Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99335 Registered: 03-2004 Posted From: 185.46.212.70
Rating: N/A Votes: 0 | Posted on Monday, February 08, 2016 - 4:23 am: | |
చెన్నై : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యమాలు వచ్చినప్పుడు చంద్రబాబును కాపాడేందుకే పవన్ తెరపైకి వస్తారని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కుల రాజకీయాలను, ఉద్యమాలను తీసుకొచ్చింది చంద్రబాబే అని నారాయణ మండిపడ్డారు. దమ్ముంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీల్లో చేర్చగలరా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. |