Musicfan
Celebrity Bewarse Username: Musicfan
Post Number: 48693 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 23, 2014 - 10:53 am: | |
"మనం" కథ తెలుసుకోవటానికి ప్రయత్నించవద్దు. కథ తెలియకుండా చూస్తే మీకు కలిగే సంతోషం వంద "కమర్షియల్ హిట్" సినిమాలు చూసినా రాదు. కథని నమ్మి నిజాయితీగా తీసిన సినిమా ఇది. చివరిలో బ్రహ్మానందం కామెడీ తో గట్టెక్కే లాంటి సినిమా కాదు. ఈ సినిమా చూసేటప్పుడు మీకు కళ్ళల్లో నీళ్ళు తిరగొచ్చు. దర్శకుడు బాగా తీశాడు. ఇంకొంచెం ఎమోషనల్ సీన్స్ మీద దృష్టి పెట్టి ఉంటే సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కడూ ఖచ్చితంగా చాలాసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకునే వాళ్ళు. అప్పటికీ రెండు మూడు సన్నివేశాల్లో నాలాంటి వాడికే సుడులు తిరిగాయంటే .... ఆ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ని అనుభవించి తీరాల్సిందే. నేను మళ్ళీ మళ్ళీ చూస్తాను మన మనం ని. SOTW - Ramachakkani Seetaki
|