Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7026
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Sunday, August 03, 2014 - 8:47 am:   

Gurinchi edo cheptha vunnaru... telsina vallu... Ippudu AJ lo direct attack...

రుణ మాఫీ విషయంలో మినహాయించి మిగతా నిర్ణయాల విషయంలో కేసీఆర్‌తో చంద్రబాబు పోటీపడటం లేదు. గత నెలలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం తర్వాత 43 నిర్ణయాలు తీసుకున్నామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా ఇంతవరకు అమలుకాలేదు. బారెడు చెప్పి మూరెడు చేయడం అలవాటుగా చేసుకున్నారు.
హైదరాబాద్‌ పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ, ఇందులో భాగంగా 1,650 ఇన్నోవా వాహనాలను సమకూర్చుతున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. ఆచరణలోకి వచ్చేసరికి ఆర్డరిచ్చిన ఇన్నోవాల సంఖ్య మూడు వందలకు పరిమితమైంది. ఈ వ్యవహారంలో కూడా ‘‘మరి మాకేంటి?’’ అంటూ కణ్ణన్‌ అనే వ్యక్తి టయోటా కంపెనీ ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. ‘‘కంపెనీ తరఫు నుంచి మేం ఏమీ చేయలేం. కావాలంటే మా డీలర్లకు చెబుతాం. వారితో మాట్లాడుకోండి’’ అని కంపెనీ ప్రతినిధులు బెంగళూరుకు చెందిన కణ్ణన్‌కు వివరించారు. కేసీఆర్‌ కుటుంబసభ్యుల తరపున ఇటువంటి వ్యవహారాలను తానే చూసుకుంటానని కణ్ణన్‌ ప్రచారం చేసుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని టయోటా డీలర్స్‌ ఇద్దరూ ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు కావడంతో, బెంగళూరులో ప్రత్యక్షమైన కణ్ణన్‌ తెర మీద నుంచి నిష్క్రమించారు. దళితులు, గిరిజనుల ఇళ్లల్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిగితే కల్యాణ లక్ష్మి పథకం కింద 50 వేలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అయితే ఇంతవరకు ఈ పథకం అమలు ఎప్పుడనేది చెప్పడం లేదు. స్థూలంగా చెప్పాలంటే 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి అమలుచేసిన విధానాన్నే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు తనదైన శైలిలో అమలుచేస్తున్నారు. అప్పట్లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపిన పత్రికల విశ్వసనీయత దెబ్బతీయడానికి ‘ఆ రెండు పత్రికలంటూ’ పరోక్షంగా పత్రికలకు కులాన్ని ఆపాదించారు. ఇప్పుడు కేసీఆర్‌ అదే బాటలో తన ప్రభుత్వ లోపాలను ఎవరైనా ఎత్తి చూపినా ప్రజలు నమ్మకుండా ఉండేందుకై ఆంధ్రా మీడియా అని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే కేసీఆర్‌ రాజకీయాలలోకి రాక ముందు నుంచి ఆయన చెబుతున్న ఆంధ్రా మీడియా తెలంగాణలో ఉంది. తన అవినీతి చర్యల నుంచి ప్రజలను ఏమార్చడానికై రాజశేఖర్‌ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించుకుంటూపోయేవారు. పలు నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించారు.

ఈ విధానాన్నే కేసీఆర్‌ ఇప్పుడు మరో రూపంలో అమలుచేస్తున్నారు. అవినీతి విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తాననీ, అక్రమాలను సహించబోనన్న సంకేతాలు ఇవ్వడానికై ముందుగా హైదరాబాద్‌లో కొన్ని అక్రమ నిర్మాణాలను కూలగొట్టించారు. కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామంటూ సర్వేలు చేయించడం మొదలెట్టారు. ఇవన్నీ చూసిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిగా నమ్మడం మొదలెట్టారు. అక్రమ నిర్మాణాల వ్యవహారం అయిదు రోజుల హడావుడి తర్వాత చల్లబడిపోయింది. భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వంతున పంపిణీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌, ఇప్పుడు మొదటగా ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన ఒక గ్రామంలోనే పంచుతామంటున్నారు. భూమి కొనుగోలు చేసి అయినా దళితులకు అప్పజెబుతామన్న ముఖ్యమంత్రి, అధికారులకు పంపిన ఆదేశాలలో మాత్రం మరో విధంగా మెలికపెట్టారు. కేసీఆర్‌ వ్యూహాలను అర్థం చేసుకోలేకపోతున్న కొంతమంది, దళితులకు భూపంపిణీ అనేది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పుడే మొదటిసారిగా అమలవుతున్నట్టు కీర్తించడం ప్రారంభించారు. వాస్తవానికి తెలంగాణ జిల్లాలలో భూమి లేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వంతున పంపిణీ చేయాలంటే కొన్ని లక్షల ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఒక విషయం అంగీకరించాలి. కేసీఆర్‌ చాలా తెలివిగలవాడే కాదు, తెలంగాణ సమాజాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి కూడా! ఏమి చేస్తే, ఏమి చెబితే ప్రజలు ఆకర్షితులవుతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆకర్షణీయ ప్రకటనలకు తెర తీశారు. తాను చండశాసనుడనని ప్రజలు నమ్మడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన వ్యూహం ఫలించింది. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ కుటుంబం డబ్బు దండుకుందని నమ్మినవాళ్లు కూడా ఇప్పుడు ఆయనను నిజాయితీపరుడిగా విశ్వసిస్తున్నారు. తెలంగాణలో విశ్వసనీయత ఉన్న వ్యక్తులను ఏదో ఒక రూపంలో సంతృప్తిపర్చడానికి కేసీఆర్‌ ప్రయత్నించడం కూడా ఆయన వ్యూహంలో భాగమే! ఈ చర్య వల్ల ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలను ఎవరూ బహిరంగంగా విమర్శించడానికి ముందుకు రావడం లేదు. తెలంగాణ సమాజానికి జరిగే సకల అనర్థాలకు కాంగ్రెస్‌, బీజేపీలు కారణమని నిందించడం ద్వారా ఆ రెండు పార్టీలను ఆత్మరక్షణలోకి నెడుతూ వచ్చారు. ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్‌- బీజేపీలు ఇప్పుడిప్పుడే బయటపడి ఎదురుదాడి మొదలెట్టాయి. తెలంగాణలో ఒకప్పుడు ప్రజాసంఘాలు బలంగా ఉండేవి. ఇప్పుడు వాటికి గొంతుక లేకుండా పోతున్నది. కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాలలోని లోపాలను ఎవరూ వేలెత్తి చూపలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఉమ్మడి రాష్ర్టానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కులో వాకింగ్‌ చేయడానికి వచ్చేవారి నుంచి వసూలు చేసే ఫీజును అయిదు రూపాయలకు పెంచారు. దీనిపై ఆగ్రహం చెందిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రభృతులు ముఖ్యమంత్రిని కలిశారు. ఫీజు పెంపు నిర్ణయాన్ని ఒక అధికారి సమర్థించుకోవడానికి ప్రయత్నించగా, ఆగ్రహించిన సినారె ‘‘నేను ఎవరో తెలుసా? గాలికి, నీరుకు పన్ను వేస్తారా’’ అంటూ మండిపడ్డారు. ఇప్పుడు అదే కేబీఆర్‌ పార్కులో వాకర్స్‌ నుంచి వసూలుచేస్తున్న పన్నును పది నుంచి ఇరవై రూపాయలకు పెంచారు. అయినా ప్రశ్నించడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు.
మీడియాపై ఎమర్జెన్సీ!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రా పెత్తందారీతనం పోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలంగాణ ప్రజలు భావించారు. అయితే కేసీఆర్‌ మాత్రం ఆంరఽధా పెత్తందారులను మించిపోవడమే కాదు- నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిని ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా ప్రజలు తెలుసుకుంటారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి తెలంగాణలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను డమ్మీ చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను పిలిపించుకుని బడ్జెట్‌ రూపకల్పన చేస్తున్నారని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ శుక్రవారంనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. మామూలుగా అయితే ఇలాంటి కథనాలు పత్రికలలో ఇప్పుడే కాదు, గతంలో కూడా పలుమార్లు వచ్చేవి. అప్పుడు అధికారంలో ఉన్నవారు వివరణ ఇచ్చేవారే గానీ ఆగ్రహించేవారు కాదు. ఘనత వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రం ఎవరూ వేలెత్తి చూపకూడదు.

అందుకే ఆయనకు కోపం వచ్చింది. ఇలాంటి కథనాలు ప్రచురించే పత్రికల విషయంలో ఏమి చేయాలో ఆలోచిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం చెప్పే విషయాలు కాకుండా మరేమీ రాయకూడదని ఆయన కోరుకుంటున్నారు. అదెలా సాధ్యమని ప్రశ్నించేవారు ఇప్పుడు కనబడకపోవచ్చు. మున్ముందు అందరూ ప్రశ్నించేవారే ఎదురవుతారు. పత్రికలలో వచ్చే కథనాలలో తప్పు ఉంటే వివరణ ఇవ్వవచ్చు గానీ బెదిరించడం ఏమిటి? ఇంతకీ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ రాసిన దాంట్లో తప్పు ఏమి ఉంది? ఆర్థిక శాఖ అధికారులతో జరుగుతున్న సమావేశాలలో సంబంధిత మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొంటున్నారా? లేదే? రాజేందర్‌ మాత్రమే కాదు, ఇటువంటి సమావేశాలకు ఇతర మంత్రులను కూడా దూరంగా పెడుతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. మాజీ టీఆర్‌ఎస్‌ నాయకుడొకరు ఒక మంత్రిని కలిసి ఫలానా ఉద్యోగిని బదిలీ చేయాలని కోరారు. దానికి సదరు మంత్రి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘నా దగ్గరకు వచ్చే ఫైళ్లన్నింటినీ ప్రతి రోజూ ముఖ్యమంత్రి ఇంటికి పంపుతాను. అక్కడి నుంచి స్లిప్‌ల మీద రాసి పంపిన విధంగా ఆయా ఫైళ్ల మీద సంతకాలు చేస్తాను. స్వతంత్రంగా నేను ఏమీ చేయలేను. నన్ను మన్నించండి’’ అని అన్నారు. బడ్జెట్‌ రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ మంత్రి, ఆయా శాఖల అధికారులు, మంత్రులతో సమావేశమై వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇదే చేశారు.

బడ్జెట్‌కు తుది రూపం ఇచ్చే ముందు చివరగా ముఖ్యమంత్రి వద్ద సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్పులు చేర్పులు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రజాస్వామిక ప్రక్రియ చోటుచేసుకుందని ఎవరైనా చెప్పగలరా? ప్రభుత్వం ఏమి చేయబోతున్నదో కేసీఆర్‌కు, మహా అయితే ఆయన కుటుంబ సభ్యులకు మినహా మరెవ్వరికైనా తెలుసా? ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అంటారు. ప్రభుత్వం జారీచేసే ప్రెస్‌ నోట్లు ముద్రించడానికి మాత్రమే పత్రికలు ఉండవు. కేసీఆర్‌ అలా కోరుకుంటూ ఉంటే, ఆయన ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పత్రికను పెట్టుకోవచ్చు. ముఖ్యమంత్రులుగా ఎందరో వస్తుంటారు. పోతుంటారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిని ప్రజలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. తన ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తూ వార్తలు ప్రచురించే పత్రికలపై మండిపడుతున్న కేసీఆర్‌, తన సొంత పత్రికలో ప్రతి నిత్యం ఇతర రాజకీయ పార్టీలపై దుమ్మెత్తిపోస్తూ ఉంటారే? మరి ఆ రాజకీయ పార్టీలు ఏమి చేయాలి? మీడియాతో వ్యవహరించే విషయంలో తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని అనుసరించడం కేసీఆర్‌కే మంచిది. చంద్రబాబుకు, ఆయన పార్టీకి, కుటుంబానికి వ్యతిరేకంగా జగన్మోహన్‌ రెడ్డి సొంత మీడియాలో పలు కథనాలను నిత్యం వండుతూ ఉంటారు. కేసీఆర్‌ సొంత మీడియా తీరు అంతకంటే దారుణంగా ఉంటుంది. కనీస పాత్రికేయ ప్రమాణాలు ఉండవు. అయినా చంద్రబాబునాయుడు ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదా అని జగన్‌ మీడియాను అణచివేయడానికి ప్రయత్నించడం లేదే? ప్రజాస్వామిక లక్షణం అంటే అదే! స్వల్ప విమర్శను సైతం సహించలేకపోతున్న కేసీఆర్‌, ప్రజాస్వామికవాది ఎలా అవుతారు? నియంతగా మాత్రమే మిగులుతారు. నియంతలెవరూ విజేతలుగా నిలవలేరు. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంచిపెట్టడం వల్ల తాత్కాలికంగా జేజేలు అందుకోగలరు గానీ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజనీతిజ్ఞతతో పాలించేవారినే ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration