Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 98982
Registered: 03-2004
Posted From: 194.171.252.110

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, December 16, 2015 - 3:19 am:   

నా వయసు 37 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడితే ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి.
- జె.వి.ఆర్., హైదరాబాద్
సాధారణంగా మీరు యుక్తవయసులోనే ఉన్నప్పటికీ మీ వయసు వారిలో అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం కూడా ఏమీ కనిపించకపోవచ్చు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి ఉపయోగింమే సాధారణ మందు కాదు. ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినప్పటికీ, కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ అవకాశాలు ఉంటాయి. అంతేకాదు... సెక్స్‌ను ఉద్దీపన కలిగించే మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధంగా నేరం. కొన్ని కాంబినేషన్లలో వయాగ్రా వాడకూడదు. అది స్పెషలిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. ఈ మందులకు వారి ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీ ఆరోగ్యం కోసమే యూరాలజిస్ట్‌ను / మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి ఆ మందు వాడటం మీకే శ్రేయస్కరం.

నాకు పెళ్లయి మూడు నెలలు అయ్యింది. అంగస్తంభన బాగానే జరుగుతోంది. కానీ నా భార్య యోనిలోకి పురుషాంగం ప్రవేశించే సమయంలో, దాని చివరన ఉన్న చర్మం వెనక్కు పోలేక విపరీతమైన నొప్పి వచ్చి వెంటనే అంగస్తంభన తగ్గిపోతోంది. ఈ సమస్య వల్ల గత మూడు నెలల్లో ఒక్కసారి కూడా అంగప్రవేశం చేయలేకపోయాను. మామూలుగా చర్మం వెనక్కు వెళ్లినా అంగస్తంభన జరిగినా కింది భాగంలో ఏదో పట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
- డి.కె.వి.ఆర్., అమలాపురం
అంగం మీద ఉన్న చర్మం ఫ్రెన్యులమ్ అనే పొర ద్వారా అంగం కింది భాగంలో అతుక్కుని ఉంటుంది. ఇది కొందరిలో బిగుతుగా ఉంటుంది. అందువల్ల అంగస్తంభన జరిగినప్పుడు అది వెనక్కు రాదు. ఒక్కోసారి బలవంతంగా సెక్స్ చేసినప్పుడు ఫ్రెన్యులమ్ చిట్లిపోయి తీవ్రంగా రక్తస్రావం కూడా జరగవచ్చు. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అనే కేవలం 15 నిమిషాల ప్రొసీజర్‌తో నయం చేయవచ్చు. దీనికి మత్తుమందు కూడా అవసరం లేదు. లోకల్ అనస్థీషియా ఇస్తే చాలు. ఒక గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు. (అంటే ఇది డే కేర్ సర్జరీ అన్నమాట). అందువల్ల మీరు నిశ్చితంగా ఈ ఫ్రెన్యులోప్లాస్టీ చేయించుకుని నిరాటంకంగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి.

నా వయసు 38 ఏళ్లు. హైడ్రోసిల్ ఉన్నట్లు తెలిస్తే గతంలో రెండువైపులా ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ ఏడాదిలోనే మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. ఆరేళ్ల తర్వాత మరోమారు ఆపరేషన్ చేయించుకున్నాను. ఎలాంటి మార్పూ రాలేదు. అదే డాక్టర్‌ను కలిస్తే ఫైలేరియా అని మందులు రాశారు. మరో ఇంకోమారు సర్జరీ చేయించుకోవాలంటే భయంగా ఉంది. ఆపరేషన్ లేకుండా దీన్ని తగ్గిస్తామని అడ్వర్టయిజ్‌మెంట్స్ చూస్తున్నాను. ఇది ఎంతవరకు సాధ్యం? దయచేసి రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. నాకు మంచి సలహా ఇవ్వండి.
- జీ.ఎస్.ఆర్., రావికాంపాడు
హైడ్రోసిల్ అంటే వృషణం చుట్టూ నీరు చేరడం. ఈ నీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా వాపు కనిపిస్తుంది. దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇందులో అక్కడి నీరు మొత్తం తీసివేసి, వృషణాల చుట్టూ ఉండే పొరను తొలగించడం చేస్తారు. ఈ సర్జరీ తర్వాత సాధారణంగా మళ్లీ అది రాకూడదు. మీ విషయంలో రెండు సార్లు ఆపరేషన్ చేశారంటే మొదట అది హైడ్రోసీలా కాదా అని సందేహం వస్తోంది. ఇక ఫైలేరియాసిస్‌లో చర్మం బాగా మందం కావడం వల్ల వాపులా అనిపించినా - వృషణానికి గాని, వృషణం చుట్టూ ఉండే పొరకు గాని దాంతో సంబంధం ఉండకపోవచ్చు. దీన్ని ఫైలేరియల్ స్క్రోటమ్ అంటారు గాని హైడ్రోసిల్ అనరు. ఈ వాపు చాలా పెద్దదిగా ఉండి ఇబ్బంది పెడుతుంటే, మందంగా మారిన చర్మాన్ని తీసేసి, లోపల ఉండే వృషణాన్ని తొడ భాగంలో అమర్చడం ఒక ప్రక్రియ. మీ సమస్యను విశ్లేషించి, తగిన పరిష్కారం ఇవ్వడానికి మీకు దగ్గర్లోని యూరో సర్జన్‌ను సంప్రదించండి.

