Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21526 Registered: 08-2008 Posted From: 103.246.92.206
Rating: N/A Votes: 0 | Posted on Saturday, July 19, 2014 - 11:56 pm: | |
చోరీకి వచ్చి టిఫిన్ చేసుకు తిన్నారు' చెన్నై : రహస్యంగా లోనికి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకుని పరారు కావాల్సిన దొంగలు నింపాదిగా పరోటా, చట్నీ చేసుకుని సుష్టుగా తిని వెళ్లిన చిత్రమైన సంఘటన అంబూరులో చోటుచేసుకుంది. మధురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన రామరాజన్ వేలూరు జిల్లా మిన్నూరు రహదారి పక్కన ఆరునెలలుగా హోటల్‌ను నిర్వహిస్తున్నారు. సమీపంలోని ఒక ఇంటిలో కుటుంబంతో సహా కాపురం ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ రామరాజన్ తన హోటల్‌కు తాళం వేసి కుటుంబంతో సహా సొంతూరుకు వెళ్లి శనివారం తిరిగి వచ్చి హోటల్లో దొంగలు పడ్డట్లు గుర్తించాడు. క్యాష్‌బాక్స్‌లోని రూ.6,500 నగదు, మూడు జనరేటర్లు, కొన్ని మైదాపిండి బస్తాలు చోరీకి గురైనట్లు లెక్కకట్టాడు. అంతేకాదు హోటల్లో సావకాశంగా పరోటాలు, దండిగా చెట్నీ తయారు చేసుకుని తిన్నట్లు కనుగొని ఆశ్చర్యపోయారు. బస్తాలు చినిగిపోయిన కారణంగా మైదాపిండి రోడ్డు వెంబడి కారుతూ దొంగలు వెళ్లిన ఫోర్‌లైన్ రోడ్డు మార్గాన్ని గుర్తించడం వారిని విస్తుపోయేలా చేసింది. |