Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6979
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Sunday, June 29, 2014 - 7:00 pm:   

2 weeks back baga telsina vallu chepparu... L&T ni 1000 crore demand chesaru anee... Now the project in doubt...

ఒప్పందాన్ని యథాతథంగా ఆమలు చేయాలి
డైలమాలో ఎల్ అండ్ టీ
సంకటంలో మెట్రో రైల్!
కొత్త మెలికలకు ఎంతమాత్రం అంగీకరించం
కాదూ కూడదంటే 1 నుంచి పనులు ఆపేస్తాం
టీ సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ?

(హైదరాబాద్ సిటీ-ఆంధ్రజ్యోతి) రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు.. వివాదంలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మెట్రో రైలు పనులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీకి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పొసగని వాతావరణం.. ప్రాజెక్టును సంకటస్థితిలోకి నెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి కీలకమైన లేఖ రాసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం (ఒరిజినల్ అగ్రిమెంట్)లోని బాధ్యతలను (కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్) యథాతథంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనీ, ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మంగళవారం (జూలై 1) నుంచి తాము పనులు ఆపేస్తామని ఆ లేఖలో ఎల్ అండ్ టీ స్పష్టంచేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ మెట్రో (పిల్లర్ల ఆధారంగా ప్లై ఓవర్లపై వేసే రైలు మార్గం) నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు వేగంగా పనులను పూర్తి చేస్తోంది. ఇంతలోనే రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది. ఆ సమయంలో.. మెట్రో రైలు మార్గం కోసం హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేయడాన్ని అంగీకరించబోమంటూ కొన్ని తెలంగాణ పార్టీలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఆందోళనలు కూడా నిర్వహించాయి.

అయితే అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆ పార్టీ హయాంలోనే మెట్రో ఒప్పందం కుదరడంతో ఎల్ అండ్ టీ సంస్థ పనులను నిరాటంకంగా కొనసాగించగలిగింది. ఇబ్బందులేవైనా తలెత్తినా, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సాయంతో ఉపాయంగా పరిష్కరించుకుంది. అయితే ఇంతలోనే విభజన ప్రక్రియ పూర్తి కావడం, ఎన్నికలు రావడం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాల ముందు నుంచి ఎలివేటెడ్ మెట్రో రైలు మార్గాన్ని అనుమతించబోమని, అక్కడ సొరంగ పద్ధతిలో భూగర్భ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సుల్తాన్ బజార్‌ను పరిరక్షించడం కోసం, జూబ్లీబస్ స్టేషన్ - ఫలక్‌నుమా కారిడార్‌ను దారి మళ్లించాలని ఆయన ఆదేశించారు. దీనిపై సమీక్ష జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులను ఆదేశించారు. కానీ.. "అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అదీగాక అక్కడ భూగర్భ మార్గం నిర్మించడం ఎంతమాత్రం సాధ్యం కాదని మా ఇంజినీర్లు తేల్చేశారు. మొత్తమ్మీద వ్యవహారాన్ని గమనిస్తే తెలంగాణ ప్రభుత్వం పాత విషయాలను తవ్వి తీసి, ప్రాజెక్టును మళ్లీ మొదటికి తెస్తున్నట్టు అనుమానంగా ఉంది'' అని ఎల్ అండ్ టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. నాగోల్-మెట్టుగూడ కారిడార్ దాదాపు పూర్తి కావచ్చింది. ఉప్పల్ డిపోలోనూ 95 శాతం పనులు పూర్తి అయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. నాగోల్-మెట్టుగూడ కారిడార్‌లో మెట్రో రైలు ప్రారంభానికి 2015 ఉగాదిని ముహూర్తంగా నిర్ణయించారు. కొరియా నుంచి నాలుగు మెట్రో రైళ్లను ఉప్పల్ డిపోకు రప్పించారు. జూన్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ స్వయంగా మీడియా ముందు ప్రకటించారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్త మెలికలు పెట్టడంపై ఎల్ అండ్ టీ మెట్రో ఇంజినీర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.

ముభావంగా కేసీఆర్.. అప్పుడే అనుమానం!
నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ (ఎల్ అండ్ టీ) వీబీ గాడ్గిల్‌తో పాటు సంస్థ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. అభినందనలు తెలియజేశారు. "అయితే ఆ సమయంలో కేసీఆర్ ముభావంగా కనిపించారు. ఆయన స్పందన ముక్తసరిగా, పొడిపొడిగా ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ వైఖరిపై మాకు అప్పుడే సందేహాలు కలిగాయి. తర్వాత పెడుతున్న మెలికలు మా అనుమానాలను ధ్రువీకరిస్తున్నాయి'' అని ఎల్ అండ్ టీ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడే ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండానే, ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు ప్రారంభ తేదీని ప్రకటించడంతో రెండు వర్గాల మధ్య అంతరం పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్టుకు అవసరమై భూసేకరణ... గడువు ముగిసినా ఇప్పటికీ పూర్తి కాలేదనీ, ఫలితంగా పనులు జాప్యమవుతాయని, ఇది మొత్తం ప్రాజెక్టుకు భారంగా మారడమే కాక, తమ ఇమేజ్ దెబ్బతింటుందని ఎల్ అండ్ టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో.. "ఇలాంటి ఇబ్బందికర స్థితి (సఫకేటింగ్ సిచ్యువేషన్)లో మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లగలమా? దీంట్లో కొనసాగడం మంచిదా? కొనసాగగలమా? లేక ప్రాజెక్టు నుంచి వైదొలగుదామా?'' అని ఎల్ అండ్ టీ డైలమాలో పడినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని, గతంలో కుదిరిన ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేయడానికి సానుకూలత వ్యక్తపరిస్తేనే మెట్రో రైలు ప్రాజెక్టులో కొనసాగాలని ఎల్ అండ్ టీ భావిస్తున్నట్టు సమాచారం. అలా కాకుండా కొత్త మెలికలు పెట్టి, వాటి అమలుకు ఒత్తిడి చేస్తే మాత్రం ప్రాజెక్టుకే గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తొలిదశగా ఈ లేఖ రాసినట్టు సంస్థ వర్గాలు వివరించాయి. మెట్రో రైలు ప్రాజెక్టు, టీ సర్కారుకు ఎల్ అండ్ టీ లేఖ వ్యవహారంపై ఆదివారం సాయంత్రమే 'ఏబీఎన్- ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రసారం చేసింది. విషయం బయటపడగానే తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీశారు. అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు ఎల్ అండ్ టీ ఉన్నతస్థాయి అధికారులు ఎవరూ ఈ వార్తను ఖండించకపోవడం గమనార్హం. దీనిపై.. ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డిని 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధి సంప్రదించగా, ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration