Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7938
Registered: 03-2004
Posted From: 204.63.42.10

Rating: N/A
Votes: 0

Posted on Monday, December 10, 2018 - 9:59 am:   

ఘనకీర్తి= ఘనమైన కీర్తి ని
సాంద్ర = ప్రగాఢంగా వ్యాప్తి చేసుకున్న వాడా..
విజితాఖిలాంథ్ర
( విజిత = విజేత గా
అఖిలాంథ్ర) = అఖిలాంథ్రని గెలుచుకున్న వాడా..
జనతా = ప్రజల గురించి
సుధీంద్ర = సర్వమూ తెలిసిన సర్వజ్ఞుడా..
మణిదీపకా = దారి చూపే మణిదీపం వంటి వాడా..

త్రిశతకాథికా = 300కి పైగా
చిత్రమాలికా = చిత్రాల మాలతో
జైత్రయాత్రికా = అప్రతిహతమైన ఎవరూ ఆపలేని విజయ యాత్ర చేసిన వాడా..

కథానాయకా..= మా కథానాయకుడా..

ఆహార్యాంగిక( ఆహార్య + ఆంగిక )
ఆహార్య = వేషధారణ
ఆంగిక = శరీర భాష,భంగిమలు
వాచిక = సంభాషణలు పలికే విధానాలు
పూర్వక = మొదలైన వాటిలో
అద్భుత = ఎంతో సంభ్రమాశ్చర్యాల్ని కలిగించే
అతులిత = ఎవరూ సరితూచలేని
నటనా = అభినయ
ఘటికా = సామర్థ్యం గల వాడా.

భీమసేన వీరార్జున =భీమసేనుడు,అర్జునుడు,
కృష్ణ దానకర్ణ =కృష్ణుడు,దానకర్ణుడు,
మానథన సుయోథన = అభిమానధనుడైన దుర్యోధనుడు,
భీష్మ బృహన్నల =భీష్ముడు, బృహన్నల,
విశ్వామిత్ర =విశ్వామిత్రుడు,
లంకేశ్వర = లంకాథిపతి ఐన
దశకంఠ రావణాసుర = దశకంఠుడు రావణాసురుడు
ఆధి= మొదలైన
పురాణ పురుష = పురాణ పురుషుల
భూమికా పోషకా..= పాత్రలని పోషించిన వాడా..

సాక్షాత్= సాక్షాత్తూ
సాక్షాత్కారకా..= ఆ రూపాలు మాకు కనిపించడానికి కారణమైన వాడా..

త్వదీయ = మీ

ఛాయాచిత్ర = ఛాయాచిత్రాలతో

ఆఛ్ఛాదిత = నిండుగా కప్పి

రాజిత = శోభాయమానమై
రంజిత - మంత్ర ముగ్ధమైంది
చిత్ర యవనిక = చలన చిత్ర సీమ

న = లేని
ఇదం = ఇక్కడ ఈ లోకంలో
పూర్వక = గతంలో ఎప్పుడూ

రసోత్పాదకా ( రస + ఉత్పాదకా)

రస = రసానుభూతిని
ఉత్పాదకా = కలిగించిన వాడా, సృష్టించిన వాడా

కీర్తి కన్యకా = కీర్తి అనే కాంత
మనోనాయకా = మనసు గెలిచిన వాడా..

కథానాయకా..= ఓ కథానాయకుడా..
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration