![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10603 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 22, 2018 - 9:49 am: | |
inko success story... అవినీతి మహమ్మారి సామాన్యులను తీవ్రంగా వేధిస్తోంది. అన్ని రంగాల్లోనూ వేళ్ళూనుకున్న ఈ చీడపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అధ్యయనం నిర్వహించి, నివేదికను రూపొందించింది. అవినీతిలో భారతదేశం చైనాను అధిగమించిందని వెల్లడించింది. అయితే పాకిస్థాన్ కన్నా కాస్త మెరుగ్గా ఉందని తెలిపింది. అవినీతి గోచరత్వం (కరప్షన్ పర్సెప్షన్) సూచీ, 2017 నివేదికను ప్రభుత్వ రంగంలో అవినీతిని అంచనా వేశారు. దీనికోసం సున్నా నుంచి 100 వరకు స్కేలును ఉపయోగించారు. సున్నా అంటే అత్యంత ఎక్కువ అవినీతి అని, 100 అంటే చాలా పారదర్శకతగల, అవినీతి లేనిదని అర్థం. ఈ సూచీ ప్రకారం భారతదేశం స్కోరు 40కాగా, ర్యాంకు 81. పాకిస్థాన్ స్కోరు 32 కాగా, ర్యాంకు 117. బంగ్లాదేశ్‌కు వచ్చిన స్కోరు 28 కాగా, 143వ స్థానంలో నిలిచింది. మయన్మార్‌కు లభించిన స్కోరు 30, పొందిన ర్యాంకు 130. శ్రీలంకకు 91వ ర్యాంకు (38 స్కోరు) లభించింది. మన పొరుగు దేశం భూటాన్‌లో అవినీతి మన దేశంలో కన్నా తక్కువ ఉంది. భూటాన్‌కు వచ్చిన స్కోరు 67 కాగా, ఈ సూచీలో 67వ స్థానంలో నిలిచింది. చైనాలోకూడా అవినీతి మన దేశంలో కన్నా తక్కువగానే ఉందని ఈ నివేదిక వెల్లడించింది. చైనాకు వచ్చిన స్కోరు 41 కాగా, ర్యాంకు 77. ప్రభుత్వ రంగంలో అవినీతిపై వ్యాపారులు, నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో అగ్ర స్థానాన్ని న్యూజిలాండ్, డెన్మార్క్ ఆక్రమించాయి. |