Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 98868 Registered: 03-2004 Posted From: 185.46.212.76
Rating: N/A Votes: 0 | Posted on Friday, November 20, 2015 - 9:18 am: | |
పెళ్లి వివాదం... నా పెళ్లి గురించి మీడియా రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్యను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కార్తీక్‌తో విడాకులకు ముందే విజయ్‌కు అతని భార్యతో సంబంధం ఉందనేది అప్పట్లో హల్చల్ చేసిన వార్త). నిజానికి ఇది ముగ్గురు వ్యక్తుల సమస్య. మేం ముగ్గురం ఈ సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాం. కానీ మీడియా దీనిని మరో రకంగా చూపించింది. అప్పుడేం జరిగిందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసేది సరైన పని అయినప్పుడు అదే చేస్తాను. నేనేం చేసినా నా కుటుంబం మద్దతుగా నిలబడింది. పెళ్లి విషయంలోనూ నేను స్వయంగా నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ నిర్ణయాన్ని కూడా మరో రకంగా మీడియా రాసింది. కాబట్టి దీని గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. నా తల్లిదండ్రులంటే నాకు చాలా గౌరవం. వారిని నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పెట్టకూడదు. నేనేంటో నా భార్యకు తెలుసు. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు నిర్వాన్‌కు నాలుగేళ్లు. తొమ్మిది నెలల పాప పేరు ఇవా. నిర్వాన్ అంటే సంతోషకరమైన ఆత్మ అని. ఇవా అంటే వెలుగు (నా జీవితానికి) అని అర్థం. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా జీవిస్తున్నాం .... |