Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99011
Registered: 03-2004
Posted From: 194.171.252.110

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, December 22, 2015 - 4:59 am:   

వీడి తెలివి తగలడ

మాయల్ని, మంత్రాలను, మంత్రగాళ్లను నమ్మి జీవితాలను బుగ్గిపాలు చేసుకున్న అమాయకులు, అవకాశవాదుల కథనాలు... ఈ శీర్షికలో...

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. అక్కడికి దగ్గర్లో.. చెరుకువాడ గ్రామం. ఆ ఊళ్లో ఓ యువకుడికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయింది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టడమే. ఇంట్లో అందరి ముఖాల్లో ఆనందం. పిల్ల చుక్కలా ఉందని. చక్కటి సంబంధం కుదిరిందని. అంతా పెళ్లి పనులకు ప్రిపేర్ అవుతున్నారు. ఏ చిన్నారైనా మంచి డ్రెస్‌తో కనిపిస్తే తన మనవరాలికి కూడా అలాంటిదే గౌన్ కొనాలని, మంచి చీర కనిపిస్తే కొడుకు పెళ్లికి తాను ఆ రంగు చీరనే కొనుక్కోవాలని ఆ ఇంటి ఇల్లాలు ఊహలు అల్లుకుంటోంది. ‘సరిగంచు పంచె, పై కండువా కొనుక్కోవయ్యా’ అని భర్తను కూడా తొందరపెడుతోంది. ఒక్కమాటలో... కొడుకు పెళ్లి సంబరం అంతా ఆమె కళ్లలో కనిపిస్తోంది. సంతోషం ఆమె మాటల్లో ధ్వనిస్తోంది. ఇలా ఉండగా ఓ రోజు...

పెళ్లికొడుకు ఇంట్లో... లోపలి గదిలో మంటలు రేగాయి! దుస్తులు కాలిపోతున్నాయి. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలవాళ్లు కంగారుగా పరుగెత్తుకెళ్లి మంటలు ఆర్పేశారు. ఎందుకిలా జరిగింది, మంటలెలా వచ్చాయి? ఏమీ అర్థం కాలేదు! ఇదేమైనా అపశకునమా? అమంగళ సంకేతమా? ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో రకంగా సాగుతున్నాయి. ‘పెళ్లి జరగబోయే ఇంట అనకూడని మాటలు అనడం ఎందుకులే’ అని ఎవరూ నోరు మెదపలేదు. ఇదంతా చూస్తున్న పెళ్లి కొడుకు మౌనంగా ఉండిపోయాడు. ఇరుగింటి వాళ్లు, పొరుగింటి వాళ్లు వచ్చి ఈ ఇంట్లోవాళ్లని పలకరించి ధైర్యం చెప్పిపోయారు.

ఈ సంఘటన జరిగి మూడురోజులైంది.
అంతా సర్దుకున్నారు. మంటల విషయం మర్చిపోయారు. పెళ్లి మంటపాల గురించి మాట్లాడుకుంటున్నారు. నవ్వుతూ, తుళ్లుతూ సంతోషంగా ఉన్నారు. అయితే ఆ నవ్వింతలు, తుళ్లింతలు ఎక్కువసేపు లేదు. అకస్మాత్తుగా గదిలో దుస్తులు అంటుకున్నాయి! అది వేరే గది. ముందు మంటలు అంటుకున్న గది కాదు. చూసిన వాళ్లంతా భయంతో పరుగు పరుగున వెళ్లి మంటల్ని ఆర్పేశారు. మంటలైతే ఆరాయి కానీ ఎవరికీ నోట్లోంచి మాటలు రావడం లేదు. ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. ప్రతి ఒక్కరిలో ఏవేవో ఆలోచనలు. ఏం జరగబోతోంది? పిల్లనిచ్చేవాళ్లు వెనకడుగు వేస్తారా?

రెండు రోజుల తర్వాత మళ్లీ అదే ఘటన!!
విషయం ఊళ్లోకి పొక్కింది. అంతటా అదే చర్చ, గుసగుసలు. వరుడి ఇంట్లో పెళ్లికళ కనిపించడం లేదు. పైగా ప్రేతకళ కనిపిస్తోంది. ఏ దెయ్యమో, భూతమో ఇంటిని ఆవహించి బట్టల్ని కాల్చేస్తోందా? రేపు పెళ్లిబట్టల్ని కూడా కాల్చేస్తుందా? పెళ్లి పెటాకులు అవుతుందా? ఇక మౌనంగా ఉంటే లాభం లేదు. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. మనసులోని మాటలను బయట పెడుతున్నారు. ‘ఇంతకాలం లక్షణంగా ఉన్న ఇంట్లో ఈ దుశ్శకునం ఏమిటి? ఇంటికి ఏదో అరిష్టం దాపురించింది’. ‘అవునవును. పెళ్లి కుదుర్చుకున్నప్పటి నుంచే ఈ అపశకునాలన్నీ!’. ‘నిశ్చయ తాంబూలాలు అందుకున్న తర్వాతనే ఇంటికి మనశ్శాంతి కరువైంది’.

‘ఈ అరిష్టం ఆ ఒక్క ఇంటికే పరిమితమా? లేక ఊరంతటినీ హరిస్తుందా?’
ఎవరో బాంబు పేల్చారు. అనుమానపు బాంబు! అది బద్దలైంది. ఆ ఇంటివాళ్లతో పాటు ఊళ్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఊరు మొత్తాన్నీ భయం ఆవరించింది. ఎవరైనా చేతబడి చేశారా? ఏ దుష్టశక్తై నిద్ర లేచిందా? లేకుంటే ఈ మంటలు ఏమిటి? ఒక్క అగ్గిపుల్ల కనిపించకుండా, కరెంటు తీగ తగులుకోకుండా, కర్పూరం బిళ్ల అంటుకోకుండా ఎలా కాలిపోయాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. విషయం పేపర్లకు చేరింది. విలేఖరులు జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఈ మిస్టరీని ఛేదించకపోతే ఊరు అగ్గిలా భగ్గుమనేట్లుందని తొందర పెట్టారు. తర్వాతేం జరిగింది? మంటలు ఎలా రేగాయో తెలిసింది! మంటలు ఎవరు రేపారో తెలిసింది.

పెళ్లి కొడుకే దోషి !
అవును. స్వయానా పెళ్లి కొడుకే ఇంట్లో దుస్తులకు నిప్పంటిస్తూ ఏమీ తెలియనట్లు నటించాడు. ‘ఇదేం పోయే కాలంరా నీకు’ అని నిలదీసింది తల్లి. ఆ పెళ్లి కొడుక్కి నిశ్చితార్థం జరిగిన తర్వాత మరో సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి మొదటి అమ్మాయికంటే అందంగా ఉంది. తల్లిదండ్రులేమో ‘మా అబ్బాయికి పెళ్లి కుదిరింది’ అని చెప్పి పంపేశారు. మొదటి అమ్మాయిని వదిలించుకుని, రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వరుడు. ఆ మాట ఇంట్లో చెబితే ఒప్పుకోరు. అమ్మాయి తరఫు వాళ్లకు తెలిస్తే పంచాయితీ పెట్టి, జరిమానా వేసి, పరువు తీసి మరీ పెళ్లి చేస్తారు. ఇవేవీ జరక్కుండా మొదటి అమ్మాయిని పక్కకు తప్పించాలనుకున్నాడు పెళ్లి కొడుకు. ఆ అమ్మాయి జాతకం మంచిది కాదని, ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయని పెద్దవాళ్ల చేతే అనిపించాలి అనుకున్నాడు. అందుకు స్నేహితుడితో కలిసి, ఓ మంత్రగాడి సలహాతో పథకం వేశాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా దుస్తుల మధ్య భాస్వరం పెట్టేవాడు. ఆ ఇంట్లో
మండింది భాస్వరం మంటలే!

చివరికి అతగాడి పెళ్లి ఎవరితో జరిగిందనుకుంటున్నారు? నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి వాళ్లు మీ సంబంధం మాకొద్దన్నారు. మరి ‘నా కోసం ఇంత ప్లాన్ వేశాడు కదా పాపం’ అని రెండో అమ్మాయైనా చేసుకుందా- అంటే అదీ జరగలేదు. ఓ గొప్ప ప్లాన్ అనుకుని ఆడిన నాటకంలో మన పెళ్లి కొడుకు చాలాకాలం పాటు పెళ్లికాని పెళ్లికొడుకుగానే మిగిలిపోయాడు.
- వాకా మంజులారెడ్డి
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

మండింది పచ్చభాస్వరమే!
పచ్చభాస్వరాన్ని నీటిలో నిల్వ ఉంచుతారు. నీటిలో నుంచి తీసిన తర్వాత తడి ఆరగానే గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి అది మండుతుంది. మోసాలు చేసేవాళ్లు పచ్చ భాస్వరం ముక్కను తడి దూదిలో చుట్టి దుస్తుల మధ్య పెడతారు. దూదిలో తడి ఆరగానే భాస్వరం మండుతుంది. అలాగే భాస్వరాన్ని పచ్చిపేడలో పెట్టి గడ్డివాముల మీద, తాటాకు కప్పుల మీద వేసి వెళ్లిపోతారు. రెండు- మూడు రోజులకు పేడ ఎండిన తర్వాత మంటవస్తుంది. అందరం చూస్తుండగానే గాల్లోంచి మంటలు పుట్టాయని... ఇదంతా మాయ, దయ్యం పని భయపడుతుంటారు జనం. ఈ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటారు అవకాశవాదులు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration