Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23548 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 27, 2013 - 10:54 am: | |
వాస్తవం బయటకు రావాలంటే.. చెప్పే మాటలకు.. చేతలకు మధ్య వ్యత్యాసం తెలియాలంటే అంకెలకు మించినవి ఏముంటాయి? ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని ఎంతమాత్రం పట్టించుకోకుండా... అనాధలుగా వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పడు విమానాలు సిద్దంగా చేశామని చెబుతూ.. తెలుగుదేశం బోర్డింగ్ పాసులు ఇచ్చిన వారిని సైతం తమ విమానాల్లో వెళ్లాలని బతిమిలాడటం చూసినప్పుడు.. కాంగ్రెస్ నేతల బరితెగింపు.. రాజకీయం తప్పించి మరో ధ్యాస లేని వైఖరి అసహ్యం పుట్టిస్తుంది. ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చి నేటికి పదమూడు రోజులు అవుతున్నా.. రెండు రోజుల కిందటే కాంగ్రెస్ నేతలు నిద్ర లేచారు. పంచెలు సరి చేసుకొని మరీ బరిలో దూకారు. అంతకుముందు తిండి కోసం హాహాకారాలు చేసినా పట్టించుకోని కిరణ్ సర్కారు ఇప్పుడు మాత్రం విమానాలు ఏర్పాటు చేశామని బడాయి చెబుతోంది. అయితే.. దీనంతటికి కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే బాదితులకు అందుతున్నసాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం తెలుసుకొని.. దాన్ని సరిదిద్దేందుకు వైద్యుల బృందాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్లారు. అక్కడ బాధితులను కలుసుకొని.. వారి పరిస్థితిని చూసి చలించిపోయి ఒక్కొక్కరికి పది వేల రూపాయిల సాయాన్ని అందించారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు అందించిన సాయం కేవలం 2వేల రూపాయిలు మాత్రమే బాధితులు తమ తమ ఊర్లకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. తర్వాత రోజు.. టిక్కెట్టు కొనుక్కోని వస్తే రిజర్వేషన్ చేసి ఇస్తామని చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు టిక్కెట్లు ఎలా కొనుక్కొని వస్తారో తెలీని పరిస్థితి. బట్టలు లేని వారికి కొత్త బట్టలు ఇవ్వలేదు. ఎనిమిది బాత్రూంలను రెండు వందల మంది కలిపి వాడుకోవాలని వదిలేశారు. బాధితులకు ఏపీ భవన్ లో గదులు ఉన్నా.. నేల పైనే పడుకోబెట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లాక పది వేల రూపాయిలు ఇవ్వటం.. కొత్త బట్టలు అందించటం.. తిరిగి వెళ్లటానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేసి.. విమానాశ్రయం నుంచి నేరుగా వారివారి స్వస్థలాలు చేరుకునేందుకు వీలుగా.. బస్సులను ఏర్పాటు చేశారు. ఇదీ.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బాధితులకు అందించిన సౌకర్యాలు. ఎవరెంత చేశారో మీరే నిర్ణయించుకోండి. space for lease
|