మా అబ్బాయికి పదేళ్లు ఏళ్లు. పుట్టుకతోనే ఒక వృషణం సంచిలోకి జారకుండా కడుపులోనే ఉండిపోయింది. మా బాబు విషయంలో ఏమి చేయాలో తగిన సూచన ఇవ్వగలరు.
- డీఎమ్‌ఆర్., గుంటూరు
పుట్టుకతోనే వృషణాలు సంచిలోకి రాకపోవడాన్ని అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇలా జారని వృషణాలు సాధారణంగా గజ్జెల్లో ఉండిపోతాయి. సాధారణంగా బాబు పుట్టినప్పుడు డాక్టర్లు వృషణాల పొజిషన్‌ను గమనిస్తుంటారు. ఒకవేళ ఆ సమయంలో వృషణాలు చేతిస్పర్షకు తగలకపోతే ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు అవి వృషణాల సంచిలోకి జారడం కోసం వేచిచూడవచ్చు. అప్పటికీ వాటంతట అవే రాకపోతే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఆపరేషన్ చేసి వాటిని కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్సనే ఆర్కిడోపెక్సీ అంటారు. ఒకవేళ రెండేళ్ల తర్వాత కూడా ఆపరేషన్ చేయించకపోతే లోపల ఉండిపోయిన టెస్టిస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ బాబు విషయంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించి ఇప్పటికైనా ఆర్కిడోపెక్సీ లేదా ఆర్కిడెక్టమీ సర్జరీ చేయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం యూరాలజిస్ట్‌ను వీలైనంత త్వరగా సంప్రదించండి.

నా వయస్సు 28 ఏళ్లు. నాకు రెండేళ్ల క్రితం టీబీ పాజిటివ్ వచ్చింది. ఆర్నెల్లు డాట్స్ చికిత్స తీసుకున్నాను. పూర్తిగా తగ్గిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో నా సెక్స్ జీవితానికి ఏమైనా సమస్యలు వస్తాయా? నేను పెళ్లిచేసుకోవచ్చా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే దీనిల్ల నా భార్యకు, పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తాయా?
- ఎస్.ఎస్.ఆర్.ఎమ్., వరంగల్
టీబీ వచ్చిన వారు యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్ పూర్తి కోర్సు తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే మందులు ఆపకుండా డాక్టర్లు సూచించిన విధంగా వ్యాధి నయమయ్యేవరకు తీసుకోవాలి. అలా ఒకసారి పూర్తిగా నయం అయితే ఆ వ్యాధి వల్ల మీ సెక్స్ సామర్థ్యం ఎంతమాత్రమూ దెబ్బతినదు. వృషణాలకు టీబీ రాకుండా ఉంటే వీర్యం ఉత్పత్తి మీద కూడా దాని ప్రభావం ఉండదు. కాబట్టి మీ సెక్స్ సామర్థ్యం విషయంలో మీకు ఎలాంటి ఆందోళన, సంకోచం అక్కర్లేదు. పెళ్లికిగాని, భవిష్యత్తులో బిడ్డలను కనడానికి గాని మీకు వచ్చి తగ్గిపోయిన జబ్బు ఎంతమాత్రమూ ఆటకం కాదు. మీరు ప్రస్తావించిన అంశాలకూ మీకు వచ్చి తగ్గిన టీబీతో ఎంతమాత్రమూ సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు.

నా వయుస్సు 37 ఏళ్లు. నాకు వివాహం జరిగి 12 ఏళ్లు. వూకింకా సంతానం లేదు. నాకు గత నాలుగేళ్లుగా వీర్యంలో ‘ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్’ ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నారుు. వుందులు వాడుతున్నంత కాలం ఈ పస్ సెల్స్ తగ్గినా... వుళ్లీ వుందులు వూనేయుగానే పెరుగుతున్నారుు. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందా?
- ఎఎమ్‌డి., రాయదుర్గం
పిల్లలు పుట్టనివారిలో వుగవారికి చేసే మొట్టమొదటి పరీక్ష సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేసినప్పుడు వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఫలితంగా సెమెన్ క్వాలిటీ తగ్గుతుంది. దాంతో పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ టాబ్లెట్లు కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ సెమెన్ అనాలిసిస్‌లో వీర్యం క్వాలిటీ వూవుూలుగా ఉంటే అప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతారుు. మీరు యూరాలజిస్ట్‌ను కలిసి వారు సూచించిన విధంగా సరైన యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు తీసుకోండి.

రెండు సార్లు ఆపరేషన్ చేశారంటే మొదట అది హైడ్రోసీలా కాదా అని సందేహం వస్తోంది. ఇక ఫైలేరియాసిస్‌లో చర్మం బాగా మందం కావడం వల్ల వాపులా అనిపించినా - వృషణానికి గాని, వృషణం చుట్టూ ఉండే పొరకు గాని దాంతో సంబంధం ఉండకపోవచ్చు. దీన్ని ఫైలేరియల్ స్క్రోటమ్ అంటారు గాని హైడ్రోసిల్ అనరు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration