Gudivada04
Bewarse Legend Username: Gudivada04
Post Number: 42087 Registered: 09-2004 Posted From: 161.141.1.1
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 23, 2019 - 6:58 pm: | |
http://edu.andhrajyothy.com/EduNewsArticle.aspx?SID=774095 inter board lo dongalu paddaru టెండర్... మాయాజాలం ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్‌కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి, 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నటిక్ అనే సాఫ్ట్వేర్ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండరు కట్టబెట్టారు. ఈ టెండరు వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా.. నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండరు దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి మరీ గ్లోబరీనాకు టెండరు కట్టబెట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. వీటికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటి వరకు ఫలితాల ప్రాసెసింగ్ నిర్వహించ లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. కానీ, గ్లోబరీనా ఇప్పటి వరకు గరిష్ఠంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలనే ప్రాసెసింగ్ చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి రాజు కూడా అంగీకరించారు. అయితే, 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థను కాదని.. అంతగా అనుభవం లేని గ్లోబరీనాకు నిబంధనలు సడలించి మరీ టెండరు అప్పగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. |