![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99039 Registered: 03-2004 Posted From: 194.171.252.110
Rating: N/A Votes: 0 | Posted on Monday, December 28, 2015 - 8:32 am: | |
http://www.sakshi.com/news/international/man-tries-to-save-a-woman-falling-from- the-11th-floor-of-a-building-with-his-bare-hands-301116?pfrom=home-top-story ఓ యువతి పదకొండు అంతస్తుల భవనంపై నుంచి దూకుతుండగా.. రిటైర్డ్ సైనికుడు ఆమెను కాపాడాలని ప్రయత్నించాడు. దూకుతున్న మహిళను పట్టుకోవడానికి రెండు చేతులు చాచాడు. ఆమె అంత ఎత్తు నుంచి దభేలున ఆయనపై పడింది. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసినవారిలో వణుకు పుట్టిస్తోంది. సెంట్రల్ చైనా హుబీ ఫ్రావిన్స్లోని ఎన్షి నగరంలో ఈ నెల 23న ఈ ఘటన జరిగింది. నివాస ప్రాంతంలోని ఓ 11 అంతస్తుల భవనం నుంచి మహిళ దూకుతుండటంతో కొంతమంది అక్కడ మూగారు. ఇంతలో ఆమె దూకుతుండటం చూసిన విశ్రాంత సైనికుడైన ఫెంగ్ నింగ్ పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారు. మహిళను కాపాడాలని రెండు చేతులు చాచి నిలబడ్డారు. దురదృష్టశాత్తు ఆమె అతనిపై పడటంతో ఇద్దరు పడిపోయారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా భవనంపై నుంచి దూకిన మహిళ ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. విశ్రాంత సైనికుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా సెంట్రల్ టెలివిజన్ న్యూస్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. |