Sensation
Kurra Bewarse Username: Sensation
Post Number: 4099 Registered: 12-2004 Posted From: 24.98.240.35
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, March 20, 2013 - 3:42 pm: | |
నేను హైదరాబాద్ 1986 లో వచ్చా ,అప్పటినుండి సమాజములో ఉన్నత రంగాలలోని కొద్దిగా ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము,వారి సాహచర్యము బంధుత్వం ,స్నేహము తో చాలా మందిని దగ్గరగా చూడటం జరిగింది. అప్పట్లో అంటే 1990 ప్రారంభ దశకములో నుండి నాకు కొన్ని చాలా కీలక విషయాలు,కీలక వ్యక్తులు తెలిసే అవకాశం ఉండటం మరియు పరిచయము చేత వేరే కొంతమంది వ్యక్తుల గురించికూడా తెలుసు.అప్పట్లో ఒకవ్యక్తి రాజకీయ నాయకులకి,అధికారులకి,కాంట్రాక ్టర్ల కి సినీతారలతో "మందు,విందు,పొందు" ఏర్పాటుచేస్తూ ,ధిల్లీ,మద్రాస్,బొంబాయ్,హైదరా ాదులలో గెస్ట్ హౌస్ లు నడుపుతూ ఉండేవాడు.కొన్నిసార్లు పోలీసులకి కూడా పట్టుబడ్డాడు.అప్పట్లో అతని గెస్ట్ హౌసులకి అధికార,ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్లి సేదతీరేవారు అని వినికిడి.నాకుతెలిసి 2002 వరకు జూబిలీహిల్స్ ,బంజారాహిల్స్ లలో చిన్న చిన్న ప్లాటుల వ్యాపారం (రియల్ ఎస్టేట్) చేసేవాడు.2004 కి వచ్చేసరికి అతని ఆస్తి ఒక 50 కోట్లు వరకు అని విన్నాను.ఇది ఇలా ఉండగా ,5 సంవత్సరాల క్రితం సడన్ గా ఒకరోజు అతను ఒక న్యూస్ ప్రారంభిస్తుంటే ఆ చానెల్ లో వాటాదారుడు అని తెలిసి నేను సిగ్గుపడ్డా ......ఇప్పుడు కొత్తగా తెలిసిందేమిటంటే ఇటువంటి వాళ్ళే ఇప్పుడు సొంతంగానే చానెళ్ళు ప్రారంభిస్తున్నారని అనుకుంటున్నారు. |