Votes: 0

Posted on Sunday, December 09, 2018 - 7:30 am:   

హోరా హోరి గా కూకట్పల్లి శాసనసభఎన్నికలు ...........మూడు రోజులుగా అన్ని కోణాల్లో పరిశీలించిన మీదట కూకట్పల్లి ఎన్నికల ఫలితం ఇలా ఉంది .
నియోజకవర్గం లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు , మహిళలు ఎక్కువుగా టి .డి .పి అభ్యర్థి పట్ల సానుకూలంగా ఓట్లు వేశారు .
ఆంధ్ర కు సంబందించిన రెండు కులాలు వారు ఎక్కువుగా టి .ఆర్ .ఎస్ కు వేశారని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లో తేలింది.
ఎల్లుండి ఎన్నికలు అనగా ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయిన రెండు పార్టీల కుల నేత లు రంగ ప్రవేశం చేసి టి .ఆర్ .ఎస్ అభ్యర్థి కి ఓట్లు వేయించి నారు .అందు వలన B.S.P.అభ్యర్థి 25000 ఓట్లు చీల్చుకోగలడు అని అంచనా వేస్తే 17000 ఓట్ల వరకు మాత్రమే పరిమితం అయ్యాడు .
ఇంకా ఉత్తరాంధ్ర కు సంబందించిన వారు సింహభాగం టి .డి .పి కి వేశారు .
ఇక నియోజకవర్గం లోని ప్రధాన సామాజిక వర్గం ఓట్లు దాదాపు 15000 వేల ఓట్లు పోలు కాలేదు .కేవలం 45000మంది మాత్రమే వోటింగ్ కి వచ్చారు .వారిలో 2000 టి .ఆర్ .ఎస్ కి 1000 ఓట్లు హరీష్ రెడ్డి కి వేశారు .
ఇంకా ఈ ఎన్నికల్లో డబ్బు బాగా పని చేసింది .

నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు 372819 .
పోలయిన ఓట్లు 215369
పోలయిన ఓట్ల శాతం 57.77
2014 ఎన్నికలలో పోలయిన ఓట్ల శాతం 49%
దాదాపు 8% ఎక్కువుగా పోలు అయినవి .
అభ్యర్థులకు వచ్చిన ఓట్లు .
1.నందమూరి వెంకట సుహాసిని .... 95500( టి.డి .పి )
2 మాధవరం కృష్ణా రావు . ..88000. (టి .ఆర్ .ఎస్ )
3.హరీష్ చంద్రా రెడ్డి 17000( B.S.P)
4.మాధవరం కాంతారావు .8600( బి .జె .పి )
ఇతరులకు దాదాపు 6000 పైన ఓట్లు పోల్ కానున్నవి .
తెలుగు దేశం అభ్యర్థి తన సమీప టి .ఆర్ .ఎస్ ప్రత్యర్ది పైన 7500 ఓట్ల మెజారిటీ తో గెలవనున్నది .3000 ఓట్లు అంచనా లో తేడా వచ్చే అవకాశం ఉన్నది .
తెలుగు దేశం కి ఎక్కువుగా మూసాపేట్ ,బాలాజీ నగర్ ( ఇందులో హోసింగ్ బోర్డు ఎక్కువ కలిసి ఉంది ).కే.పి హెచ్ .బి ,డివిజన్ లలో ఎక్కువగా మెజారిటీ రానున్నది .బాలా నగర్ లో స్వల్పం గా రానున్నది .ఇక కూకట్పల్లి డివిజన్ లో 150 నుంచి 200 ఓట్ల మెజారిటీ రానున్నది (.ఇక్కడ అజ్ఞాతం గా చక్రం తిప్పిన మిత్రునకు ధన్యవాదములు )
ఇక తెలుగు దేశం తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలు బేగం పెట్ ,ఓల్డ్ బోయిన పల్లి ,అల్లాపూర్ డివిజన్లు .
టి .ఆర్ .ఎస్ కు బాగా వచ్చిన డివిజన్లు .ఓల్డ్ బోయిన పల్లి ,అల్లాపూర్ డివిజన్ లు .
బి .జె .పి ఎక్కువగా బేగం పెట్ (ఇక్కడ ఉత్తరభారతీయులు ఎక్కువ,వారిలో కూడా గుజరాతీయులు ఎక్కువ ).ఇక కూకట్పల్లి డివిజన్ లో బి .జె .పి అభ్యర్థి చెప్పుకో దగ్గ ఓట్లు సాదించనున్నాడు .
హరీష్ రెడ్డి ఎక్కువుగా ఓల్డ్ బోయిన పల్లి ,ఫతే నగర్ ,అల్లాపూర్ ,బాలాజీ నగర్ ,కె .పి .హెచ్ .బి డివిజన్ లలో గణనీయము గా ఓట్లు సాధించనున్నాడు .
హరీష్ రెడ్డి దాదాపు టి .ఆర్ .ఎస్ ఓట్లు ,కొంత మేర టి .డి .పి ఓట్లకు గండి కొట్టాడు .
ఇక బి .జె .పి అభ్యర్థి కూకట్పల్లి అతను అవటం వలన అతను చీల్చిన ఓట్లు కూకట్పల్లి డివిజన్ లో ఎక్కువ గా ఉండటం వలన తెలుగు దేశం కు లాభం గా మారింది .
కేసాని సురేష్ బాబు, న్యాయ వాది ,కూకట్పల్లి నియోజకవర్గం


Penkul ee news enta credible?
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration