Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Cinemacinema
Pilla Bewarse
Username: Cinemacinema

Post Number: 24
Registered: 02-2012

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, June 26, 2012 - 4:54 am:   

సిబిఐ జెడి ఈవ్‌టీజర్, చంద్రబాల దోపిడీ దొంగ!?

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ సంపాదించేందుకు ఆయనను ఓ ఈవ్ టీజర్‌గా, ఆయన స్నేహితురాలు వాసిరెడ్డి చంద్రబాలను దోపిడీ దొంగల ముఠా వ్యక్తిగా చిత్రీకరించారట. సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీ నారాయణ, ఐబిఎం ఉద్యోగి, లీడ్ ఇండియా స్వచ్చంధ సంస్థ కార్యకర్తగా చంద్రబాల.. ఇలా ఉన్నత స్థానాలలో ఉన్న వాకిని పోకిరీ, దొంగగా చిత్రీకరించి కాల్ లిస్టు సంపాదించారని ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కథనం ప్రకారం... 'మహా కుట్ర' వెనుక దాగిన మరిన్ని కుతంత్రాలు బయటపడుతున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, 'లీడ్ ఇండియా' ప్రతినిధి చంద్రబాల కాల్ లిస్ట్‌లు సేకరించేందుకు వారిని ఈవ్ టీజర్‌గా, దోపిడీ ముఠా సభ్యురాలిగా మార్చేసినట్లు వెల్లడైంది. 'కాలాంతకుల' గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఈ వివరాలు బయటపడుతున్నాయి. తొక్కిన అడ్డదారులు, చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పారిశ్రామిక వేత్త జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌తో డీల్ కుదుర్చుకున్నారు. సదరు డిటెక్టివ్ తనకు బాగా పరిచయమున్న నాందేడ్ ఎస్పీని ఆశ్రయించారు. "ఓ గొప్పింటి మహిళకు ఫోన్ వేధింపులు వస్తున్నాయి. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కొంచెం కాల్ లిస్టు ఇచ్చి పుణ్యం కట్టుకోండి'' అంటూ జెడి లక్ష్మీ నారాయణ నెంబర్ ఇచ్చారు.

నాందేడ్ ఎస్పీ 'ఐతే ఓకే' అనేశారు. 'ఈవ్ టీజింగ్ కేసులో సమాచారం కావాల్సి ఉంది' అంటూ జెడి నెంబర్‌ను సర్వీస్ ప్రొవైడర్‌కు పంపించారు. కాల్ లిస్టు అందిన వెంటనే సదరు డిటెక్టివ్ హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్తకు అందించాడు. ఆ పారిశ్రామికవేత్త కాల్‌లిస్టును విశ్లేషిస్తూ... ఒక నెంబర్‌కు జెడి నుంచి ఎక్కువగా ఫోన్లు వెళ్లడం, రావడం జరిగినట్లు గుర్తించారు. 'నా వద్ద కాల్ లిస్ట్ ఉంది' అంటూ అందులోని వివరాలను ఆ పారిశ్రామిక వేత్త గొప్పగా చెప్పుకొన్నారు. జగన్ వర్గం ఆయన నుంచే జెడి కాల్ లిస్ట్‌ను సంపాదించింది. ఆ తర్వాత కథ మరో మలుపు తిరిగింది.

తన కాల్‌లిస్టు బయటకు వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన సిబిఐ జెడి కొత్త ఫోన్ వాడసాగారు. ఆ నెంబర్‌ను రహస్యంగా ఉంచారు. పాత కాల్ లిస్ట్‌లోని చంద్రబాల నెంబర్ ఎక్కువగా కనిపించడంతో... దాని ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు జగన్ వర్గం ప్రయత్నించింది. ఇందులో భాగంగా జగన్ మీడియాకు చెందిన ఒక విలేకరి రంగంలోకి దిగాడు. తనకు బాగా తెలిసిన నాచారం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావును ఆశ్రయించాడు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతున్న సమయంలో... ఆయన మీడియా నుంచి కాల్‌లిస్ట్ కోసం 'అనధికార అభ్యర్థన' వచ్చినప్పటికీ ఇన్‌స్పెక్టర్‌కు ఏమాత్రం అనుమానం రాలేదు.

కాల్‌లిస్టు ఇచ్చేస్తానంటూ అభయమిచ్చారు. అదే రోజున ఒక హైవే దోపిడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో, జగన్ మీడియా విలేకరి ఇచ్చిన చంద్రబాల నెంబర్‌ను కూడా దొంగల ముఠా సభ్యుల ఫోన్ నెంబర్లలో కలిపారు. వాటి వివరాలు కావాలంటూ డిసిపి అనుమతి కోరి... సర్వీస్ ప్రొవైడర్ నుంచి జాబితా సంపాదించారు. చంద్రబాల కాల్‌లిస్టు ఈ-మెయిల్ ద్వారా నాచారం స్టేషన్ మెయిల్ ఐడీకి సర్వీస్ ప్రొవైడర్ పంపించారు. ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు అదే మెయిల్‌ను, అదే మెయిల్ ఐడీ నుంచి జగన్ మీడియా విలేకరికి స్టేషన్ రైటర్ ఫార్వర్డ్ చేశారు.

ఆ తర్వాత చంద్రబాల్ కాల్ లిస్ట్ ఆధారంగా జగన్ పార్టీ నేతలు, ఆయన మీడియా చేసిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే. జగన్ బృందం 'కుట్ర'కు తాను పావులా ఉపయోగపడిన సంగతి తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్... మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. నాచారం పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, సిబిఐ జెడి కానీ, చంద్రబాల కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయకపోవడంతో అధికారికంగా ఎవరిమీదా చర్యలు ప్రారంభించలేదు. కానీ... మొత్తం వివరాలను ఇప్పటికే తెలుసుకున్నారు. దీనిపై ఫిర్యాదు వస్తే కేసును సిఐడి విచారణకు అప్పగించవచ్చునని తెలుస్తోంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration