Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 86060 Registered: 03-2004 Posted From: 130.138.227.53
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 25, 2013 - 6:57 am: | |
మెగా అభిమానులకు శుభవార్త. తొలిసారిగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో మూవీ థియేటర్లతో పాటు, డైరెక్టుగా ఆన్ లైన్లో కూడా విడుదలకు సిద్దం అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు ‘అలియాస్ జానకి'. చిరంజీవి మేనమామ కొడుకు అయిన వెంకట్ రాహుల్ ‘అలియాస్ జానకి' చిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. థియేటర్లతో పాటు ఆన్లైన్లో విడుదల చేయడం ద్వారా మంచి కలెక్షన్స్ వస్తాయని ఈ చిత్ర నిర్మాత నీలిమ తిరుమలశెట్టి భావిస్తున్నారు. మరో విశేషం ఏమింటే ఆన్లైన్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే. zingreel అనే మూవీ పోర్టల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ చిత్రాన్ని చూసేందుకు ఒక షోకు $4.99 డాలర్లుగా నిర్ణయించారు. విదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పైరసీకి ఆస్కారం లేకుండా ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 26న ఈచిత్రం విడుదలువుతోంది. తాను 12 సంవత్సరాలు అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉన్నానని, అక్కడి తెలుగు ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు పడే ఇబ్బందులు తనకు తెలుసు అంటోంది నీలిమ. అక్కడ తెలుగు సినిమాలు చాలా తక్కువ థియేటర్లలో ప్రదర్శితం అవుతాయి. వాటిని చూడాలంటే మైళ్ల కొద్దీ ప్రయాణం చేయాలి. ఆన్లైన్లో సినిమా విడుదల చేయడం వల్ల వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చెబుతోంది. |