Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20237 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 02, 2014 - 1:15 am: | |
బెంగళూరు : రీసెంట్ గా పార్టీ పెట్టి తెలుగు దేశం, బిజెపీ లకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నారు. చిక్కబళ్ళాపుర నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేన పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖనటుడు పవన్‌కళ్యాణ్ త్వరలోనే వస్తారని బీజేపీ అభ్యర్థి బచ్చేగౌడ వెల్లడించారు. ఈనెల 13న పవన్‌తో పాటు వెంకయ్యనాయుడు ప్రచారంలో పాల్గొంటారన్నారు. తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ... వివిధ అంశాల వారీగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు... ఇలా ఆయా వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రతీ వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. |