Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20719 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 29, 2014 - 1:34 am: | |
మాగంటి బాబుకు గాయాలు ఆసుపత్రిలో చేరిక.. టీడీపీలో ఆందోళన ఏలూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. ఆయనను మెరుగైన చికిత్స కోసం ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం రాత్రి చేర్చారు. ఆదివారం రాత్రి జంగారెడ్డిగూడెంలో నారా లోకేశ్ పర్యటన సందర్భంగా కార్యకర్తలను ముందుకు కదిల్చే క్రమంలో బైక్‌పై ప్రయాణిస్తూ మాగంటి కింద పడ్డారు. దీంతో తలకు, కుడి మోచేతికి గాయాలయ్యాయి. దీనిని కూడా లెక్కచేయకుండా ఆయన ఆదివారం ఆసాంతం లోకేశ్‌తోనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం నాటికి గాయాల తీవ్రత పెరగడంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాలను మాగంటి తేలిగ్గా తీసుకున్నా.. కుటుంబ సభ్యులు, నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 15 ఏళ్ల కిందట మాగంటికి తుంటి భాగంలో శస్త్ర చికిత్స జరిగిందని.. ఇపుడు అది కూడా తిరగబెట్టిందని వైద్యులు తెలిపారు. 48 గంటలపాటు మాగంటిని అబ్జర్వేషన్ నిమిత్తం ఉంచుతున్నట్టు తెలిపారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి సోదరుడికి గాయాలు జగదేవ్‌పూర్: మెదక్ జిల్లా గజ్వేల్ టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సోదరుడు, మండల టీడీపీ అధ్యక్షుడు వంటేరు శ్రీనివాస్‌రెడ్డికి సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్‌లో జరిగిన చంద్రబాబు సభలో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణమవుతుండగా మండలంలో రాంనగర్ వద్ద కారు బోల్తా పడింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో టీడీపీ నాయకుడు రమేశ్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. |