Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Celebrity Bewarse
Username: Esperanza

Post Number: 27793
Registered: 08-2004
Posted From: 130.233.93.141

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 04, 2018 - 5:28 am:   

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్‌ రెడ్డి నిర్బంధంపై ఈ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్నినియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలపగా.. ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచి. రేవంత్ అరెస్టుకు కారణాలపై ఆధారలను ఈ రోజే కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఈ విచారణకు అడ్వొకేట్‌ జనరల్‌ హాజరుకావాలని ఆదేశించింది.
రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఆయన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. దీంతో విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration