Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Pilla Bewarse
Username: Superman

Post Number: 968
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0

Posted on Friday, April 11, 2014 - 12:34 pm:   

హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేయనున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఆయన ఈ నెల 16 లేదా 17 వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇంతటితో బాలయ్య పోటీపై ఇప్పటివరకూ నెలకొన్న సందేహాలు తొలగిపోయినట్టయ్యింది.

హిందూపురం మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటవంటి ది. అందుకే బాలయ్య కూడా ఈ నియోజకవర్గంనుంచే పోటీ చేయాలని తొలినుంచీ ఆకాంక్షిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చునని కొన్నాళ్లుగా బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పెనమలూరు లేదా శ్రీకాకుళం నుంచి బాలకృష్ణ పోటీ చేయవచ్చునని పార్టీ వర్గాలు కొన్నాళ్లుగా పేర్కొంటున్నాయి.

అయితే నాయకుడు ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాలయ్య ఇటీవల పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. చివరికి బాలయ్య పోటీకి హిందూపురం సరైన నియోజకవర్గం అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. చంద్రబాబు నాయుడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడే బాలకృష్ణ కూడా హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయవచ్చునని తెలుస్తున్నది. ఈ విషయమై ఏ క్షణమైనా అధికార ప్రకటన వెలువడవచ్చు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration