Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 20502
Registered: 08-2008
Posted From: 111.223.89.209

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, April 16, 2014 - 8:22 am:   

బెజవాడ టిడిపి ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్‌(పివిపి)కు ఇప్పించేలా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పట్టుబటి టిడిపి సీనియర్ నేత కేశినేని నాని ఈ టికెట్ దక్కించుకున్నారు. దాంవతో పివిపిని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్సభ స్థానం కేశినేని నానికి కేటాయించారని తెలిసిన వెంటనే అతనిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని పివిపి వర్గీయులు ప్రకటించారు. 1983లో టీడీపీ సభ్యత్వ పుస్తకాలు అమ్ముకుని సస్పెన్షన్‌కు గురైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాని అని వారు విమర్శించారు. అతను ఒకే పర్మిట్‌పై 4 బస్సులు తిప్పి ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడన్నారు. హెచ్‌-1 వీసాలు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి డబ్బు దోచుకున్న చరిత్ర కేశినేనిదని ధ్వజమెత్తారు. కేశినేని ఓటమికి అన్ని అవకాశాలను వాడుకుంటామని వారు చెప్పారు.

కేశినేని నానిని టార్గెట్‌గా చేసుకొని ఈ నెల 19న విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పొట్లూరి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో పీవీపీ భేటీ అయినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు చీల్చనని పవన్ కళ్యాణ్ విశాఖ సభలో చెప్పారు. ఈ పరిస్థితులలో పొట్లూరితో నామినేషన్‌ వేయిస్తే, ఓట్లు చీల్చనన్న మాట తప్పారని ప్రజలు అనుకుంటారని జనసేన ఆలోచిస్తోంది. మరి కొన్ని చోట్ల కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కొంత మందిని బరిలోకి దింపాలని జనసేన పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమ్మీద నామినేషన్ల పర్వం ముగిస్తే తప్ప బెజవాడ కథ క్లయిమాక్స్‌కు చేరే అవకాశం కన్పించటం లేదు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration