Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25185 Registered: 08-2008 Posted From: 119.56.122.4
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, December 16, 2015 - 9:47 pm: | |
ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్: ఏదైనా ఏటీఎంకు వెళ్లి రూ. 100 డ్రా చేస్తే.. ఏమవుతుంది..? మన ఖాతాలో డబ్బులుంటే రూ. 100 మన చేతికొస్తాయి. లేదంటే లేదు. కానీ రాజస్థాన్లోని ఓ ఏటీఎంలో మాత్రం.. రూ. 100 డ్రా చేస్తే.. రూ. 500 వచ్చాయి. అంతేకాదండీ.. రూ. 500 డ్రా చేస్తే.. రూ. 2500, రూ. 1000 డ్రా చేస్తే.. రూ. 5వేలు వచ్చాయట. సికార్ జిల్లాలోని అజిత్గఢ్ ప్రాంతంలో ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎం నుంచి కావాల్సిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో బయటకురావడంతో స్థానికులంతా ఆ ఏటీఎం ముందు బారులు తీరారు. దీంతో సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకుని ప్రజలను అడ్డుకున్నారు. బ్యాంకు యాజమాన్యానికి సమాచారమందించారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో అప్పటికే అనేక మంది డబ్బులు డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏటీఎంకు తాళం వేసి కానిస్టేబుల్ను నియమించారు. ఏటీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయని.. ఏటీఎంను సరిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. Breath Java - Eat Scala - Drink Erlang
|