Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 22868 Registered: 08-2004 Posted From: 91.152.102.90
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 12, 2013 - 2:40 pm: | |
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 12: గాలి జనార్దన్ రెడ్డికి చెందిన రూ. 884 కోట్లను జప్తు చేయడాన్ని ఇ.డి. న్యాయప్రాధికారిక సంస్థ గట్టిగా సమర్థించింది. ఇదంతా అక్రమ సొమ్ము అని నిర్ధారించడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు నిర్ధారించింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన గనుల కంపెనీ అన్ని విధాలా చట్టాన్ని ఉల్లంఘించిందని కోర్టు స్పష్టం చేసింది. అసలు గనుల లీజులనే అక్రమంగా పొందారని, ఉపగ్రహాలు సైతం అక్రమ మైనింగ్‌ను ధ్రువపరుస్తున్నాయి కాబట్టి ఈ ఆస్తులను వెంటనే వెంటనే స్వాధీనపరుచుకోవాలని కోర్టు ఆదేశించింది. గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేయడానికి 23 క ంపెనీలను పక్కన పెట్టార ని, అసలు ఇందుకు దరఖాస్తులను పొందిన విధానాన్ని, ఆ దరఖాస్తును సమర్పించిన విధానాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది. రవాణా పర్మిట్లు లేకుండానే రహదారులను ఇష్టం వచ్చినట్టు నిర్మించారని, గనుల లీజులనే అక్రమంగా పొందారనడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. space for lease
|