Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Esperanza
Mudiripoyina Bewarse
Username: Esperanza

Post Number: 24532
Registered: 08-2004
Posted From: 88.114.31.209

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, October 02, 2013 - 3:08 pm:   

ప్రియాతిప్రియమైన జగనన్నా,

ఉభయకుశలోపరి. మునుపురాసిన లేఖ ముట్టిందని తలుస్తాను. నీవు నాకు తపాలాఖర్చుల నిమిత్తం పంపిన మనీఆర్డర్ వైకాపా జనాలు మధ్యలోనే నొక్కేశారని తెలిసింది. వచ్చి వారమయింది, అన్న నరసింహావతారం ఎప్పుడెత్తుతాడో అని నీ అభిమానులు, సమైక్యవాదులు ఎదురుచూశారు. సోనియమ్మకు చుక్కలు చూపిస్తాడని, కాంగ్రెస్‌కి మంచినీళ్ళు తాగిస్తాడని, కెసిఆర్‌కి సీమాంధ్ర బిర్యానీ తినిపిస్తాడని ఆరాటంగా ఎదురుచూశారు. అదేందో సామెతలో చెప్పినట్టు- ఏనుగు ఇంత భారీగా ఉంటదిగదా అని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తే ఏనుగుకూడా తుస్సుమనే అన్నదన్నట్లుగా - ఇదేందన్నా ఇట్లా చేసినవ్ ? గొంతులో బేలతనం, చూపులో నైరాశ్యం, కదలికల్లో నిరుత్సాహం, పసలేని వాదనలు, పటిమ లోపించిన మాటలు, వాడి కోల్పోయిన విమర్శలు, కదిలించలేకపోయిన సెల్ఫ్-సింపతీ వాక్యాలు, మొత్తానికి సత్తువలేని నాయకుడిలా అగుపించావ్. నిలువెత్తు నిస్పృహ కనబడిందన్నా నువ్వు మాట్లాడినంతసేపూ. పరిస్థితులు అనుకూలంగా లేవని డీలాపడిపోయావా బాగా ? అవునూ, తల్లిపార్టీతో కుమ్మక్కు కాలేదని చెప్పడానికి అంత నీళ్ళు నమిలావేంటన్నా ? అన్నో మర్చిపోయా..నువ్వెంత మాజిక్ చేద్దామనుకున్నా అప్పుడప్పుడూ కొద్దిగా లాజిక్ కూడా వాడాలన్నా. సరే, సమైక్య శంఖారావం పూరిస్తున్నావ్ బాగానే ఉంది. కానీ ఆ వేదిక మీదనుండయినా సోనియమ్మని, కెసిఆర్‌ని నిలదీస్తావా లేక మళ్ళీ ఆమ్యామ్యా..అప్పుం..అప్పుం..టైప నా ? నీకంటూ ఉన్న రకరకాల అభిమానుల్లో ఒక వెరైటీ అభిమానులున్నారన్నో...పులిలాం ి మీ నాయనే సోనియాకి లొంగిపోయిండు కానీ పులిబిడ్డలాంటి నువ్వు సోనియామీద తొడగొట్టినావని పొంగిపోయినోళ్ళున్నారు. పాపం మింగలేక కక్కలేక చస్తన్నారు. కనీసం వాళ్ళకోసమయినా నువ్వు సోనియమ్మని, కాంగ్రెస్‌ని కబడ్డీ ఆడుకోగలవని ఆశిస్తున్నాను. మనీఆర్డర్ సంగతి చూడగలవాడవు.

నీ శ్రేయోభిలాషి
NFDB


source: FB
space for lease

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration